గోవుల్ని కాపాడలేని వారు, గోవిందుని ఆస్తులు కాపాడగలరా?
ఈ రోజు మన దేవాదాయ శాఖా మంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే చాల ఆశ్చర్యం వేసింది. సింహా చలం అప్పన్న సాక్షిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యానికి, చేతకాని తనానికి గుర్తుగా దేవస్తాన గోశాల లోని గోవులు మరణిస్తే, ఇక రాష్ట్రంలో దేవాలయల గోశాలలో ఉన్న గోవుల్ని కాపాడడం తమ డిపార్ట్మెంట్ వల్ల కాదని తేలుస్తూ,సదరు గోవుల్ని కాపాడడానికి స్వచ్చంద సంస్తలు ముందుకు రావల్సిందిగా విజ్ణప్తి చేసారు మన రాష్ట్ర దేవాదాయ దర్మాదాయ శాఖామాత్యులు! ఈ విషయంలో నిజాన్ని నిజయీతిగా ఒప్పుకున్నందుకు మంత్రి గారికి రాష్ట్రంలోని హిందువులంతా దన్యవాదాలు తెలపాలి. ఏదైనా సరే ఆదాయం వచ్చేవాటికి ఎండొమేంట్ డిపార్ట్మెంట్ వారు పెద్దకొడుకుల్లాగా ముందుకొస్తారు. భక్తుల ఆద్వర్యంలో సమర్దవంతంగా నిర్వహించబడుతున్న మత సంస్తలైనా సరే, చాటు మాటు రాజకీయాలను ప్రేరెపించి సంస్తలను ఎండోమెంట్ పరిదిలోకి తీసుకు వచ్చే దాక నిద్రపోరు ఘనమైన అదికార్లు. కాని అదే డిపార్ట్మెంట్ వారు ఆదాయం లేని గుళ్ళను కనీసం కన్నెత్తి చూడరు స