T.V స్టూడియో లలో కుటుంబ వ(వి )లువలు ఊడదీస్తున్న మహిళా దుశ్యాసన త్రయం జీవిత , సుమలత , జయసుధ !!
ప్రపంచం లో ఉన్న సమాజాలు అన్నింటిలో భారతీయ సమాజం కి ఉన్న విశిష్టత ఏమిటంటే , మన సమాజం లో ఉన్న పటిష్టమైన కుటుంబ వ్యవస్థ . రాజ్యం కంటే బలమైనది కుటుంబ వ్యవస్త. మన దేశం అనేక సార్లు విదేశి దండ యాత్రలకు గురి అయి , కొన్ని వందల సంవత్సారాలు పాటు విదేశి పాలనలో మగ్గినప్పటికి , మన బాషలు, సంస్క్రుతి , కుటుంబ విలువలు నిరంతరాయంగా పరిరక్షింప బడ్డాయి అంటె కుటుంబ వ్యవస్తలో వీదేసియులు ఎక్కువుగా జ్యోక్యం చేసుకోక పోవడం , అలాగే సామాన్య ప్రజానీకం విదేశి సంస్క్రుతి పట్ల ఎక్కువ ఆకర్షితులు కాకపోవడం. కాని ప్రజలకు జ్ఞానం కంటే ముందు స్వాతంత్ర్యం రావడం , విదేశియులు ఒక ప్లాన్ ప్రకారం, తమలో ఉన్న వ్యాపార కాంక్ష అనే డ్రాక్యులా ని ఈ దేశం లోని కొంతమందికి ...