'ప్రజా పతి ' అవుతాడేమోనని ఆశపడుతుంటే , పర్మనెంట్ పతి కావడానికే జీవిత కాలం సరిపోనట్లుంది!.

                                                       


స్తిర చిత్తుడు కానివాడు ఏదీ సాదించలేడు. ఒక వ్యక్తీ యొక్క వైవాహిక జీవితం అతని పర్సనల్ మేటర్ కావచ్చు. కానీ కొన్ని వేల మందికి ఆరాద్య నీయుడు గా ఉన్న వాడు కొన్నిక్రమమైన  జీవన పద్దతులు అవలంబించవలసి ఉంది . తెలుగు సినీ అభిమానులలో ఒక అత్యున్నత స్తానం సంపాదించుకున్న ఒక  సినీ హీరో నిజ జీవితం లో మాత్రం చంచల మనస్తత్వం గలవాడిగా మిగిలి పోవటం విది లిఖితం . .

  బార్యా భర్తల బందం అనేది జన్మ జన్మ ల బందం అని హిందువుల నమ్మఖ్ఖం. పెండ్లి చేసుకోవడానికి పూర్వమే అన్నీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని తన వాళ్లకు  నచ్చిన , తను మెచ్చిన అమ్మాయితో సంసార గృహంలోకి అడుగు పెడతాడు మగవాడు  . అలా మొదలైన వారి సంసారం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడి విజయం సాదిస్తుంది అంటే జీవిత బాగస్వామి మీద ప్రేమాభిమానాలు తో పాటు స్తిరమైన మనస్సు, సర్దుకు పోయే గుణం ఉండబట్టే ఇది సాద్యపడుతుంది. భారత దేశంలో ఇంచు మించు మెజార్టీ ప్రజలు అటువంటి నిబద్దతను కలిగి ఉంటున్నారు.

    ముస్లిం లలో 4 గురు బార్యలను స్వికరించడానికి వారి పర్సనల్ చట్టాలు అనుమతిస్తున్న ఎవరూ ఆ పని చెయ్యడం లేదు. కారణం ఏక పత్నీ విదానంలో ఉన్న సంసార బంద ద్రుడత్వం ,సౌఖ్యం  బహుపత్నీ విదానం లో ఉండదు. ప్రస్తుత సామాజిక జీవన విదానం లో అది అసలు కుదరని పని. కానీ ఈ  మద్య వివాహ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని చెడగొట్టే ఒక కొత్త విదానం మన సమాజం లోకి వచ్చింది . అదే సహచర్య జీవన విదానం. మనిషి యొక చంచల బుద్దికి తోడుగా స్వేచ్చా , స్వాతంత్ర్యాలు తోడైతే అది సహచర జీవన విదానానే కోరుకుంటుంది.
              కోతి మనస్సు  దేనిని పూర్తిగా ఆస్వాదించలేదు. దాని లో ఏ రుచి ఉందో , దానిలో ఏ రుచి ఉందో అనుకుంటూ అన్నింటిని రుచి చూడటానికే ఉవ్విళోరుతుంటుంది . అలాగే అటువంటి మనస్సు ఉన్న మనిషీ కూడా  , ఒకరితో కాపురం మొదలు పెట్టి , వారితో సరిపడక ఇంకొకరిని, ఆ తర్వాత ఇంకొకరిని  కట్టుకుంటుంటే అది సినిమా లో O.K  ఏమో కానీ నిజ జీవితంలో మాత్రం ఆ వ్యక్తీ స్తిర చిత్తుడు కాదని తేల్చి వేస్తుంది. స్తిర చిత్తు డు కానీ వాడు వైవాహిక జీవితానికి అనర్హుడు. అటువంటి వారికి సహచర జీవితమే కరెక్టు.కానీ వారు కూడా పెండ్లి కావాలని కోరుకోవడమే వింత. బహూశా  సహధర్మ చారిణీ గా పర్మనెంట్ పోస్ట్ లో లేకపోయినా , సహచారీణీ అనే టెంపరరీ పోస్టుకైనా ఒక చట్ట బద్దమైన గుర్తింపు ఉంటుందని  సహచారిణుల  కోరిక మీద అలా పెండ్లిళ్ళు చేసుకుంటుండ వచ్చు .

  తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటించాకా సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీకి  నూకలు చెల్లుతున్న తరుణంలో 'చిరంజీవి గారి లాంటి పాపులర్ వ్యక్తీ బయటకు వచ్చి సమైఖ్య జెండా చేపడితే , సీమాంద్రాలో లాభం కలిగిఉండేది అని విశ్లేషకులు బావించారు. అలాగే ప్రస్తుత రాజకీయ సంక్షోబం లో సీమాంద్రాలో పాపులారిటీ ఉన్న ప్రజా నాయకుల కొరత ఉంది. ఎప్పుడో కామన్ మాన్ ప్రొటక్షన్ అని ఊగి పోయినా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు , ఇప్పటి పరిస్తితులను తెలివిగా ఉపయోగించుకుంటే ప్రజా నాయకుడు అయ్యే అవకాశం  ఉందని ఆలోచించిన వారూ ఉన్నరు. కానీ అయన మొన్నీ మద్యనే తన రెండవ బార్యకు విడాకులు ఇచ్చి మూడవ బార్యగా , తనతో కొన్నాళ్ళు సహచరించిన వీదేశి  వనితను రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు రిజిస్త్రార్ గారు ప్రకటించ్జారు. ఈ  దెబ్బతో ఈయన కూడా ప్రజా నాయకుడు అయ్యే అవకాశం పోగుట్టుకున్నట్లే. అసలే ఒక విదేశి కోడలు దెబ్బకు విల విల లాడుతున్న తెలుగు ప్రజలు , అసలు విదేశి వనితలను వివాహ మాడే వారిని హిట్ లిస్ట్ లో పెట్టేస్తారు. పాపం అభిమానులంతా' పవనిజం' ఆయన్ని ప్రజా పతిని చేసుద్దేమో అని ఆశ పడుతుంటే ఆయనేమో అసలు పర్మనెంట్ పతి  అనిపించుకోవడానికే  నానా తంటాలు పడాల్సి వస్తుంది.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!