ఆంధ్రా అసెంభ్లికి దారేది అంటున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగ్రేటం పై ఒక పరిశిలన !.
పవన్ కళ్యాణ్ ! వేలాది అభిమానుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న తెలుగు నటుడు . మెగా స్టార్ తమ్ముడిగా సినిమా రంగానికి పరిచయమయినా , ఆనతి కాలంలోనే తన ప్రత్యెక మేనరిజం తో అభిమానులను ఆకర్షించ గలిగాడు . దానివలన అయన సినిమాలు బాక్సపిస్ వద్ద విజయాలు నమోదు చెసుకున్నాయి. అయన కున్న ప్రత్యెక మేనరిజాలలో సరిగ్గా నిలబడి ఎక్కడా డైలాగ్ చెప్పక పోవడం ఒకటి . నిలబడి డైలాగే చెప్పలేని వాడు , నిజజీవితం లో మాట మిద నిలబడగలుగుతాడా అని అయన విమర్శకుల ప్రశ్న . అలాగే అయన వైవాహిక జీవితంలో అస్తిరత్వం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. నిలబడి డైలాగ్ చెప్పలేని మేనరిజానికి , అయన వైవాహిక జీవితంలో అవలంబిస్తున్న అస్తిర చర్యలకు ఏమైనా సంబందం ఉందా అనేది మానసిక ప్రవర్తనా విశ్లేషకులు చెప్పాలి తప్పా, రాజకీయ విశ్లేషకులు కాదన్నది నిర్వివాదాంశం . ఇక పొతే బయట అయన ప్రవర్తించే తీరు . అయన మనసులో అనంత కోటి బావాలు ...