జాతికి ద్రోహం చేసిన వాడికి జాతీయ స్తాయిలో "ఉత్తముడు " అవార్డా!?

                                                      
                                                       
మాతృదేవో భవ! పితృదేవో భవ! ఆచార్య దేవో భవ!  అన్నారు పెద్దలు. అంటే ప్రతివారికి కనిపించే దేవతలు వరుసగా తల్లి,తండ్రి, గురువు. ఈ  విదంగా కనిపెంచిన తల్లి తండ్రులుతో పాటు విద్యాబుద్దులు నేర్పి మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన గురువును దేవుడుగా బావించటం మన సాంప్రదాయక విదానం. అటువంటి గురువులలో ఉత్తములైన వారిని జిల్లా , రాష్ట్ర ,జాతీయా స్తాయిలో గుర్తించి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు "ఉత్తమ ఉపాద్యాయుడు " బిరుదులను ప్రదానం చేస్తుంటాయి. జాతీయ స్తాయిలో ఈ  అవార్డు రావాలంటే అట్టి ఉపాద్యాయుల సర్వీస్ రికార్డులు క్లీన్ గా ఉండాలి. కానీ మద్యాహ్న బోజన పధకం లో పిల్లల బోజనాలకు కేటాయించిన సొమ్మును బోంచేసిన ఉపాద్యాయుడుకు ఏకంగా  జాతీయ స్తాయిలో ఉత్తమ ఉపాద్యాయుడు అవార్డు ఇచ్చారంటే "జాతీయ అవార్డుల " ప్రక్రియ  ఎంత లోపభూఇష్టంగా ఉందో అర్దమవుతుంది.

  అయన ఒక ఉపాద్యాయు డు. పేరు శ్రీనివాస రావు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మిట్టగోడెం గ్రామం లో 1989 లో S.G.T  గా ఉపాద్యాయ వ్రుత్తిలో ప్రవేశించాడు. అదే  మండలం లో 2001 నుంచి 2003 వరకు మండల్ రిసోర్స్ పర్సన్ గా నియమితులయాడు. ఆ సమయం లోనే మద్యాహ్న బోజన పదకం కు చెందిన నిధులు స్వాహా చేసినట్లు అధికారులు చేసిన విచారణలో వెల్లడవగా అతనిని సస్పెండ్ చేసారు. తప్పు చేస్తే కొంత మంది ఆ తప్పును సరిదిద్దుకుని తిరిగి ఆ తప్పును చేయకుండ  జాగర్తపడి , మెరుగైన సేవలు అందించి సమాజం లో మన్ననలు పొందుతారు. కానీ తనలోని అపరాద బావం కప్పిపెట్టుకోవటానికి, తన పాత చరిత్రను సర్వీస్ రికార్డుల లో నమోదు కాకుండా చేసుకుని , రాజకీయ పైరవీల ద్వారా జిల్లా , రాష్ట్రస్తాయిలో  నే కాకుండా ఏకంగా జాతీయ స్తాయిలో "ఉత్తమ ఉపాద్యాయుడి " అవార్డు పొందాడు అంటే ఆతను ఎంత గుండెలు దీసిన బంటు అయి ఉండాలి. ?!ఉద్యోగాలలో అక్రమాలకూ పాల్పడి , తద్వారా సంపాదించిన అక్రమ సంపాదనతో రాజకీయ పైరవీలు చేసి ఏకంగా జాతీయ స్తాయిలో ఉత్తముడు అయిపోతే , దీని వలన సమాజం లో ఎటువంటి సందేశం ఇవ్వబడుతుంది? జాతి ద్రోహులకు ఇవబడుతున్న "జాతీయ స్తాయి" అవార్డుల కు ఉండే విలువ ఏమిటి?
            దీని వలన మనకు అర్దమయ్యేది ఒకటే . ప్రభుత్వం వారు ఇచ్చే అవార్డులు అన్నీ కాక పోయినా , చాలా వరకు రాజకీయ కారణాల చేతనే ఇవ్వబడుతున్నాయి. లంచం ఇచ్చి అన్నీ పోందినట్లే , అవార్డులు కూడా పొందడం ఈ  దేశం లో చాలా సుళువు. ఎందుకంటే మన జాతిలో చురుకు తక్కువ. ఆ.. ఎవరికీ  ఏమొస్తే మనకెందుకు, ఏమైతే మనకెందుకు? వ్యవస్తే బ్రష్టు పట్టి పోయాకా , మనం ఎవరు ఏమి చేయజాలం, అనే నిర్వేదం పాలు ఎక్కువుగా  భారతీయులలో ఉండబట్టే శ్రీనివాస రావు లాంటి వారు, అతనిని ప్రోత్సాహించిన అధికారులు, రాజకీయ నాయకుల ఆటలు సాగుతున్నాయి. ఇటువంటి వారి ఆటలు కట్టాలంటే ప్రజా అప్రమత్తత కావాలి.లేదంటే దొంగలే జాతికి గురువులు అవుతారు.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!