తల్లి తండ్రుల పోషణ బాద్యత,మగపిల్లలది మాత్రమే కాదు, ఆడపిల్లలది కూడా!
కాలం మారుతుంది. దానికనుగుణంగా మన కుటుంబ వ్యవస్త కూడా మారుతుంది. ఒకప్పుడు పున్నామ నరకం నుండి రక్షించే వాడు "పుత్రుడు" అనే నమ్మక్కం ఇప్పుడు ఎవరికి లేదు.చచ్చాక కలిగే పున్నామ నరకం సంగతి దేవుడెరుగు, బ్రతికున్నంత కాలం ఆప్యాయంగా, ప్రేమతో ఒక ముద్ద పెట్టే బిడ్డ కోసం ముసలి తల్లి తండ్రులు పరితపించి పోతున్నారు. వారు ఆడా, మగ అనే బేదబావమేమి లేదు. వేళకు గౌరవంగా ఇంత తిండి పెట్టి , ప్రేమ తో పలకరిస్తే చాలు. కాని కలి కాలంలో అది దుర్లబమే అనిపిస్తుంది, నిన్న కరీంనగర్ జిల్లాలోని,రామగుండం ప్రాంతం లో జరిగిన సంఘటన వింటుంటే. పాపం! ఎనబై యెండ్ల తల్లి. భర్త లేడు. నలుగురు కొడుకులు, ఒకతె కుమార్తె. తనకున్న భూమి కాలరీస్ వారు తీసుకుని నష్ట పరి హారం చెల్లిస్తే, దానిని ఆ కొడుకులకు సమానంగా పంచిందట. కూతురికి ఏమన్నా ఇచ్చింది, లేనిది తెలియదు. పాపం ఆ ముసలి తల్లిని సాకటానికి ఆ కసాయి కొడుకులకు మనసు రాలేదు కాబోలు, ఎవరూ తీసుకెళ్లనందు వల్ల ఆమె ఒక్కతె తన స్వంత ఇంటిలో ఉంటూ పాఠశాల పిల్లల మధ్యాహ్న బోజనంతో జీవీంచేదట.వారికి కూడ సెలవులు ఇవ్వడంతో పాపం ఆకలి బాద తాళలేక వంటి మీద కిరోసిన్ పోసుక