ఏడేళ్ళుగా విడాకులు కేసు నలుగుతుంటే , ఉప్పూ కారం తినే వాడు ఊరుకుంటాడా !?

                                                                           


                 నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ! అదే రోజున ఒక మహిళ తన భర్త మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు , తన పిల్లలకు తెలియకుండా అజ్ఞాత కాపురం చేస్తున్నాడని , ఆ  సహచరిణి ఇంటి ముందు ధర్నా చేసి తెలుగు మీడియా వారికి సంచలన వార్తా గా మారింది . ఇది జరిగింది విజయవాడ లోని రామవరప్పాడు లో . వివరాలు లోకి వెళితే ....


   వెంకటేశ్వర రావు గారు కరీంనగర్ APSP బెటాలియన్ లో D.S.P . ఆయనకు బార్యా భూలక్ష్మి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు . దానితో పాటు ఆయనకు ఆదారం లేని ఆడవాళ్ళను ఆదుకునే ఎనలేని ఔదార్యం ఉందట . అల్లాంటి ఆయనకు ప్రమాద వశాత్తు చనిపోయిన ఒక కానిస్టేబుల్ బార్యకు సహాయం చేస్తూ , ఆమె మిద అనురాగం పెంచుకుంటే , అది కాస్త ఇంట్లో గొడవల రాగానికి దారి తీసింది . అ పై కోర్టు కేసులు అవి , ఇవి జరగడం , అయన గారు బార్యతో తాత్కాలిక ఒప్పందాలు చేసుకుంటూ ఎలాగో కాలం నేట్టుకోస్తున్నట్లు ఉంది . మొత్తానికి అయన చట్ట బయం చేత , ఉన్న ఉద్యోగం పోతుందనే బయంతో బార్యతో సక్యత ఉన్నట్లు నటిస్తున్నాడు కాని , ఆమె మిద ప్రేమ తో కాదని అయన మాటల్లో అర్దమవుతుందట .


   అయన గారు చెప్పే దాన్ని బట్టి , ఆ  దంపతుల విడాకుల కేసు గత 7 ఏండ్లుగా కోర్టుల్లో పెండింగ్ ఉందట . గత 7 ఏండ్లుగా ఆయనకు బార్యతో ఏ  సంబందాలు లేవట . చట్ట ప్రకారం విడిపోయి ఎవరి బ్రతుకు వారు బ్రతుకుదాం అంటే కోర్టులు ఏమో త్వరగా కేసులు తెల్చవాయే ! కేసులు తేల్చిన్దాక ఉప్పూ కారం తినే వయసు ఏమో ఊరుకొని చావదాయ ! అందుకే బార్యకు తెలియకుండా , తన తో సహచారత్వానికి సై  అన్న ఆవిడతో విజయవాడ వచ్చి , రామవరప్పాడు లో ఒక బిసినేస్స్ మెన్ గా పరిచయమై అక్కడ సహచర జీవనం గడుపుతున్నాదట . అది ఎలాగో బార్య భూ లక్ష్మి కి తెలిసి , విజయవాడ వచ్చి అక్కడ ప్రియురాలి ఇంటి ముందు ధర్నాకు దిగితే , స్తానిక మహిళలు ఆమెకు అండగా నిలిచారు . అ దెబ్బతో విజయవాడ పోలీసులు అ ప్రేమికులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు అట . ఈ  విదంగా వారి అజ్ఞాత సహచర జీవనం బట్ట బయలై అబసు పాలైంది .


   ఏది ఏమైనా ఒక స్త్రీ కాపురం నాశనం కావడానికి మరొక స్త్రీ సహకారం ఉంటేనే అది సాధ్య పడుతుంది . మగబుద్ది కోతి వంటిది . దానికి అవకాసం ఇస్తే చాలు సామాజిక కట్టుబాట్లు తెంచుకోవాలనే చూస్తుంది . దానిని కంట్రోల్ చేయాలంటే బార్యలకు అధికారం ఉండాల్సిందే . కాని ఒక సారి తమకు విడాకులు కావాలి అని కోరుకుని చట్ట పరమైన తీర్పులు కోసం కోర్టులను ఆశ్ర యించాక దానిని సాద్యమైనంత త్వరగా తేల్చి వేసి వారిద్దరికీ తగిన న్యాయం చేయడమే ఉత్తమమ్. లేకుంటే ఇలాగే అజ్ఞాత వాసాలు , ఆబాసు పాలులూ , మరి కొన్ని కేసులు నమోదు తప్పా పలితం ఏమి ఉండదు . ఇప్పటికైనా వెంకటేశ్వర రావు గారు తన భార్యతో ఒక ఒప్పందానికి వచ్చి , వారి కేసును సత్వరమే పరిష్కరిచుకుంటే  బాద్యత గల కుటుంబాలు బజారున పడే అవకాసం ఉండదు . మహిళా సంగాలు కూడా కేవలం పురుషులనే కాకుండా వారితో పాటు , కాపురాలను కూల్చటానికి సహకరిస్తున్న స్త్రీలకు బుద్ది చెపుతుంటే , సమాజంలో కొన్ని మంచి పలితాలు వచ్చె అవకాశ ముంది .


నిన్న జరిగిన సంగటన పై మరిన్ని వివరాలు కోసం క్రింది విడియోని చూడండి .

                     
                      

                                           (9/3/2014 case Republished). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!