దేనికైనా రెడీ యే అన్న ఈ 'భంబోళ జంభళ' కి బ్రాహ్మణుల శాపం తగిలినట్లుంది!.

                                                           


గత సంవత్సరం విడుదలైన "దేనికైనా రెడీ" అనే సినిమా మంచు మోహన్ బాబు గారికి అచ్చి వచ్చినట్లు లేదు. ఆ సినిమా వలన లాభం  ఎంత వచ్చిందో కానీ , యావత్ ఆంద్రప్రదేశ్ లోని బ్రాహ్మణుల ఆగ్రహానికి మంచు వారి కుటుంభం గురి అయింది. ఆ సినిమాలో బ్రహ్మణులను కించపరచే సన్నివేశాలు ఉన్నాయని నిరసనలు తెలపడానికి వెళ్ళిన కొంతమంది బ్రాహ్మణ యువకులను మోహన్ బాబు తనయుడు తన అనుచరుల చేత తన్నిస్తే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. అప్పుడే కొంతంది బ్రాహ్మణులు మోహన్ బాబు కుటుంబానికి శాపనార్దాలు పెట్టారు. మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు కానీ బ్రాహ్మణుల శాపాలకు లేదా వారి తరపున తీసుకున్న చట్టపరమైన చర్యలకు మోహన్ బాబు కు జాతీయ స్తాయిలో తీరని అవమానం జరిగింది.

 జాతీయ అవార్డు అయిన పద్మశ్రీ  అనేది ఒక గౌరవ పుర్తస్కారమే తప్పా , టైటిల్  కాదని , కాబట్టి ఇన్విటేషన్  కార్డుల్లో కానీ, పోస్టర్స్ లో కానీ , బుక్స్ లో కానీ, ఇతర చొట్ల ఎక్కడైన కానీ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు , తమ పేర్ల ముందు పద్మశ్రీ లను తగిలించి అదొక టైటిల్ లాగా వేయడం అనేది కేంద్ర ప్రభుత్వం వారి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకమని 1995 వ సంవత్సరంలో బాలాజీ రాఘవన్  కేసులో సుప్రీం కోర్టు వారు జుడ్జ్ మెంట్ ఇవ్వడం జరిగింది.అయితే దేనికైనా రెడీ సినిమాలో మోహన్ బాబు , బ్రహ్మానందం ల పేరులు కు ముందు పద్మశ్రీ ని చేర్చి టైటల్స్  లో  చూపడం జరిగింది. సాదారణంగా పద్మశ్రీ అవార్డులు పొందిన నటులు అందరి పేర్లకు ముందు వారి బిరుదులను చేర్చి టైటిల్స్ లో చూపిస్తుంటారు. కానీ ఎవరికీ రానీ సమస్య వీరికే ఎందుకు వచ్చిందంటే మోహన్ బాబు గారి "దేనికైనా రెడీ " సినిమా బ్రహ్మాణుల ఆగ్రహావేశాలకు గురి కావడమే. పాపం ఆ సినిమాలో నటించిన నేరానికి ఆ శాపం తాలుకూ సెగలు బ్రహ్మానందం గారికి అంటినవి. అలా పేర్లకు ముందు పద్మశ్రీ ని చూపించినందుకు , మర్యాదగా వారం రోజుల లోపు సదరు అవార్డులను , నటులు ఇద్దరూ రాష్ట్రపతి  గారికి సరెండర్ చేయాలని, అలా  చెయ్యని పక్షంలో చట్టపరమైన చర్యలు చేపట్టవలసి ఉంటుంది అనిహైకోర్టు వారు మోహన్ బాబు , బ్రహ్మానందం గార్లకు హుకుం జారీ చేసింది. ఇక మోహన్ బాబు గారి లాయర్ గారేమో ఇంకా తుది తీర్పు రాలేదు అని మీడియా ప్రకటన చేసినప్పటికి అది పస లేని ప్రకటన అని అర్దమవుతుంది. ఈ  విషయంలో సుప్రీం కోర్టు తప్పా ఆ నటులకు రిలీప్ ఇవ్వ గలిగిన వారెవరూ లేకపోవచ్చు!.

చేసుకున్న వారికి చేసుకునంత మహాదేవా  అని , దేనికైనా రెడీ యే అన్న ఈ  'భంబోళ జంభళ' కి   బ్రాహ్మణుల  శాపం తగిలి జాతీయ స్తాయిలో అవమానం జరిగినట్లైంది.దేనికైనా రెడీ సినిమా విషయం లో ఇంతకు ముందు నేను ప్రచురించిన టపా కోసం ఈ  క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడగలరు

హిందూ దేవుళ్లని రోడ్ల మీద పరిగెత్తిస్తున్న, ఈ జంబ లకిడి పంబలు హిందువులా?http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )