"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??
భారత దేశం లో ఉన్న "కుల వ్యవస్థ " అనబడే విధానం ప్రపంచం లో ఏ దేశం లో లేకపోవచ్చు . మొదట్లో వృత్తుల ఆధారంగా నిర్ణయించబడిన కులాలు చివరకు రాను రాను జన్మతః నిర్ణయింపబడానికి కొంతమంది పండిత పుత్రులు కారణమయినప్పటికీ , అగ్రకులాలు ,నిమ్నకులాలు అని వర్గీకరించబడడానికి , పై కులాల ఆధిపత్యం క్రింది కులాల వారి మీద శతాబ్దాలుగా కొనసాగిస్తుండటానికి మాత్రం అన్ని కులాల వారి ప్రమేయం ఉంది. ప్రతి కులస్తుడు తనపై పెత్తనం చేయచూసే అగ్రకులస్తుడి అహకారం ని ప్రశ్నించే బదులు ,తనకంటే క్రింది కులం గా ఉన్నవారి మీదే తన ఆధిపత్య అహంకారాన్ని చెలాయించడానికే ఇష్టపడ్డారు కాబట్టే కులాహంకార దురాచారాం అన్ని వందల ఏండ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఆఖరకు దళితులలో కూడా ఈ జాడ్యం ఉన్నప్పుడు , తరతరాల నిమ్న కులాల వెనుకబాటు తనానికి ఏ ఒక్క కులాన్నో టార్గెట్ చేసి నిందించడం ఎంతవరకు సమంజసం? మొన్నీ మధ్య "కంచ ఐలయ్య " అనే ప్రొపెసర్ గారు ఒక పుస్తకం రాశారు. దాని పేరు "సా