నా తెలంగాణా , భద్రాచలం ,మునగాల గాయాల వీణా !
నా తెలంగాణా కోటి రత్నాల వీణ ! అన్నారు దాశరదీ . ఆ మకుటం మీద ఎంతో మంది కవితలు అల్లారు. పద్యాలు పాడారు. చివరకు మన బ్లాగర్లు కూడా ఆ పేరుతొ బ్లాగులు ఓపెన్ చేసి తమ పద్య పాటవాన్ని ప్రదర్సిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ మద్య ఆంటొణి కమిటీ సోనియమ్మకు సమర్పించిన నివేదిక కానీ , సీమాంద్ర కేంద్ర మంత్రుల కోరికల చిట్టా కానీ , చివరకు సమైఖ్య వాది ముఖ్యమంత్రి గారు పంపిన రాష్ట్ర నివేదిక కానీ తెలియ చేసేది ఏమిటంటే ,ఖమ్మం జిల్లాలోని భద్రాచలం , నూగుర్ మండలాలు, నల్గొండ జిల్లాలోని మునగాల మండలం గ్రామాలు కేవలం పరిపాలనా సౌలబ్యం కొరకు 1956 తర్వాత తెలంగాణా ప్రాంతాలలో కలిపారు కాబట్టి , గతం లో తెలంగాణా వారు కోరుకుంది కూడా 1956 ముందు తెలంగానే కాబట్టి , రూలు ప్రకారం ఆ ప్రాంతాలను సీమంద్ర లో కలపాల్సి ఉంటుంది అని . ఇదే జరిగితే తెలంగాణా తల్లికి కి రెండు పెద్ద గాయాలు అవటం ఖాయం. ఒకటి ఖమ్మం జిల్...