పెండ్లి కొడుకుని కాదని , పెండ్లి చూడటానికి వచ్చిన వాడిని పెండ్లాడిన పెండ్లి కూతురు !!!
మారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ . పెండ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటే "మనువు " అనేది దైవ నిర్ణయం!. దానిని కాదని ఎవరూ ఏమి చేసినా అది నిష్ప్రయోజనం" అని నమ్మే వారికి మంచి ఊతమిచ్చే సంఘటణ ఒకటి ఇటివల ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో జరిగింది . ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ కు చెందిన పెండ్లి కొడుకు జుగల్ కిశోర్ వయసు 25 సంవత్సరాలు . అతన్ని పెండ్లాడ బోయే వదువు ఇందిర వయసు 23 సంవత్సరాలు . పెంద్లికూతురిది రామ్ పూర్ కాబట్టి పెండ్లి రాంపూర్ లో జరపాలని ఇరువైపులా పెద్దలు నిర్ణయించి అందుకు అన్నీ సిద్దం చేసారు . పెండ్లి జరుగుతున్న తరుణం అది . ఆకాశం అంత షామియానా క్రింద ,ఆహుతుల ,బందు మిత్ర పరివార సమక్షంలో వివాహ తంతు దూందామ్ గా జరుగుతుంది . అదిగో అప్పుడు జరిగింది ,ఆ విది నిర్ణయించిన ఘటన . కొంత తంతు జరిగి పోయింది ."వర మాల " అంటే ,పెండ్లి కొడుకు ,పెండ్లి కూతురు పరస్పరం దండలు మార్చుకునే ప్రక్రియ మొదలైంది .సాంప్రదాయమ్ ప్రకారం మొదటగా వరుడు వదువు మెడలోఠీవిగా వర మాల వేయబోతు చేతులు ముందుకు చాచాడు .