తప్పుడు సమాచారం తో పెండ్లి చేసుకున్నందుకు ,తల్లి తో కొరివి పెట్టించుకున్న కొడుకు !!?

                                                                       


                        వివాహం చేసుకునే ముందు వదువు గురించి వరుడు , వరుడు గురించి వధువు అన్ని రకాలుగా విచారణ చేసుకుని , తమకు అనుకూలమైన సంబంధం అని బావించాకే వివాహానికి O.K. అంటారు. వివాహ పూర్వ విచారణలో వదూవరుల కుటుంబ నేపథ్యం, ఆర్దికపరిస్తితితో తో పాటు వారి విద్యార్హతలు కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. ముక్యంగా ప్రొపెషనల్ కోర్స్ లు చదివిన వారు తమకు తమకు ఫలాని  ప్రొపెషనల్ కోర్స్ లు చదివిన అమ్మాయి లేక అబ్బాయి కావాలని మ్యారేజ్ బ్రోకర్లకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి వారికి సంబంధాలు కుదిర్చేటప్పుడు మధ్యవర్తులు  తగిన ఎంక్వయిరీ లు చేసి వదువు లేక వరుడి విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు నిర్దారించుకున్నాకే , అట్టి సంబంధాన్ని తమ పార్టీలకు రిఫర్ చేయాలి. ఇట్టి కేసులలో అవసరమైతే విద్యార్హతలు కు సంబందించిన సర్టిఫికెట్ లు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అలా పరిశీలన చేయనందువలన  ఒక వ్యక్తి పెండ్లి అయిన 2 నెలలకే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే  ,అతనికి  కొరివి పెట్టె మగదిక్కు లేక చివరకు కన్న తల్లే కొరివి పెట్టాల్సిన దుస్థితి. ఖమ్మం జిల్లా , వైరా గ్రామానికి చెందిన యువకుడి విషాదాంత ఆత్మహత్య ఉదంతం వివరాలు కొరకు క్రింద ఇవ్వబడిన చిత్రం లోని సమాచారం చూడగలరు .

                                                                   



               అబ్బాయిది ఖమ్మం జిల్లాలోని వైరా . అమ్మాయిది నల్గొండ జిల్లాలోని కోదాడ . అమ్మాయి M.B.B.S పూర్తీ చేసి ప్రయివేట్ ప్రాక్టీస్ చేస్తుంటే అబ్బాయి డెర్మటాలజి లో డిప్లొమా చేసి ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉంది. వైరా చిన్న మోస్తరు పట్టణం కావటం తో డెర్మటాలజీలో డిప్లొమా అర్హతతో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న అతన్ని అందరూ M.B.B.S డాక్టర్ అనే భావనతో పిలుస్తుండవచ్చు. , డిప్లొమా కి డిగ్రీకి తేడా తెలియనందు వాళ్ళ పెండ్లిళ్ల మధ్యవర్తి కూడా  అదేమంత పెద్ద విషయం కాదు , డిప్లొమా అయినా డిగ్రీ అయినా డాక్టర్  డాక్టరేగా  అనుకుని ఉండవచ్చు. అందుకే డిగ్రీ గురించి చెప్పకుండా , డాక్టర్ అన్న విషయం మాత్రమే  అమ్మాయి వాళ్లకు చెపితే వారు కూడా మధ్యవర్తి చెప్పిన మాట మీద నమ్మక్కమ్ తో అతడిని M.B.B.S  పూర్తీ చేసిన వాడిగా భావించి  పెండ్లికి ఓ.కే అని ఉండవచ్చు. తన డిగ్రీ తెలిసే తనతో వివాహానికి సిద్ధపడ్డారు అని భావించిన పెండ్లి కొడుకు కూడా వివాహానికి సమ్మతి తెలిపి ఉండవచ్చు . ఆ తర్వాత 2 నెలలకు అసలు విషయం తెలిసి అమ్మాయి హతాశురాలై ఉంటుంది. మధ్యవర్తి పొరపడినా నిజం చెప్పాల్సిన బాధ్యత భర్త మీద ఉందని, అట్టి బాధ్యతను ఆతను ఉద్దేశ్యపూర్వకంగా నే విస్మరించి , మోసపు ప్రక్రియలో తనను వివాహం చేసుకున్నాడని భావించిన ఆమె, కోదాడ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే , పోలీస్ వారు అబ్బాయి తల్లి గారిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి మాట్లాడారు అంట. 

                                     దానితో ఏంతో  అవమానం ఫీల్ అయినా అబ్బాయి ఆత్మహత్య చేసుకుని తనువూ చాలించాడు. లాయర్లు, పోలీసులు కౌన్సలింగ్ ఇచ్చినప్పటికీ అతడు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటే ,  తన డిగ్రీని మధ్యవర్తి వెల్లడించకపోవడం వల్లా తాను మోసగాడిగా ముద్ర పడడం తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు . నిజంగా మోసం చేసే స్వభావం ఉన్నవాడు పోలీస్ కేసులు గురించి అంతగా మదనపడడు . చివరకు ఈ ఎపిసోడ్ మొత్తం లో ప్రతి ఒక్కరిని కదిలించే విషయం ఏమిటంటే , తన వంశాన్ని వృద్ధిలోకి తెచ్చి , చనిపోయిన తర్వాత తనకు కొరివి పెట్టి సద్గతి కలిగిస్తాడు అని ఆశపడిన అబ్బాయి తల్లి , తన భర్త లేక పోవటం, ఇంట్లో మున్నా మామగారు 18 ఏండ్లుగా మంచం మీదే ఉంటూ ఉన్నందు వలన , తానే శవయాత్రలో పాల్గొని కొడుక్కి తల కొరివి పెట్టాల్సిన దుస్థితి. 

                              కాబట్టి పై విషయం వలన మనం తెలుసుకోవలసింది ఏమిటంటే , వివాహాలు చేసుకునే వారు, సంబంధాలు కుదిర్చేవారు , వివాహపూర్వ విచారణలు చేసే వారు అన్ని కూలంకషంగా విచారణ చేసి తెలుకున్నాకే పెండ్లిళ్లకు ఓ.కే. చెప్పాలి. అవసరమైతే విద్యార్హతలు కు సంబందించిన డాకుమెంట్లు కూడా పరిశీలించడం తప్పేమి కాదు. నూరు అబద్దాలు అది అయినా ఒక పెండ్లి చేయాలి అనేది  అన్ని విషయాల్లో కుదరని పని. ముక్యంగా విద్యార్హతలు, ఉద్యోగ అర్హతలు, పెండ్లి తర్వాత ఎక్కడ ఉంటారు, ఇలాంటి వాటి  గురించి ఎదుటి వారు ఖచ్చిత నిర్ణయం తో ఉన్నప్పుడు వారికి వాస్తవ విషయాలు చెప్పి, అందుకు వారు అంగీకరిస్తేనే పెండ్లికి o.k  అనడం మంచిది. లేకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. "సర్దుకుపోయి  సంసారం చేయండి " అనే మాట అన్నిటికి ఇష్టపడి పెండ్లి చేసుకున్నాక గొడవలు పడేవారిని సముదాయిస్తుందేమో కానీ , తాము మోసపోయి పెండ్లి చేసుకున్నాం అని భావించే వారిని మాత్రం సముదాయించలేదు అని పై సంఘటన తెలియ చేస్తుంది. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం