కుహానా లౌకిక వాదాన్ని కూల్చివేస్తున్న భారతీయ యువత !
ఈ రోజు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల పలితాలు సరళీ గమనిస్తుంటే ఒక విషయం సష్టమవుతుంది. అబద్దాలతో అందరిని ఎల్లకాలం మోసం చెయ్యలేరు. అలాగే ఇన్నాళ్లు మత వాద పార్టీ అని ముద్ర వేసి B.J.P ని కుహానా లౌకిక వాద కాంగ్రెస్ పార్టీ ప్రజలను మబ్య పెట్టి తన పబ్బం గడుపుకుంటూ వచ్చింది. కానీ అసలు లౌకిక వాదం అంటే నీ,నా అనే బేద భావం లేకుండా అన్ని వర్గాల ప్రజలను దోపిడి చెయ్యడమే అనే ఒక కొత్త అర్దాన్ని అధికార కాంగ్రెస్ చెప్పింది. ఇన్నాళ్ళు ఈ పార్టీ ఆడింది ఆటగా , పాడింది పాటగా సాగటానికి కారణం కాంగ్రెస్కి సాంప్రాదాయంగా ఉన్న ఓటు బాంక్ . స్వాంతత్ర్యోద్యమం లో ఆ పార్టీ చేసిన కృషి తాలూకు పలితాన్ని నెహ్రూ కుటుంబం ఇన్నాళ్ళు అనుభవిస్తూ వస్తుంది. వృద్ద తరం లో ఆ పార్టీ పట్ల ఉన్నఅభిమానం , నెహ్రూ కుటుంబం పట్ల ఆరాధనా బావం గా గా మారి ఆ కుటుంభ వారసులనే డిల్లీ గద్దె పైన కోర్చొబెడుతో వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఒక్క చరిత్రను తర తరాలు కీర్తీంచేలా ఉండాలంటే స్వాతంత్ర్యం రాగానే ఆ పార్టీని రద్దు చెస్తే మంచిదని గాందీజి అభిప్రాయపడ్డారు. కానీ నెహ్రూ గారికి ఈ దేశ ప్రజల ఆలోచనా విదానం మీద ఉన్న అప నమ్మక్కం వలన ఆ పార్టీని రద్దు చేయలేదు. పైపెచ్చు, గాంది గారి ఇంటి పేరును తన కూతురు ఇంటి పేరుగా మార్చి, తన కుటుంబాన్ని గాంది గారి కుటుంబంగా రిజిస్టర్ చేసి భారతీయులలో గాంది గారి పట్ల ఉన్న ఆరాధనా బావ ఆస్తిని తన కుటుంబానికి ట్రాన్స్పర్ చేసి , దాని పలాలను అధికార రూపంలో ఇప్పటి వరకూ అయన కుటుంబమే అనుభవించేల చెయ్యడం లో సక్సెస్ అయ్యారు. ఈ దేశ ప్రజలు ఎంతగా నెహ్రూ కం గాంది కుటుంబని ఆరాదిస్తున్నారు అంటే ఆఖరకు రాజకీయాలలో తా అంటే తూ తెలియని విదేశి కోడలు సోనియా గారిని కూడా ఈ జాతికి నేత అని కీర్తింఛి అదికారం కట్టబెట్టెంతగా .
మరి అటువంటి బలమైన ఆరాధనా కంచుకోటను బద్దలు కొట్టాలంటే సాంప్రదాయక వృద్ద వోటర్లు ఉన్నంత కాలం ఎవరి వల్ల కాలేదు. మద్య మద్యలో ఏదో అప్పటి పరిస్తితులాను సారం శ్రీ వాజ్పేయి గారి పట్ల ఉన్న నమ్మకం వలన కొంత కాలం B.J.P డిల్లి గద్దె ఎక్కినా, అది కాంగ్రెస్ ఆరాధనా బావాన్ని పూర్తిగా తొలగించలేక పోయింది. కానీ ఇప్పుడు వృద్ద తరం కనుమరుగు అవుతుండడం, యువ తరం పెరుగుతుండడం లో వారు ప్రస్తుత పరిణామాలను అంచనా వేస్తూ , కాంగ్రెస్ చెప్పే కాకమ్మ కదలను,కుహన లౌకిక వాదాన్ని నమ్మడం మాని వేసి , గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ మోడి గారి పరిపాలన పలితాలను బేరిజు వేసి చూసి, ఆయనను తమ రోల్ మోడల్ గా ఆరాదించడం మొదలు పెట్టారు. అది గమనించిన B.J.P , తెలివిగా ఆయననే తమ ప్రదాని అబ్యార్దిగా ప్రకటించడంతో ,ఇక భారతీయ యువతకు ఆయనే ఆరాద్య పురుషుడు అయ్యాడు. అందుకే ఈ ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల్లో B.J.P విజయ కేతనం ఎగురవేయ గలుగుతుంది.
మన దేశం లో కుల, మత, వర్గంలు కాక , వ్యక్తుల మీద నమ్మకాలు, ఆరాదనలే పార్తీల విజయ అవకాశాలను నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తీ ,లేక కుటుంబం సాదించిన విజయాలు, ఆ వ్యక్తికీ, లేక కుటుంభానికి అంటగట్టి వారిని ఆరాదించడం ఈ దేశ ప్రజల సాంప్రాదాయం. దానిని ఏ బావజాలాలు , పిడివాదాలు మార్చ లేవు. ఒక్క సారి నమ్మితే అది తమ తను పర్యంతం కొసాగించడం ఈ దేశ ప్రజల అలవాటు . అందుకే ఇన్నాళ్ళు కాంగ్రెస్ ఆడింది ఆట, పాడింది పాట అయింది. కానీ దేవుని దయ వల్ల రాహుల్ గాంది మీద ఈ దేశ యువత ఆరాధన పెంచుకోక ముందే , నరేంద్ర మోడి రంగ ప్రవేశం చేసి , తన సమర్ధతతో వారి హృదయాలను చోర గొనడం వలన ఎన్నికలలో విజయం సాద్యపడుతుంది. ఇదే ట్రెండ్ రేపు పార్ల మెంట్ ఎన్నికలలో ఆవిష్క్రుతమవుతుంది అనడంలో ఎట్టి సందేహం లేదు. కాంగ్రెస్ , B.J.P , తెలుగుదేశం ,Y.S.R కాంగ్రెస్ విజయాలు అనేవి ఇవ్వన్నీ పైకి కనపడే రాజకీయ పార్టీల విజయాలు మాత్రమే, కానీ వీటి ప్రదాన నాయకుల లేక వారి వారసుల సమర్ధత, మరియు వారి పట్ల ప్రజకున్న ఆరాధన బావమే ఆ యా పార్టీల విజయావకాశాలు నిర్ణయిస్తాయి అని, ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి
Comments
Post a Comment