తెలంగాణా బిల్లు తో బట్టబయలు కానున్న కాంగ్రెస్ హై డ్రామా భండారం!
బ్రతకని బిడ్డ బారెడు అన్నట్లు , 2014 ఎన్నికల లోపు ఏదో విదంగా తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి , ఆ తర్వాత ఏమి జరిగినా దాని బాద్యత అంతా ప్రతిపక్షం మీద నెట్టి ,తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నప్పటికి, ప్రతి పక్షాల కుట్ర వల్లే అది సాధ్య పడలేదు అని చాటాలనుకుంటుంది,అదికార కాంగ్రెస్ పార్టీ . అసలు ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపడం లో కేంద్ర హోం శాఖ ప్రదర్శించిన అతిఉత్సాహం చూస్తుంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఎన్నికల లోపు సాద్యం కాదని కేంద్రం కూడా ఒక ద్రుడాభిప్రాయానికి వచ్చే,నష్ట నివారణ కోసం డ్రామాలకు తేర తీసింది అని అనిపిస్తుంది. ఈ విషయం మీద ఒక అవగాహనకు రాబట్టే B.J.P పార్టీ సైతం తమ ప్రభుత్వం ఏర్పడ్డాకా , అటు సీమాంద్ర ,ఇటు తెలంగాణా ప్రజలకు సమన్యాయం కలిగేలా రాష్ట్ర విభజన చెయ్యటం జరుగుతుంది అని ప్రకటించింది.
G.O.M కు A.G ఇచ్చిన న్యాయ సలహా మేరకు 371 D సవరణ లేకుండా తెలంగాణాకు 371 D వర్తింప చెయ్యడం అసాద్యం. దాని కోసం 2/3 వంతు మెజార్టీ తో పాటు సగం రాష్ట్రాల అనుమతి అవసరం అని A.G గారు స్పష్టంగా కేస్ లా సహితంగా చెప్పటం జరిగింది. ఇదంతా చెయ్యాలంటే ఎన్నికల లోపు అసాద్యం. ఎన్నికలలో తమ పార్టీ కేంద్రం లో అధికారానికి వస్తుందనేది నమ్మఖ్ఖం తక్కువే. మరి ఇటువంటి పరిస్తితుల్లో ఏమి చెయ్యాలి? ఇంత దూరం వచ్చాక రాష్ట్ర విబజన చేసినా , చేయకున్నా సీమాంద్రాలో కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయం. తెలంగాణా ఇవ్వకుంటే ఖచ్చితంగా తెలంగాణా లోను పార్టీ అడ్రెస్స్ అనుమానమే. అటు చూస్తె , ఇదంతా గ్రహించే కాబోలు, K.C.R తన పార్టీ విలీనం గురించి ఆసక్తి చూపడం లేదు. ఇలా రెంటికి చెడ్డ రేవడి అయ్యే బదులు ఏదో తెలంగాణా ఇవ్వడానికి తాము ఎంతో ఆత్రంగా ఉన్నట్లు, కానీ కేవలం కొంతమంది కుట్ర వలనే ఎన్నికల లోపు అది సాద్యం కానట్లు తెలంగాణా ప్రజలలో ఒక బావం ఏర్పడడానికే డ్రామాలు ఆడటం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ! .
ఉదాహరణకు మొన్న ముసాయిద బిల్లు సంగతే చూడండి. దానీ మీద అసెంబ్లీ అభిప్రాయం కొరకు రాష్ట్రపతి గారు ఇచ్చిన గడువు 40 రోజులు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న మేజార్టీ సీమాంద్రా M.L.A లు ఉన్న ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ నుండి 40 రోజులకు ముందే అభిప్రాయం రాష్ట్రపతి గారికి చేరుతుందనుకోవడం కల గనడమే ,అని ఇంగిత జ్ఞానం ఉన్న వారేవారికైనా అర్దం అవుతుంది. మరి ఏమి కొంప ముంచుకు పోయిందని హోం శాఖ యుద్ద విమానం లో ఒక ప్రత్యెక అధికారి ద్వారా రాష్ట్ర గవర్నర్ గారికి కి ముసాయిదా బిల్లు పంపింది? పోని నిజంగా చిత్త శుద్ది ఉంటే నిబందనల ప్రకారం 3 బాషలలో ప్రతులు పంపించాల్సి ఉండగా , ఒక ఇంగ్లీష్ ప్రతినె ఎందుకు పంపినట్లు? ఇప్పుడు వాటిని తర్జూమా చేసి ,M.L.A లు అందరికి ప్రతులు పంచేసరికి ఎంత కాలం పడుతుంది. ఇంతోటి దానికి యుద్ద విమానం అవసరమా? సదరు యుద్ద విమానం హైదరాబాద్ చేరినది మొదలు రాష్ట్రం లోని మీడియా పోకస్ మొత్తం దాని మీదే. హోం శాఖ సెక్రటరి సురేశ్ అనే అధికారి ముసాయిదా బిల్లు బండిల్స్ జాగర్తగా దింపించుకుని, రాష్ట్ర P.S గారికి చేర్చే అంత వరకు మీడియాలో లైవ్ షో లూ , స్క్రోలింగ్ ల మీద స్క్రోలింగ్ లు. ఎవరిని మబ్య పెట్టడానికి ఇదంతా! తీరా చూస్తె నో ట్రాస్లేషన్ కాపీస్! ఇవేవి చూసుకోకుండా తెలంగాణ నాయకులు, P.S మీద సబా హక్కుల నోటిసులు! అసహ్యం వేస్తుంది ఈ డ్రామాలు చూస్తుంటే! నిజంగా చదువుకున్న వారేనా వీరంతా అనిపిస్తుంది. ! దొరల గడిలో పని చేసే వారంతా రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. .
నిజంగా 2014 ఎన్నికల లోపు రాష్ట్ర విభజన సాధ్య పడుతుంది అని T.R.S వారు నమ్మి ఉంటే ఖచ్చితంగ తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఉండేవారు. అలాగే కాంగ్రెస్ పార్టి కూడా పార్టీ పరువును బజారు కీడుస్తున్న, పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకుని ఉండెది. పార్టి నిర్ణయాన్ని సవాలు చేసిన ముఖ్యమంత్రి గారిని మార్చివేసేది . సీమాంద్రా నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి ఒక ఏకాభి ప్రాయానికి వారిని తీసుకు వచ్చేది. రేపు B.J.P వస్తే ఏమి చేస్తుందో , అదే పని ఈ రోజు కాంగ్రెస్ చేసేది. కాని చెయ్యటం లేదు. ఏందుకు? 2014 ఎన్నికలలో ప్రజా తీర్పు కోరకుండా, 371 D తో ముడి పడి ఉన్న ఆంద్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని "టేబుల్ ఐటం " తీర్మానాలతో విబజించడం అసంబవం అని కేంద్రం ఒక ద్రుడాభి ప్రాయానికి వచ్చింది కనుక. కాబట్టి డ్రామాలతో తెలంగాణా ప్రజలలో ఉన్న తన ఇమేజ్ ను కాపాడుకోవాలని చూస్తుంది. డ్రామాలతోనే 2014 ఎన్నికలలో లాభం పొందాలని చూస్తుంది. చూదాం ఈ డ్రామాలకు తెరపడే దెప్పుడో!?
ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం! B.J.P వారు ఎలాగు తెలంగాణా ఇస్తాం అని వాగ్దానం చేసారు కాబట్టి , ఇవాళ కాకపోతే రేపైనా తెలంగాణా వస్తుంది అని తెలంగాణా వారు ఆశతో ఉన్నారు తప్పా , డ్రామాలు వేసే కాంగ్రెస్ మాటలు మీద నమ్మఖ్కం తో మాత్రం కాదు. అసలు K.C.R గారికే నమ్మక్కం లేదు కాంగ్రెస్ మీద అనేది అయన మాటలలోనే అర్దమవుతుంది. తెలంగాణా కాంగ్రెస్ నాయకులకే కొంచం ఆత్రంగా ఉంది. తెలంగాణా క్రెడిట్ అంతా ఎకడ T.R.S ఒక్కటే కొట్టేస్తుందో అని భయం వారికి. అందుకే జైత్ర యాత్రలు, సోనియాకు గుడులు కట్టడం. ఒక వేళ కొంపదీసి సీన్ రివర్స్ అయితే , తెలంగాణా లో సోనియాకు గుడులు కట్టిన వారే కాంగ్రెస్ వారికి గుండ్లు కొడతారు అనేది ఖాయం. .
Comments
Post a Comment