మితిమీరిన ప్రేమ అందుడినే కాదు హంతకుడిని కూడా చేస్తుంది!
ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమించిన వారికోసం వారు ఏమైనా చేస్తారు. ఇంట్లో వారికి రూపాయి ఖర్చుచెయ్యడం ఇష్టపడనివారు సైతం ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతైనా దారపోస్తారు.కారణం వారిలో ఉన్నది స్వార్దం తో కూడిన ప్రేమ మాత్రమే. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. అలాంటి ప్రేమ తల్లినీ,చెల్లీనీ ,భార్యనీ ఒకేలా ప్రేమించేలా చేస్తుంది. కానీ మోహంతో కూడిన ప్రేమలో త్యాగం అనేది ఉండదు. తాను ఇష్టపడిన అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తారు. వారి కోసం అప్పు చేసైనా వారు కోరింది ఇస్తారు. కానీ అదే ప్రేమను ఎదుటి వారు తిరస్కరిస్తే అస్సలు ఓర్చుకోరు. అవసరమైతే తనకు దక్కనిది ఎవరికి దక్క కూడదనే ఉద్...