ఈడొచ్చినా యువరం లేనోళ్ళు , పదవి వచ్చినా లౌక్యం తెలియనోళ్ళు ,అచ్చంగా ఈయన లా ఉంటారు!.

                                                         


డిల్లీ ప్రజలను చూసి దేశం లో చాలా మంది జాలి పడాల్సిన పరిస్తితి ఏర్పడింది. పాపం అదికారం లో కాంగ్రెస్ అవినీతి పాలనను , అసమర్ద పాలనను భరించలేక మెజార్టీ డిల్లి వాసులు B.J.P,కి AAP  (ఆం ఆద్మీ పార్టీ) కి వోట్లు వేసారు. దురదృష్ట వశ్శాత్తు కేవలం 4 సీట్ల తేడాతో B.J.P  వారు డిల్లి పీటాన్ని అదిష్టించే అవకాశాన్ని కోల్పోయారు.అలాగే AAP  వారు పాలనా  పాగాలు అందుకోవాలంటే కనీసం 8 సీట్లు కావాల్సి ఉంది. తమకు తగినన్ని సీట్లు రాలేదు కాబట్టి తాము పరిపాలనా బాద్యత స్వీకరించం అని ఎంతో అనుభవం ఉన్న నాయకులు కలిగిన B.J.P  పార్టీ స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ వారు అధికారానికి అందనంత దూరం లో ఉన్నారు కాబట్టి , వారు దైర్యం చేసే అవకాశమే లేదు. ఇక పోతే మిగిల్ంది 28 సీట్లతో రెండవ పెద్ద పార్టీగా అవతరించిన AAP  వారు.

  AAP  ఒక రాజకీయ పార్టీ కాదు కేవలం ఉద్యమ సంస్త అని ఆ పార్టి అద్యక్షుడు కేజ్రీవాల్ అనేక సందర్బాలలో చెప్పారు. మరి అటువంటప్పుడు ఎన్నికలలో నిలబడడం కూడదు అని 'అన్నా హజారే" గారు ఎంత చెప్పినా వినకుండా తగుదునమ్మా అంటూ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికలలో నిలబడ్డారు. అయన పార్టి ప్రణాళిక లో ముక్యమైనది గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి పాలనా మీద విచారణ జరిపించి బాద్యులైన రాజకీయ నాయకులను , అధికారులను ప్రాసిక్యూట్ చేయ్యడం కూడా . కాబట్టి అయన ఎట్టి పరిస్తుతుల్లో అధికారం కొరకు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోకూడదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ తమ పార్టీకి బేషరత్ గా సపోర్ట్ చేస్తామని డిల్లీ గవర్నర్ కి లేఖ ఇచ్చిందో , కేజ్రీ వాల్ గారిలో ఎక్కడో ఆశ కలిగింది. అందుకు అయన గారు కాంగ్రెస్ వారికి 18 విషయాలతో కూడిన లేఖ  ఒకటీ పంపించి అందులో ఉన్న, విషయాలు అన్నిటికి బేషరతుగా మద్దతు ఇస్తే తానూ అధికారం  లోక్ రావడానికి కాంగ్రెస్ వారు ఇచ్చే మద్దతు స్వీకరిస్తాను అని చెప్పాడట.

  కేజ్రీవాల్ గారు ఇచ్చిన 18 అంశాలులో 17 సంగతి ఎలా ఉన్నా, కాంగ్రెస్ యొక్క గత 15 సంవత్సరాల అవినీతి పాలన మీద విచారణ చేయాడానికి బేషరత్ మద్దతు కావాలన్న అంశం చూస్తె ఎవరికైనా నవ్వు రాక మానదు. ఎంత వెర్రి వాడైనా , తను నీతిపరుడైన అవినీతి పరుడైనా సరే ,తనను అవినీతి పరుడుగా అనుమానించి , విచారణకు ఆదేశించే అదికారాన్ని పరాయి పార్టీకి కట్టబెట్టి , తన నెత్తిన తానే మన్ను పోసుకుంటారా? అటువంటి కోరికను ఎంత దిమాక్ లేని వాడైనా కోరడు గాక కోరడు. కానీ కేజ్రీవాల్ కోరాడు అంటే అతనికి లౌక్యం అంటే ఏ మాత్రం తెలియదు అనేది అర్దం అవుతుంది. గమ్మతేమిటంటే  ఆ  18 అంశాల లేఖను , బేషరత్ మద్దతు ఇవ్వని B.J.P కి   కూడా  పంపితే వారు నోరెళ్ళ బెట్టారట! ఇదేమిటి , తామేదో మళ్లి  ఎన్నికలు ను డిల్లీ ప్రజల మీద రుద్దటం అనవసరమనే ఉద్దేశ్యంతో , పెద్ద మనసుతో మద్దతు ఇస్తాం అంటే , అయన గారి పార్టి మానిపెస్ట్ ని మన మీద రుద్దడ మేమిటి అని నవ్వుకుంటున్నారు అట!. అలా ఉంది కేజ్రీవాల్ గారి లౌక్యం! ఈయన గారేమో తను అటు B.J.P  కి, కాంగ్రెస్ కి సమాన దూరం లో ఉంటాను అని మంకుపట్టు క్కోర్చున్నాడు. ఎందుకంటే ఈయనని ఎన్నుకున్న ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు కాబట్టి , AAP  మానిపెస్ట్ ని అమలు పరచడానికి తక్కిన రెండు పార్టీలు కి దూరంగా ఉండాల్సిందేనట! మరి అలా అనుకుంటే AAP  కంటే 5 సీట్లు ఎక్కువ గెలిచినా B.J.P  వారేమనుకోవాలి. వారిని ఎన్నుకున్న ప్రజలు ప్రజలు కారా? వారీ ఆకాంక్షలు తీర్చాలిసిన బాద్యత B.J.P  కి లేదా? ఏమిటో ఎవరి ఆశయాలు వారికే గొప్ప.

     ఇటువంటి సున్నిత పరిస్తితిలో పిడి వాదంతో ప్రజలను మల్లీ ఎన్నికలకు తయారు కండి అని చెప్పాలనుకునే కేజ్రీ వాల్ లాంటి లౌక్యం తెలియని వారు , రాజకీయ పార్టీ  ద్వారా . సమాజాన్ని సంస్కరించగలరా? ప్రజలు పునర్ ఆలోచించవలసిన అవసరం ఉంది. మంచి అయినా చెడు అయినా ద్వి పార్టీ విదానమే మన దేశా నికి మేలు చేస్తుంది అని డిల్లీ లో లాంటి పరిస్తుతులు ఏర్పడినపుడు అని పిస్తుంది. ఏది ఏ మైన ఈడొచ్చినా  యువరం లేనోళ్ళు  , పదవి వచ్చినా  లౌక్యం తెలియనోళ్ళు  ,అచ్చంగా కేజ్రీవాల్   లా ఉంటారు!.
  

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.