ఆ విఘ్నేశ్వరుడి క్రుపా కటాక్ష వీక్షణములతో, బ్లాగ్ వీక్షకుల,మిత్రుల అభిమానంతో1,00,000 (లక్ష) వీక్షణములకు చేరువైన "మనవు" బ్లాగు!
బ్లాగు మిత్రులకు, వీక్షకులకు, విమర్శకులకు, వినాయక చవితి శుభాకాంక్షలు. "మనవు" బ్లాగు గత ఏడాది సెప్టెంబర్ ఆరున ప్రారంభమై, అందరి అదారాభిమానాలతో మొదటి సంవత్సరం పూర్తీ చేసుకున్నది. ఇప్పటికి ఈ బ్లాగులో 364 పోస్టులు ప్రచురింపబడి లక్ష వీక్షణములు పొందింది. పోస్టులు రాయడం ని నేను గొప్పగా ఫీల్ కానప్పటికి, లక్ష వీక్షణములతో మీరందరూ చూపించిన ఆదరాభిమానములకు కొంచం నా చాతీ వెడల్పు అయిందని చెప్పడానికి సంకోచించను . కుటుంబ సబ్యులు ఎల్లరూ, సంతోషంతో చేసుకునే పండుగ వినాయక చవితి. అట్టి వినాయక ప్రతిమని, మన చేతులతో స్వయంగా తయారు చేసి, మనమే స్వయంగా సేకరించిన పత్రితో కొలిస్తే, ఆ మహదానందమే వేరు. కానీ కార్పోరేట్ కల్చర్ లో పెరిగే మన పిల్లలకు ఆ అద్రుష్టం లేదు. మేము చిన్నప్పుడు చవితిని ఎంత ఆనందం కూడిన భక్తి పరవశ్యాలతో చేసే వారమో! ఆ రోజులు రాక పోవచ్చు! కానీ ఆ మదురానుబూతులు ఇప్పటికీ మా మనస్సుల్లో ఉండి ఆనందాన్ని పంచుతూనే ఉన్నాయి. ఆ జ్ణాపకాలతో కూడిన పోస్టు ని పోయిన సంవత్సరం ఈ బ్లాగులో పెట్టాను. కావాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు. http: