మగాడు మ్రుగాడిగా మారటానికి అతనిలోని "హార్మోన్ల ప్రబావం " కారణమా!?.


                                                        

ఈ విషయం గురించి పరిశోదించి చెప్పవలసింది శాస్త్రజ్ణులే. నాకు ఈ  ఆలోచన రావడానికి కారణం నిన్న ఒక ఆర్టికిల్ చదివాను అందులో చింపాజీలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో లో గల "లో లాండ్" ఫారెస్ట్ లోని చింపాంజీ  ల మీద చేసిన పరిశోదనల్లో తేలిన సారాంశం ఏమిటంటే మామూలుగా చూడటానికి చింపాజీలు , బొనోబో లు ఒకే లాగా ఉన్నప్పటికి , వాటి ప్రవర్తనల్లో చాలా వైవిధ్య ముందట.

   బొనోబో లు చింపాంజీలు కంటే ఎక్కువ శాంతంగా ఉంటూ ఆడ బొనోబోలతో సఖ్యంగా కలసి మెలసి ఉండటానికి ఇష్టపడతాయి అట. అలాగే యుక్తవయస్సు వచ్చే వరకు తల్లి తోనే ఉంటాయట. కానీ అదే చింపాజీలు విషయానికి వచ్చే సరికి అవి యుక్త వయస్సు రాక ముందే తోటి మగ చింపాంజీలతో కలసి ఆడ చింపాంజీల మీద ఆదిపత్యం చెలాయించడానికి పరస్పరం సహకరించుకుంటో ఉంటాయట. అదే విదంగా ఆడ చింపాంజీల మీద ఆదిపత్యం కోసం కూడా తరచూ ఘర్షణలు పడుతూ ఉంటాయట. అంటే ఇంచు మించు మనుషులుకు ఉండె బుద్ది  మాదిరే చింపాంజీలకు ఉందన్న మాట. ఇలా ఒకే జాతిలో ఈ  వైవిద్యం ఉండటానికి కారణం కేవలం వాటిలోని హార్మోన్ల ప్రబావమే అని ప్రాదమిక పరిశోదనలో తేలింది .

   చింపాంజీలలో థైరాయిడ్ హార్మోన్ స్తాయిలు  10 సంత్సరాల వయస్సు వచ్చే  నాటికి తగ్గిపోతాయి అట. అదే బొనోబో లు అయితే 20 సంవత్సరాల వరకు అలాగే ఉంటాయి అట. ఈ  థైరాయిడ్ హార్మోనే స్త్రీ బోనోబోలతో కలసి మెలసి సఖ్యతగా ఉండటానికి కానీ , తల్లి బొనోబోలతో ఎక్కువకాలం కలసి ఉండటానికి కానీ,  కారణం అని శాస్త్రజ్ణులు ఒక అంచనాకు వచ్చారు. అదే చింపాంజీలలో అయితే 10 సంవత్సరాలకే థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోవడం వలన అవి జీవన విదానంలో ఎప్పుడూ ఘర్షణ వైఖరి ప్రదర్శిస్తూ ఉంటాయి అట. ఆడ చింపాజీల ను కట్టడి చేసే విషయం లో మాత్రం తోటి మగ చింపాంజీలతో సహకరించుకోవడం ఆశ్చర్య కరమైన విషయం. ఏది ఏమైనా దీని మీద ఇంకా పూర్తీ పరిశోదనలు జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి , శాస్త్రజ్ఞులు ఆ పనిలో ఉన్నారు .
ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే మానవుడి లోని D.N.A  , చింపాంజీల D.N.A  లతో 97% కలుస్తుందట. మనలో కూడా  యుక్త వయస్సు సమయం నాటికి థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి ఆట. అందుకే మన ప్రవర్తన చింపాంజీల ప్రవర్తన కు దగ్గరగా ఉన్నదా? అలాగే మ్రుగాళ్ళుగా ప్రవర్తిస్తున్న వ్యక్తులలో ఏదైనా హార్మోన్ సమ తుల్యతా దెబ్బ తిని వారు ఆ విదంగా విపరీత ప్రవర్తనకు ఒడికడుతున్నారా? అలా అయితే ఆ హార్మోన్ ఏమిటి? పరిశోదించి  కనుగొనవలసిన అవసరం ఉంది. ఇది స్త్రీల మీద జరుగుతున్నా లైంగిక దాడులను అరికట్టడం లో ఉపయోగ పడవచ్చు.

పురుషులందు పుణ్య పురుషులు వేరయా ! అంటాడు వేమన. అంటే మామూలు పురుషులు చింపాంజీలు లాంటి వారైతే , పుణ్యపురుషులు "బొనోబో" లు లాంటి వారన్న మాట. ఒక వేళ బవిష్యత్ లో, మ్రుగాళ్ళు గా మారడానికి కారణం హార్మోన్ల లోపమే అని తేలితే 'రేప్" లకు కటిన శిక్షలు ఉండవు. నేరస్తులను హాస్పిటల్ కి పంపి  తక్కువైన హార్మోన్ లు నింపి ఇంటికి పంపిస్తారు అన్నమాట. బాదితులకు నష్ట పరిహారాలు మాత్రమే ఇవ్వబడతాయి. మ్రుగాళ్ళని మనుషులుగా  మార్చటానికి సామాజిక పరంగా చాలా కాలం పట్టవచ్చు.స్త్రీల మీద ఆదిపత్యం చెలాయించాలన్న మగబుద్ది సామాజిక పరమైనదే కాక ,  పారంపర్య జీవ క్రియలలో బాగంగా ఒక తరం నుండి ఇంకొక తరానికి సంక్రమిస్తూ వస్తున్నది కావచ్చు . దీనికి తగిన కారణం , చికిత్సా రెండూ కనుకునే అంత వరకు సామాజిక సాంప్రాదాయ రక్షణా విదానాలే ఇంక్లూడింగ్ కఠిన శిక్షలే   స్త్రీలకు శ్రీ రామ రక్ష.


చంచల మైన మగబుద్ది నుండి స్త్రీలు ఎలా జాగర్త పడాలో తెలిపే ఈ  వీడియో లింక్ ను చూడండి.
       

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!