ఏడేళ్ళుగా విడాకులు కేసు నలుగుతుంటే , ఉప్పూ కారం తినే వాడు ఊరుకుంటాడా !?
నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ! అదే రోజున ఒక మహిళ తన భర్త మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు , తన పిల్లలకు తెలియకుండా అజ్ఞాత కాపురం చేస్తున్నాడని , ఆ సహచరిణి ఇంటి ముందు ధర్నా చేసి తెలుగు మీడియా వారికి సంచలన వార్తా గా మారింది . ఇది జరిగింది విజయవాడ లోని రామవరప్పాడు లో . వివరాలు లోకి వెళితే .... వెంకటేశ్వర రావు గారు కరీంనగర్ APSP బెటాలియన్ లో D.S.P . ఆయనకు బార్యా భూలక్ష్మి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు . దానితో పాటు ఆయనకు ఆదారం లేని ఆడవాళ్ళను ఆదుకునే ఎనలేని ఔదార్యం ఉందట . అల్లాంటి ఆయనకు ప్రమాద వశాత్తు చనిపోయిన ఒక కానిస్టేబుల్ బార్యకు సహాయం చేస్తూ , ఆమె మిద అనురాగం పెంచుకుంటే , అది కాస్త ఇంట్లో గొడవల రాగానికి దారి తీసింది . అ పై...