Posts

Showing posts with the label పెళ్ళిచెల్లు బాటు

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

Image
                                                            కన్న తల్లి తండ్రులు ఎవరైనా తమ పిల్లలను తామే చంపుకుంటారా  ? సృష్టిలో ఏవో కొన్ని జీవులు తప్పా , అన్ని జీవులు తమ సంతానాన్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాయి . ఇదేదో ఆదర్శం కోసం చేసే పని కాదు. సృష్టి ధర్మమే అది . మరి మనుషులై ఉండి తమ కన్న కూతురినే చున్ని ఉరి పెట్టి చంపారు అంటే , వారు ఖచ్చితంగా ఆమె తల్లి తండ్రులు కాక పోయి అయినా ఉండాలి లేదా ఉన్మాదులు అయినా అయి ఉండాలి . లోకమంతా వారిని ఆమె తల్లి తండ్రులు అంటున్నారు కాబట్టి మనమూ అనుకుందాం . మరి వారికి ఉన్మాదం ఏదో అవహించబడి బడి ఉండాలి . ఏమిటది ?. విషయం లోకి వెళితే :                         పచ్చల దీప్తి గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన, హరి బాబు సామ్రాజ్యం ల పెద్ద  కుమార్తె దీప్తి . ఆమె హైదరాబాద్లో HCL టేక్నాలిజీస్ లో టెక్నికల్ ఇంజనీర్  గా జాబ్  చేస్తుంది . ఆమె కు వివాహం కాలేదు . ఆమెకు ఒక చెల్లెలు ఉంది . హరిబాబు ఒక చిన్న రైతు . వారిది చాలీ చాలని సంపాదన . దానితోనే పెద్ద కుమార్తెను చదివించి ఉద్యోగాస్తురాలిని చేసాడు . ఆమె వివాహం తమ కులంలోనే చేయాలి అనుకున్నాడు . వారి సామాజిక వర్గంలో ప్ర

"బాడీ కెమిస్ట్రీ " కి బలి అయిపోయిన 9 వతరగతి ప్రేయసి,10వతరగతి ప్రియుడు !!

Image
                                                                                      తోటలు పెంచే రైతు చేసే తెలివిగల పని ఏమిటో తెలుసా? సరి అయిన సమయం లో కాకుండా ముందే తోట లో చెట్లు కాపుకు వస్తే వెంటనే వాటి పూత విరిచేసి కాపు కాయకుండా జాగర్త పడతాడు. ఆ చెట్లుకు  నిర్ణీత సమయం  తర్వాత వచ్చే కాపును మాత్రం బద్రంగా చూసుకుంటూ తన ఫల సాయాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అలా కాకుండా ప్రక్రుతి ధర్మమే కదా అని రెండేళ్ళ చెట్టుకే కాపు కాయనిస్తే వచ్చేవి  కుక్కమూతి పిందెలే. ఇదే సూత్రం మానసికంగా పరిణతి చెందకుండా కేవలం వయస్సు తెచ్చే వ్యామోహం లో పడి జీవితాలు నాశనం చేసుకునే అమ్మాయిలు , అబ్బాయిలకు వర్తిస్తుంది.                      తెలివిగల తల్లి తల్లితండ్రులు తమ బిడ్డలు కు యవ్వనపు చాయలు పొడసూపుతున్నప్పుడే చాలా జాగర్తగా ఉండాలి. అమ్మాయిలూ , అబ్బాయిలు కలిసి తిరగడం కామనేలే , వారి స్నేహాలకు అడ్డుకట్ట వేయడమంటే చాందస వాదాన్ని ప్రొస్తాహించినట్లే అని బావింఛి , మొదట్లో ఉదాసీనంగా  ఉండే తల్లి తండ్రులు , చివరకు తమ పిల్లల బవిష్యత్ నాశనానికి తామే కారకులవుతారు అని తెలిపే ఉదంతం మొన్న 14 వ తారీఖున ఉత్తరప్రదేశ్ లోని ఆగ్