కాపురాలు చేసే వారికి" తాళి "బరువు ! కంపెనీలు నడిపే వారికి "బట్టలు" బరువు !!
కాదేది అనర్హం పబ్లిసిటి స్టంట్ కు ! కాపురం చేసుకుంటున్న ఆలి ,ఆ ఆలి కున్న తాళి ఇవన్ని రాజకీయ పార్తీల పబ్లిసిటి కోసం ఉపయోగపడుతుంటె , ఆఫీసులలో పని చేసే స్తీలు , బట్టలు లేని వారి నగ్నత్వం కంపెనీల పబ్లిసిటికి ఉపయోగ పడుతున్నాయి . ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటె పార్టీలు, కంపెనీల ప్రచారం కోసం వెలగబెడుతున్న సదరు పబ్లిసిటి స్టంట్ లు "సోషల్ ఎక్స్పెరిమెంట్ " పేరుతో జరుగుతున్నవే . ఇందులో ప్రదానంగా పోకస్ కాబడుతుంది స్త్రీలే . బంగం కలుగుతుంది వారి ఆత్మాభిమానానికే . ఈ బుర్ర తక్కువ ప్రదర్శనలలో పురుషులు ఉన్నట్లు అనిపించినా , చివరకు పోకస్ అయ్యేది "తాళి లేని ఆలి , బట్టలు లేని ఉద్యోగిని " మాత్రమే . వీటి గురించి మరి కొంచం వివరంగా చెపితే కాని విషయం అర్దం కాదు. ...