పెళ్ళాం ఎందుకు దండగ ! బొమ్మ ఉంటే పండగే పండుగ , అంటున్న భార్యాబాధితుడు!!!
ఆయన పేరు సెంజీ నకాజిమ . జపాన్ దేశీయుడు . వయసు 60+. భార్య సహచర్యం లో నిరంతరం ఆనందంగా ఉండాలని చిన్న అభిలాష . ఆయనకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ ఆయన మనసు అర్థం చేసుకోలేకపోయింది ఆయన అర్దాంగి . స్త్రీ స్వేచ్ఛ , సమానత్వం అంటూ గొడవపెట్టుకుని , తనకు కావాలసింది తాను తీసుకుని నకాజిమ కు విడాకులు ఇచ్చేసింది . దానితో అతనికి స్త్రీ జాతి మీదే విరక్తి కలిగినప్పటికీ , భార్యతో ఆనందం గా కల కాలం జీవించాలన్న అతని తపన తీరలేదు. వేరేవారి ని మళ్ళీ పెండ్లి చేసుకుందాం అంటే , స్త్రీ స్వేచ్ఛ ,హక్కులు , భరణాలు అనే తల నెప్పులు కొనితెచ్చుకోవడానికి ఆయన గారి మనసు సుతారాము అంగీకరించలేదు . మరి ఏమి చేయాలి అనుకునే తరుణం లో ఒక కంపెనీ ప్రకటన అతనిని ఆకర్షించింది. ఆ కంపెనీ ఏమిటంటే "సెక్సీ బొమ్మలు" తయారు చేసే కంపెనీ. అనివార్య కారణాల స్త్రీ లతో సహజీవనం చేయలేని దురదృష్ట వంతులైన మగవారికి సేఫ్ సెక్స్ పీలింగ్ కోసం "సెక్సీ బొమ్మలు " తయారు చేస్తుంటారు ఆ కంపెనీ వారు. వారు తయారు చేసే బొమ్మలు ఎలా ఉంటాయంటే , ఒక్క జీవం తప్పా నూటికి నూటికి ...