"గాందీ గారి స్వాతంత్ర్యం" వచ్చేదాక "బాయ్ ఫ్రెండ్"ల సంస్క్రుతికి బై, బై చెప్పండి.
\ స్వాతంత్ర్యం వచ్చిన అరవయి అయిదేళ్లకు కూడా ఈ దేశంలో మన "జాతిపిత" గాంది గారు నిర్వచించిన "స్వాతంత్ర్యం " రానందుకు మనం సిగ్గుపడాలి. అయన జన్మ దినాలు ఘనంగా చెయ్యడం కాదు. ఆయన కలలు కన్న నిజమయిన స్వాతంత్ర్యాన్ని మనం సాదించిన నాడే ఆయనకు ఏటా నివాళులు అర్పించగల అర్హత మనకు వస్తుంది. ఏ నాడు ఆడది అర్థరాత్రి, నిర్భయంగా బయటకు వెళ్లి రాగల్గుద్దో, అ నాడే నిజమయిన స్వాతంత్ర్యం అన్నారు అయన. అయన ఆ మాట ఆ రోజు ఎందుకు అన్నారో, నిన్న డిల్లీలో జరిగిన సంఘటన చూశాక అర్థమవుతుంది. ఇది కేవలం దేశంలో శాంతి బద్రతలు సమస్యగా బావించి ఆయన ఆ మాట అని ఉండరని నా అభిప్రాయం. స్త్రీ పట్ల సమాజ ద్రుక్పదం లో మార్పు రావాలి. ఆ రోజే అది సాద్యపడుతుంది. స్త్రీని ...