వనబోజనాలకు జనం "నిల్ ' ! కులబోజనాలకు కలెక్షన్ పుల్ !
వనసమారాదన పేరిట కార్తీక మాసం లో జరుపుకునే వనబోజనాలు చివరకు "సిటి లో మా కుల బలం ఇది " అని జరిపే బల ప్రదర్శనలుగా మారినట్లు కనిపిస్తుంది. మనది ప్రజాస్వామ్య దేశం . కులం మతం వలదని ఎన్ని చెప్పుకున్న అవి ఆదర్శాల జాబితాలో ముందు ఆచరణ జాబితాలో వెనుక బడి ఉన్నాయి. కొంతమంది ఆదర్శ వాదులు కుల బోజనాలు వద్దు. అందరూ కలసి కుల రహితంగా వనబోజనాలు చేయాలి అని చెపుతున్నారు. అయితే ఈ ఆదర్శ బోజనాలు గురించి చెప్పేవారు , అసలు జనం కులబోజనాలు పట్ల ఎందుకు మక్కువ చూపుతున్నారో ఆలోచించకుండా స్తేట్మెంట్ ల మీద స్తేట్మెంట్లు ఇస్తుంటే , వారి దారి వారిదే జనం దారి జనం దే అన్నట్లు ఉంది. వనబోజనాలు అనేవి సంవత్సరానికి ఒక సారి జరుపుకునే కార్యక్రమం. మనం పెండ్లిల్లకు వెళ్ళినా , పేరంటాలకు వెళ్ళినా, చివరకు దైవ కార్యక్రమాలకు వెళ్ళినా అక్కడ పాల్గొనే వారంతా కుల రహితంగానే పాల్గొంటారు. కాని వన సమారాదనకు వచ్చే సరికి కుల పరంగానే జరుపుకుంటున్నారు అంటే అందులో ఉన