నిత్యానందమనేది కాంతల కౌగిళ్లలో ఉండేది కాదు........!
వీరబ్రహ్మం గారు తన కాలజ్గ్నానం లో "కలి యుగాంతంలో- "ఉల్లిపాయకు ఉపదేశమిచ్చే కల్ల గురువుల్లోస్తారు, కల్ల గురువులను కాల్చి వేయ కల్కిఅవతారుడు వచ్చేను" అంటారు. కల్కిఅవతారం సంగతేమో కాని కల్ల గురువులైతే వచ్చేసారు. రావడమేంటి! ఎడా పెడా ఉపదేశాలు, బోదలు, ఉదరగొట్టడాలు, వాళ్లు పోవడాలు,వాళ్లు మిగిల్చిన ఆస్తులు కోసం వారసులు కొట్టుకోవడాలు అన్ని చక చకా జరిగి పోతూనే ఉన్నాయి. అసలు ఈ రోజుల్లొ కాషాయ వస్త్ర దారణ కూడ పెద్ద వ్యాపారమైపొయింది. చిన్నప్పుడు అమ్మా బాబులని వదలి ఇండ్లలోంచి పారిపోయి, గాలికి తిరిగి, గారడీలు నేర్చుకునిప్రజల్ని తమ మాజిక్లతో బుట్టలో పడెసుకొని బాగా సంపాదించి,,ఆశ్రమాలు(విలాసవంతమైన ఆరామాలు) నిర్మించుకుని, సర్వ బోగాలు అనుభవిస్తు, హాయీగా కాలక్షేపాలు చేస్తున్న ఈ సో కాల్డ్ గురువులు నిజంగా హిందు మతానుసారం గురువులనబడినటానికి అర్హులా?.విశ్లేషిద్దాం హిందూ మతమనేది నిజంగా ఇతర మతాల వలే ఒక మతం కాదు . అది జీవన విదానం .సాక్షాతు మన సుప్రీమ్...