ఎనిమిదేళ్ళ వదువు, నలబై యేండ్ల వరుడు, తొలి రేయి తో అమ్మాయి బ్రతుకు తెల్లారి పోయింది.!
అరబ్ చట్టాలు, అరబ్ చట్టాలు. ఈ మద్య ఇండియాలో స్త్రీల మీద లైంగిక దాడులు విపరీతంగా మ్మా పెరిగిపోతున్నందుకు కొంత మంది (నాతో సహా) సూచిస్తున్న పరిష్కారం అరబ్ దేశాలలో మాదిరి తీవ్ర శిక్షలు ఉండాలి అని. కానీ అదే అరబ్ దేశాలలో బాలికల పరిస్తితి ఎంత దయనీయంగా ఉంది అనేది తెలిపెదే ఈ ఉదంతం. పశ్చిమ ఆసియా దేశాలలో యెమెన్ ఒకటి. ప్రాచీన నాగరికత విలసిల్లిన ప్రాంతం. కానీ ప్రస్తుతం ప్రజలు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఎంత పేదరికం అంటే తల్లి తండ్రులు తమ ఆడపిల్లలని బాల్య వివాహాల పేరుతో అమ్మివేసే అంతగా!అలాంటి ఒక నిర్బాగ్య బాలిక పేరు రావన్. ఆ అమ్మాయి కి ఎనిమిదేళ్ళు రాగానే వారి సాంప్రాదాయం ప్రకారం (అట?)ఒక వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేసారు తల్లితండ్రులు(అమ్మివేశారు), వరుడు వయస్సు నలబై యేండ్లు. అంటే బాలిక వయస్సు కన్నా కేవలం ఐదురెట్లు ఎక్కువ. వారి మత పెద్ద ఎనిమిదెళ్ళకే వివాహం చేసుకో మన్నాడని ఆ పెద్ద మనిషీ చేసుకున్నాడట! వారి సాంప్రదాయం ప్రకారం పెండ్లి చేసుకున్న రోజే కార్యం కూడా ముగించాలి కాబట్టి ఆ ఎనిమిదేళ్ళ మే