తప్పుడు సమాచారం తో పెండ్లి చేసుకున్నందుకు ,తల్లి తో కొరివి పెట్టించుకున్న కొడుకు !!?
వివాహం చేసుకునే ముందు వదువు గురించి వరుడు , వరుడు గురించి వధువు అన్ని రకాలుగా విచారణ చేసుకుని , తమకు అనుకూలమైన సంబంధం అని బావించాకే వివాహానికి O.K. అంటారు. వివాహ పూర్వ విచారణలో వదూవరుల కుటుంబ నేపథ్యం, ఆర్దికపరిస్తితితో తో పాటు వారి విద్యార్హతలు కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. ముక్యంగా ప్రొపెషనల్ కోర్స్ లు చదివిన వారు తమకు తమకు ఫలాని ప్రొపెషనల్ కోర్స్ లు చదివిన అమ్మాయి లేక అబ్బాయి కావాలని మ్యారేజ్ బ్రోకర్లకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి వారికి సంబంధాలు కుదిర్చేటప్పుడు మధ్యవర్తులు తగిన ఎంక్వయిరీ లు చేసి వదువు లేక వరుడి విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు నిర్దారించుకున్నాకే , అట్టి సంబంధాన్ని తమ పార్టీలకు రిఫర్ చేయాలి. ఇట్టి కేసులలో అవసర...