నాడు హిందూ పాలకులను తెల్లవాడు విడదీసినట్లే , నేడు తెలుగు పాలకులను "వాళ్ల మతస్తులు విడదీస్తున్నారా ?!!!
ఓటుకు నోటు కేసు పుణ్యమాని ఆంద్రా , తెలంగాణా పాలకుల మద్య విబేదాలు మరొక సారి రాజుకుని , ఇరువైపులా మీసాలు మెలేసుకుని , తొడలు చరచుకునే దాకా వెలుతున్నాయి. ఇరువైపులా మెజార్టి ప్రజలు అంతో ఇంతో జ్ఞాన వంతులు కాబట్టి , ఇదంతా రాజకీయ డ్రామాలో బాగమేలే అనుకుని మెదలకుండా జరిగే దానిని చూస్తున్నారు. లేకుంటే రాజకీయ నాయకులు కి శివాలెత్తినట్లు , మెజార్టి సామాన్య ప్రజలకు శివాలెత్తితే , ఈ పాటికి పర్యవసానం వేరుగా ఉండెది. నాకు తెలిసినంత వరకు K.C.R గారు కల్లా కపటం లేని ముక్కు సూటి మనిషి. తన మనసులో ఉండెది వెళ్ళగ్రక్కుతాడు. అయన వాడె బాష కొంత మందికి బాద కలిగించినా, అయన నైజం తెలిసిన వారు అయన వలన హాని జరుగుతుందని అనుకోరు. అయన ఆలోచనలు తెలంగాణా ప్రాంత స్వార్దం గురించి ఉన్నప్పటికి , కోర్టుల ఆదేశానుసారం తన పాలన ఉండాలనే అయన కోరుకుంటాడు కాబట్టి, ప్రజాస్వామ్య వాదులు అయన పాలన గురించి అంతగా బయపడవలసిన పని లేదు. ఈ విషయం హైదరాబాద్ లోను, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆంద్రా సెటిలర్స్ మేదావులకు తెలుసు కాబట్ట