ఇప్పట్టి దాక "నిత్యానందిని " అయిన రంజిత ఇక నుంచి "మాతా ఆనందమయి " అట!.
ఆశ్రమం అంటే అర్దం మారిపోయిన రోజులివి. హిందూ తాత్విక దృక్పదం లో ఆశ్రమ అంటే దశ అని అర్దం. ప్రతి వ్యక్తి జీవితం లో నాలుగు దశ లు ఉంటాయని ఆ యా దశలలో నిర్వర్తించిన బాద్యతలు గురించి "మను ధర్మ" శాస్త్రం లో విపులంగా చెప్పబడింది. దాని ప్రకారం హిందువు అయిన ప్రతి ఒక్కరు 4 ఆశ్రమం లలో అంటే 4జీవన దశలో ఏదో ఒక ఆశ్రమం లో ఉన్న వారే. అలాగే "సంసారి కాని వారికి సన్యాసి అయ్యే అర్హత లేదు" దీని గురించి వివరం గా తెలుసుకోవాలంటే (కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే.http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_18.html
ని క్లిక్ చేసి చూడండి)
అయితే ఈ కలి కాలం లో అన్నీ మారినట్లే ఆశ్రమ విదానాలు మారాయి . ఆశ్రమం అంటే పెండ్లి కాని సన్యాసులు ఉండే బోగలాలస మందిరాలు అనే అర్దం వచ్చేలా కొందరి వ్యవహార శైలి ఉంది. ఆ మద్య మీడియాలలో సంచలన వార్తలు కు కేంద్ర బిందువులు అయిన బెంగలోర్ లోని నిత్యానందుని ఆశ్రమం , అందులో తమిళ నటి రంజిత భక్తీ పారవశ్యం , ఇవ్వన్నీ సాంప్రదాయా హిందూ సమాజాన్ని ముక్కున వేలేసుకున్నట్లు చెయ్యడమే కాక, హిందూ ప్రతిష్టను దిగ జార్చేవిగా ఉన్నాయి. దీని గురించి (నిత్యానందమనేది కాంతల కౌగిళ్లలో ఉండేది కాదు......
http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_5.html )లో చెప్పడం జరిగింది.
నిత్యానందుడు , రంజిత ఇరువురూ ఆశ్రమం ని రాసలీల ల మందిరం గా మార్చారని దేశం లోని మిడియా యే కాక , విదేశి మీడియా సైతం ప్రసారాలు చెయ్యడమే కాకుండా నిత్యానందుని మీద పోలిస్ కేసు పెట్టడం కూడా జరిగింది. వారిద్దరూ కలసి ఉన్నట్లు చూపుతున్న విడియో దృశ్యాలు మార్పింగ్ చేయబడినవి అని తర్వాతి కాలం లో చెప్ప బడినా దానిని విశ్వసించే వారు నిత్యానందుని భక్తులు మాత్రమే.
ఇంత జరిగినా రంజిత ఆశ్రమం వదలలేదు. పై పెచ్చు ఇప్పుడు ఆమె మొన్న 27 వ తారీకున ఆశ్రమం లో నిత్యానందుని చేత "సన్యాసిని " దీక్ష తీసుకుని "మాతా ఆనంద మయి" గా మారి పోయిందట!. అంతే కాకుండా ఆమెకు ఆశ్రమం లో విదేశి భక్తుల విభాగం నిర్వహణ అప్ప చెప్పారట. అవును మరి కోట్ల కొద్ది దనం వచ్చే విబాగానికి అధిపతిగా నిత్యానందునికి నమ్మక మయిన వారు మరియు కాషాయ వస్త్రదారులు ఉండాలి. అందుకే ఆ నిత్యానందినికి దీక్ష ఇచ్చి "అమ్మా ఆనందమయి" ని చేసారు. అంటే ఇప్పట్టి దాక స్వదేశీ "నిత్యానందిని " అయిన రంజిత ఇక నుంచి విదేశి "మాతా ఆనందమయి " అన్న మాట. ఔరా కలి ! నీవు ఎటువంటి వారిని ఎటువంటి వారిగా మారుస్తున్నావు? నీ ప్రబావం నుండి మా హిందూ సమాజాన్ని కాపాడ గల ఆ కల్కి అవతారం వచ్చే దాక ఈ కల్ల గురువుల బో(బా)దలు తప్పవా!?. .
Comments
Post a Comment