Posts

Showing posts with the label dubbaaka police haraasment

'కప్పగంతుల' వారి మాటను తెల్లారే సరికి నిజం చేసిన "దుబ్బాక పోలిస్ A.S.I,Mr.పాషా "

                                                                  నిన్న ఇదే బ్లాగులో విజయవాడ లోని పటమట పోలిస్ వారు ఒక కేసు దర్యాప్తు విషయంలో , పిర్యాదిదారుల పట్ల వ్యవహరించిన తీరును తప్పు పడుతూ   "అవమానకర  దర్యాప్తు తో ఇల్లాలిని అవమానించి మాజీ న్యాయ మూర్తి చేతనే కంట తడి పెట్టించిన పటమట పోలీసులు "    అనే టపా పెట్టడం జరిగింది . దానికి బ్లాగ్ మిత్రులు ,పెద్దలు శ్రీ తాడిగడప శ్యామల రావు గారు , శ్రీ కప్పగంతుల శివ రామ ప్రసాద్ గారు,మరియు  శ్రీ నిష్టల సుబ్రహ్మణ్యం గారు  వారి వారి స్పందనలు తెలియ చేసారు . ముఖ్యంగా శ్రీ శివ రామ ప్రసాద్ గారు   "   మన దేశంలో పోలీసుల వైఖరి ఇప్పటికి కూడా వాళ్ళేదో పైనెక్కడో ఉన్నారని, ప్రజలను  బానిసల్లాగా చూడాలని అన్న భావన వాళ్ళ రక్తంలో పారుతోంది. రిక్రూట్మెంట్ సమయంలో జరిగే ఘోర అక్రమాలు, ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి, ప్రమొషన్లు, పోస్టింగులు...