సచ్చినోడికి ..... చావు తెలివి ఎక్కువే!

                                                      

అతనొక క్రైం రిపోర్టర్. క్రైం వార్తలు సేకరించి, సేకరించి ఈ  సమాజం లో క్రిమినల్స్ నేరాలు చేసి కూడా  చట్టానికి దొరకకుండా ఘరానా పెద్దమనుషులుగా ఎలా బ్రతకవచ్చో అవగతం చేసుకున్నాడు. అంతే ! చేస్తున్న రిపోర్టర్ పని మాని వేసి రెయల్టర్ అవతార మెట్టాడు. ప్రజల్ని వంచించి కోట్లు కూడబెట్టాడు . ప్రజలు అతని గురించి తెలుసుకోని కేసులు పెట్టేసరికి , ఆటను ఒక నీటి ప్రమాదంలో కొట్టుకుని పోయాడు . ఆ తర్వాత రెండేళ్ళకు మొన్న దివి నుంచి ఊడి పడినట్లు, విజయవాడలో ప్రత్యక్షమయ్యే సరికి , అతనిని గమనించిన బాదితులు పట్టుకుని పోలీసులకు అప్ప చెప్పారు. ఇప్పుడు అతన్ని విజయావాడ కోర్టు పోలిస్ కస్టడికి ఇచ్చింది. రేపట్నుంచి అయ్యగారి నుంచి,  పోలిసులు అసలు ఏమి జరిగిందో తెలుసుకోబోతున్నారు. కళ్ళు బైర్లు కమ్మే ఈ  క్రిమినల్ ఏ ప్లాన్ తో అటు ప్రజలను ఇటు పోలీసులను బురిడీ కొట్టించాడో చూడండి

    అతని పేరు నార్ల వంశి క్రిష్ణ. పూర్వాశ్రమంలో అతనొక క్రైమ్ రిపోర్టర్. ఆతను క్రైమ్ రిపోర్టర్ గా కంటే క్రిమినల్ మైండ్ తోనే ఎక్కువుగా గడించవచ్చు అనిపించాక ,రియల్టర్గా అవతారమెత్తి , విజయవాడ పరిసర ప్రాంతంలోని వ్యక్తులకు ప్లాట్లు, అపార్ట్మెంట్లు బిజినెస్ ద్వారా కొంత కాలం  నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత ఒక రికి అమ్మిన ప్లాట్లనే , నలుగురు ఐదుగురికి అమ్మి , అలా మోసం చేస్తూ, సుమారు 100 కోట్ల రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డాడు , ఆ తర్వాత విషయం తెలుసుకున్న బాదితులు అతని మీద సుమారు 16 కేసులు విజయవాడ, గుంటూరు పోలిస్ స్టేషన్లలో పేట్తారు. అప్పటికే ఒక ప్లాన్ మీద ఉన్న వంశీ క్రిష్ణ ,అప్పుల వాళ్ళు , పోలిసుల కేసులు నుండి తప్పించుకోవడానికి, విజయవాడ నుండి తెనాలి కారులో వెళుతున్నట్లు, అప్పుడు ఆ కారులో అతనితో పాటు అతని తల్లిఉన్నట్లు, వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాద వశాత్తు నిటి కాలువలోకి దూసుకెళ్ళి మునిగి పోతే , ఆ కాలువలో తల్లితో సహా తను కొట్టుకుపోయినట్లు , ఒక డ్రామా క్రియేట్ చేసాడు. కాలువలో పడిన కారును భయటకు తీసిన పోలిసులు అది మిస్టరి  మృతి కేసుగా అతని కేసును పెండింగ్ లో పెట్టారు. ఇది జరిగిమ్ది 2011లో .

 ఆ తర్వాత వంశీ కృష్ణ గప్ చిప్ గా వైజాగ్ వెళ్లి, అక్కడ మొదటి బార్యకు విడాకులు ఇచ్చి, ఒక డాక్టర్ ని రెండవ పెండ్లి చేసుకుని హాస్పిటల్ పెట్టి హాయిగా, ఆడంబరంగా  జీవిస్తున్నాడట. కానీ ఘనమైన ఆంద్రప్రదేశ్ పోలిస్ వారు అతనిని కనుక్కోలేక పోయరట. 100 కోట్ల చీట్ంగ్ చేసినవాడు సాదారణంగా ప్రజలకు కానీ, పోలీసులకు కానీ తన ఉనికి తెలియకుండా ఉండడం కోసం, వేరే రాష్ట్రాలకు దూరంగా వెళతారు. కానీ ఈ  చావు తెలివి కలవాడు మాత్రం తెలుగు దేశం లోనే , ఒక పెళ్ళానికి విడాకులు ఇచ్చి, రెండవ పెళ్ళాంతో వైజాగ్ లాంటి నగరం లోనే ఆడంబరంగా బ్రతుకుంటే పోలీసులకు తెలియదంటే నమ్మడం చాల కష్టం. విజయవాడ లోని కొంతమంది బాదితుల ఆరోపణల ప్రకారం, పోలిస్ అధికారులు కూడా  అతని చీటింగ్ వ్యాపారం లో పెట్టుబడులు పెట్టారట. వారి సలహా మేరకే చావు నాటకం ఆడి , వైజాగ్ వెళ్లి ఉండాలి. అతని దగ్గర్నుంచి తమ పెట్టుబడులు వడ్డీ తో సహా ముట్టేవరకు వేచి ఉండి, ఆ తర్వాత పోలిస్ వారి సమాచారం లీక్ మేరకు బాదితులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పి ఉండాలి. ఇప్పుడు కేసు విచారణ చేస్తుంది విజయవాడ పోలీసులే కాబట్టి, తెర వెనుక ఉన్న పోలిస్ పెద్దలు పేర్లు బయటకు వచ్చే వీలు లేదు. అసలు కద బయట పడకుండా నేరమంతా, వంశిక్రిష్ణ  మీదకు నెట్టి  కేసు నడిపిస్తారు అనే అనుమానం కలుగుతుంది.

      కాబట్టి ఈ  చీటింగ్  చిన్నోడి వెనుక పోలిస్ పెద్దల హస్తం ఉందని బాదితులు బావిస్తున్నందున పారదర్శక విచారణ కొరకు సి.బి.సి. ఐ డి కి  కానీ , సి.బి ఐ కి .కానీ కేసును అప్పచెప్పాలి తప్పా, అనుమానమున్న విజయవాడ పోలీసులతో విచారణ చేయిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు. మరి విజయవాడ,గుంటూరు  బాదితులకు ఆ మాత్రం తెలియదు అని అనుకోలేము. తెలిసి మిన్నకున్నారు అంటే అందులో కూడా  ఏదైనా మతలబ్ ఉందేమో! మొత్తానికీ సచ్చాడు అనుకున్న్నోడు కి చావు తెలివి ఎక్కువేనని రుజువైంది .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!