బ్లాక్ మనీకి వైద్యం చేస్తే , రోగి బాధపడుతున్నట్లు కనిపించక , రోగకారక వైరస్ బాధపడుతున్నట్లు కనిపిస్తుందా, మేధావులారా !!
ఇండియాలో కొంతమంది మేధావులకు ఒక అంటురోగం ఉంది . అదేమిటంటే ఒకరేదైనా అంటే తతిమ్మావారు అదే మాటను పొల్లుపోకుండా వల్లెవేస్తుంటారు. అలాంటిదే ఒక డైలాగ్, మహామేధావి కేజ్రీవాల్ గారి దగ్గర మొదలై చోటా మోటా నాయకుల అందరి నోళ్ళలో నానుతుంది. అదే "పెద్దనోట్ల రద్దు వలన సామాన్యజనం ఇబ్బంది పడుతున్నారు తప్పా , నల్లకుబేరుల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా " అనే మాట. దీనికి వారు చూపిస్తున్న సాక్ష్యం ఏమిటంటే "పాతనోట్ల మార్పిడి కోసం సామాన్యులు , మధ్యతరగతి వారు క్యూ లైన్లలో నిలబడుతున్నారు తప్పా , ఎవరైనా బ్లాక్ మని దాచుకున్న సూటు బూటు దారులు లైనులలో నిలబడటం లేదన్న విషయం . అంటే వీరి వాదం ప్రకారం మోడీ గారు పెద్ద నోట్లు రద్దు అనగానే తెల్లారే పాటికి బ్యాంక్ లు ముందు కార్లలో వచ్చిన బడాబాబులు లైన్లలో నిలబడి తమ వద్ద ఉన్న పెద్దనోట్లు అన్ని బ్యాంక్ లో డిపాజిట్లు చేస్తే , అప్పుడు గాని నల్లకుబేరులు కు నష్టం తప్పా అన్యదా కాదు అని . మరి వీరి వాదం లో నిజం ఉందా ? ప్రజలు అమాయకులు, ఏమి చెప్పినా చెవిలో పువ్వులు పెట్టుకుని వింటారులే అనే ధీమా ఉందా?
భారత ప్రధాని 8 వతారికు రాత్రి పెద్దనోట్లు రద్దు గురించి ప్రకటించగానే జాతి యావత్తు మొదట ఆశ్చర్య పోయినా , మెజార్టీ సామాన్య ప్రజలు అయన ప్రకటనను స్వాగతించారు . ఈ చర్య దేశ ప్రయోజనాలు నిమిత్తం తీసుకున్న సాహసోపేతమైన చర్య కాబట్టి ,తమకు ఎన్ని కష్టాలు కలిగిన పెద్ద నోట్ల రద్దుకు సహకరించి తీరుతామని వివిధ మీడియాల సాక్షిగా చెప్పారు . దానికి ప్రదాన మంత్రి గారు కూడా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు . ఎక్కడో కేజ్రీ లాంటి వారు కల్లు తాగిన కోతిలా ఊగిపోయి చిందులు వేస్తుంటే , మమతా దీదీ లాంటి వారు నోట్ల రద్దును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు . దీనికి గాను వారు చూపించే వంక ఒకటే . అదే పైన తెల్పిన "పెద్దనోట్ల రద్దు వలన సామాన్యజనం ఇబ్బంది పడుతున్నారు తప్పా , నల్లకుబేరులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా " అనేది .
నిజమే ! పైకి చూస్తే కనపడేది క్యూలలో గంటలు తరబడి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల బాదలే . కానీ పెద్ద నోట్ల రద్దుతో గుండెలు జారిపోయి , తమ డబ్బును వైట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్న నల్ల కుబేరుల బాధలు బయటకు ఎలా కనపడతాయి? పొద్దున్నే కూలీలు జమ అయ్యే అడ్డాల వద్దకు తమ ఏజెంట్లను పంపి , వారికి 10% కమిషన్ ఇస్తామని ఆశ చూపి , పాతనోట్లు ఇచ్చి బ్యాంక్ ల వద్దకు పంపిస్తుంటే వారి వలననే క్యూలైన్ లు చాంతాడు తాడంతగా పెరిగిపోతున్నాయి . మొన్నటి వరకు, అలా డబ్బులు మార్పిడి చేసుకున్నప్రతి కమిషన్ కూలీ , తిరిగి తిరిగి డబ్బులు మార్పిడి చేస్తూ , రోజుకు కనీసం 1000 రూపాయలు తాము కమిషన్ ల రూపం లో పొందుతూ 10,000 రూపాయల వరకు నల్లకుబేరుల బ్లాక్ మనీని వైట్ చేయగలిగారు . మరి ఇలా కమిషన్ లకోసం నల్ల కుబేరులకు సహాయం చేస్తూ తోటి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పేద ప్రజలను ఏమనాలి ? సామాన్య ప్రజల ఇబ్బందికి ఇటువంటి వారు కారణం కారా? అటువంటి వారికి చెక్ పెట్టడం కోసం మార్పిడి రోజుకు 4,000 నుంచి 2000 వేలకు తగ్గించాల్సి వస్తే , అది స్వీయ ప్రయోజనం కోసం మార్పిడి చేసుకునే ప్రజలకు ఇబ్బందిగా ఉండక ఏమవుతుంది ? చివరకు ఇలా నోట్ల మార్పిడి కూడా ఉపాధి హామీ పథకం ల మారినందుకు ప్రభుత్వం రోజుకో విధానం ప్రకటించాల్సి వస్తుంది.
నల్లధనం అనేది ఒక మహా సామాజిక రోగం . దానివలన బాధపడేది, పడాల్సింది కూడా నిజాయతి పరులైన సామాన్య ప్రజలే. ఎందుకంటే ఒక వేళా నల్లడబ్బు నిర్మూలన జరిగితే లాభపడేది వారే కాబట్టి . నల్ల డబ్బు దాచిన కుబేరులు రోగ కారక వైరస్ లు లాంటి వారు . వైరస్ బాధ పడుతున్నట్లు ఎవరికీ కనిపించదు . రోగి బాధలు నయమయి పూర్తిగా ఆరోగ్యవంతుడు అయినప్పుడు మాత్రమే వైరస్ నిర్ములన జరిగిందని గ్రహించగలం . అప్పటి దాకా వైద్యం చేసే డాక్టర్ కి తప్పా , పైకి చూసేవారెవరికి వైరస్ నిర్ములన జరుగుతున్న క్రమం గురించి తెలియదు. అలాంటిదే నల్ల ధనం నిర్ములనా కార్యక్రమం. ఇన్నాళ్లు ఈ జబ్బుకు పై పై మందు పూతలతో ఉపశమనం కలిగించడానికి పరిమితమవటం వలన రోగం బాగా ముదిరి పోయి , ఉగ్రవాద , విదేశీ ప్రేరేపిత నకిలీ ధన రూపం లో సమాజాన్ని పీడిస్తుంటే , డాక్టర్ మోడీ ఒక సాహసోపేత నిర్ణయం ద్వారా "ఆపరేషన్ బ్లాక్ మని "ని మొదలు పెట్టారు . దీనికి మనం కొన్నాళ్ళు హాస్పిటల్లో బాధలు పడే రోగి మాదిరి బాధలు పడక తప్పదు . అందుకు భారతీయులు సిద్దమనికూడా ప్రకటించారు .
" ఆవు బాగానే ఉంది , దూడ బాగానే ఉంది , గుంజకు పుట్టింది గురక తెగులు అన్నట్లు " అటు ప్రభుత్వం ఇటు ప్రజలు తాత్కాలిక సమస్యలను ఎదుర్కోవడానికి సిద్దపడినా కొంత మంది నల్లధన కుబేరుల ఏజెంట్లు అయినా నాయకులకు ఈ ఆపరేషన్ సుతరామూ ఇష్టం లేనట్లు ఉంది . అందుకే బెడ్ మీద రోగి పడుతున్న బాధలను బూతద్దం లో చూపిస్తూ , నల్ల వైరస్ కేమి కావటం లేదని కహానీలు చెపుతున్నారు . వీరి మాటలు నమ్మే అంట అమాయకులు కారు ప్రజలు అని వీరు గుర్తుంచుకోవటం అందరికి క్షేమకరం.
ee raddu ni vyathirekinche vaaru cheppe kaaranaalu okkati koodaa vaadanaku nilabadavu...500 kotlu black money pattukuni badaa baabulu bank line lo nilabadataarani aa picchiwaalaa elaa oohinchaadu...okappudu aayana pai unna gavuravam ippudu poyindi...manchi post pettaaru...
ReplyDeleteనల్ల కుబేరులు బ్యాంక్ ల ముందు క్యూలలో నిలబడి పాత పెద్ద నోట్లు మార్చుకోవడమా ? అలా మార్చుకుంటుంటే చూడాలని కేజ్రీవాల్ గారి లాంటి వారి అత్యాశ కాబోలు . అయినా ఇండియాలో బ్లాక్ కుబేరులకు అంత ఖర్మేమిటంటా ? 10 % కమిషన్ తో వేల రూపాయల నోట్లు మార్పిడి చేసే పేద ఏజెంట్లు మొదలు 50% కమిషన్ తో కోట్లు మార్పిడి చేయగలిగిన పెద్ద ఏజెంట్లు దాకా సదరు నల్ల దొరల కోసం, అహర్నిశలు శ్రమిస్తుంటే ఇక వారికి దిగులేముంది ? విచారమేముంది ? మీ స్పందనకు ధన్యవాదాలు .
DeleteNice:-
ReplyDeletehttp://www.rajobs.in/