తెలంగాణా లో R.I లను గిర్దావర్ లుగా మార్చినోళ్లు , S.I లను రజాకార్ లుగా మారుస్తారేమో !!?
భవిష్యత్ లో తెలంగాణా రెవిన్యూ జాబ్స్ నోటిఫికేషన్ పాకిస్తాన్ లో మాదిరి ఇలాగే ఉండబోతుందా ? ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయేటప్పుడు తెలంగాణా అభివృద్ధి గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి .ఆ అనుమానాలను పటాపంచలు చేయడంలో సపలమయ్యారు తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ కలువకుంట్ల చంద్ర శేఖర రావు గారు.అయితే కొన్ని తెరచాటు వర్గాలు ఆయన్ని ఎలా అయిన అప్రతిష్టల పాలు చేయాలని చూస్తున్నట్లు ఉన్నాయి. అందులో భాగంగా తమ ఇష్టాలను ప్రజల మీద రుద్దుతూ ఇదంతా ముఖ్యమంత్రి గారి ఇష్ట ప్రకారమే జరుగుతున్న దని.ప్రజల్ని నమ్మిస్తూ వారిని నోరెత్త కుండా చేస్తున్నారు.అందులో భాగమే ఇటీవలి రెవిన్యూ అధికారుల హోదా పేర్లు మార్పు విషయం. జాగీర్దారీ భూస్వ...