నా తెలంగాణా , భద్రాచలం ,మునగాల గాయాల వీణా !

                                                   

నా తెలంగాణా కోటి రత్నాల వీణ ! అన్నారు దాశరదీ . ఆ మకుటం మీద ఎంతో మంది కవితలు అల్లారు. పద్యాలు పాడారు. చివరకు మన బ్లాగర్లు కూడా ఆ పేరుతొ  బ్లాగులు ఓపెన్ చేసి తమ పద్య పాటవాన్ని ప్రదర్సిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ  మద్య  ఆంటొణి కమిటీ సోనియమ్మకు సమర్పించిన నివేదిక కానీ , సీమాంద్ర కేంద్ర మంత్రుల కోరికల చిట్టా కానీ , చివరకు సమైఖ్య వాది  ముఖ్యమంత్రి గారు పంపిన రాష్ట్ర నివేదిక కానీ తెలియ చేసేది ఏమిటంటే ,ఖమ్మం జిల్లాలోని భద్రాచలం , నూగుర్ మండలాలు, నల్గొండ జిల్లాలోని మునగాల మండలం గ్రామాలు కేవలం పరిపాలనా సౌలబ్యం కొరకు 1956 తర్వాత తెలంగాణా ప్రాంతాలలో కలిపారు కాబట్టి , గతం లో తెలంగాణా వారు కోరుకుంది కూడా  1956 ముందు తెలంగానే కాబట్టి , రూలు ప్రకారం ఆ ప్రాంతాలను సీమంద్ర లో కలపాల్సి ఉంటుంది అని .

   ఇదే జరిగితే తెలంగాణా తల్లికి కి రెండు పెద్ద గాయాలు అవటం ఖాయం. ఒకటి ఖమ్మం జిల్లా లో భద్రాచలం వద్ద అయితే , రెండోది నల్గొండ జిల్లాలో మునగాల వద్ద . ఎవరైనా డాక్టర్, రోగి అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేస్తాడు . కవల పిల్లలకు ఆపరేషన్ చేసి జాగర్తగా పిల్లల్ని విడదీయమంటే , ఒక పిల్ల వాడి అంగాన్ని , ఇంకో పిల్లాడికి అమరచుతాను అనేవాడు వైద్యుడు అవుతాడా ? అలాగే తెలుగు ప్రజలకు ఇబ్బంది లేకుండా తెలంగాణ విడగొట్ట మంటే , సీమాంద్రులు డిమాండ్ చెయ్యని భద్రాచల్లాన్ని , మునగాల మండల్లాలను సీమాంద్ర ప్రాంతంలో కలపటం ఏమిటి? కక్ష సాదింపు దోరణీ  కాక పోతే.
                                                           

ఏది ఏమైనా ఖమ్మం జిల్లా ప్రజలు ఎట్టి పరిస్తితిలోనూ భద్రా చలాన్ని వదులుకోరు. ఖమ్మం జిల్లాలో చాలావరకు సీమాంద్ర సెటిలర్స్ ఉన్నారు. సీమాంద్రా ఉద్యమం మీద వారికి సానుబూతి ఉన్నా, బౌగోళికంగా , మానసికంగా తాము ఎంటో అట్టాచ్ మెంట్ ఏర్పరచుకున్న భద్రాచల రాముడిని వారు వదులుకోరు గాక వదులుకోరు . ఖమ్మం పేరు రావడానికి కారణమయిన "స్తంభాద్రి " కంటే , ఖమ్మం  జిల్లా ప్రజలు "భద్రాచల రాముడినే  " జిల్లా అధికారిక చిహ్నం గా బావిస్తున్నారు. భద్రాద్రి లేని స్తంభాద్రి జిల్లాను కలనైన ఊహించటానికి  ఖమ్మం జిల్లా వాసులు సిద్దంగా లేరు. అసలే దండ కారణ్య  ప్రాంతం . అందులో పిల్లులు కూడా  అవసరమైతే  పులులుగా మారి గాండ్రిస్తాయి. దేనితో ఆటలాడినా పెద్దగా పట్టించుకోక పోయినా దేవుడు సెంటిమెంట్ తో ఆటలాడితే కేంద్రానికి తగిన గుణపాటం చెపుతారు. కాబట్టి కక్ష సాదింపు దోరణిలో కాక సామరస్యంగా విభజన జరపాలని ఖమ్మం జిల్లా ప్రజల కోరిక.

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.