T.D.P ,B.J.P ల తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి B.C. ముఖ్యమంత్రి అబ్యర్ది "పవర్ స్టార్ పవన్ కళ్యాణా"!?
పోయిన వారంలో ఆంధ్రా గబ్బర్ సింగ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు , ఏదో ఆవహించిన వాడిలా , ఒక స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన సభ ఒకటి ఏర్పాటు చేసి "జనసేన" అనే నూతన రాజకీయ పార్టిని ప్రకటించడం , ఆ సందర్బంగా కేవలం 45 నిమిషాలు మాట్లాడుతారు అని ముందుగా చెప్పిన వ్యక్తీ 2 గంటలు పాటు అభిమానులను పంచ్ డైలాగులతో అలరించడం జరిగింది . అయన చేసిన ఉపన్యాస దోరణి చూస్తె , తెలంగాణా లోని సిమాంద్ర సెటిలర్స్ కి కొంత మనో దైర్యం ఇచ్చేలా ఉన్నవి. K.C.R గారికి డైరెక్టు వార్నింగ్ లు ఇవ్వడం ద్వారా అయన తనలో ఉన్న డేరింగ్ నెస్ ని బయట పెట్టుకోవడం జరిగింది . 1956 తెలంగాణాకి , 2014 లో తెలంగాణా కి బోల్దంత తేడా ఉంది . ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డాక , సిమాంద్ర నుండి లక్షలాది తెలుగువారు తెలంగాణా కు వచ్చి స్తి...