సరబజిత్ ని వారి క్రూర సాంప్రాదాయం ప్రకారం శిక్షించారా?
ఈ రోజు పాకిస్తాన్ హాస్పిటల్ లో చనిపోయిన బారతీయ ఖైది సరబజిత్ మ్రుతి వెనుక ఒక కుట్ర ఉందనిపిస్తుంది. అతని మీద్ నేరారోపణ చేసి, ఉరిశిక్ష వేసి ఇరవై సంవత్సరాలు పైన అయింది. అయిదు సార్లు ఆయన పెట్టుకున్న క్షమా బిక్ష అబ్యర్ధనను పాకీస్తాన్ న్యాయస్తానాలు కొట్టివేయడం జరిగింది.ఈ ఇరవై యేండ్లుగా ఆయన మీద జరగని హత్యాప్రయత్నం సడెన్ గా ఇప్పుడే ఎందుకు జరిగింది? కొన్ని ముస్లిం దేశాలలో, కన్నుకు, కన్ను, కాలుకు కాలు,లాంటి శిక్షలు, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలు విదించే ఆచారం ఉంది. పాకిస్తాన్ న్యాయసూత్రాలు అందుకు విరుద్దమైనా, మత చాందస వాదులు దన్నుతో, అక్కడ ఉగ్రవాద ముటాలు యొక్క ప్రాబల్యం తక్కువేమి కాదు. వారికి సరబ్ జిత్ సింగ్ ని పాకిస్తానీ న్యాయ సూత్రాల ప్రకారం శిక్షించడం ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే బారతీయ సిక్కు మతానికి చెందిన సరబ్ జిత్ గారిని, తమ మత విశ్వాసాల కనుగుణంగా కొట్టి చంపడమే కరెక్ట్ అని బావించి ఆ దురాగతానికి ఒడిగట్టి ఉంటారు. ఇది ఘోరమైనా, నీచాతి నీచమైన చర్య. మన దేశంలో మారణహోమం స్రుష్టించిన "కసబ్" ని పౌర న్య