ఇలాంటి పనికి రాని కొడుకుని కంటే , తల్లి తండ్రులు శ్మశానం లో కూడా ప్రశాంతంగా నిద్ర పోలేరట !
తల్లి బ్రతికి ఉన్నంత కాలం ఆమె బాగోగులు పట్టించుకోకుండా , చెల్లెలి మీద ఆమె సంరక్షణా బారం వదిలేసిన కొడుకు ,తల్లి చనిపోయిన రెండు నెలలకు ,ఆస్తి కోసం చెల్లి మీద ఆరోపణలు చేయడమే కాక , తల్లి శవాన్ని శ్మశానం నుండి తవ్వి తీయించి పరిక్షలు చేయిస్తున్నాడట! పాపం ఆ తల్లి ఎంతటి పాపం చేసుకుంటే ఇలాంటి పుణ్యాత్ముడు పుట్టాడో! పున్నామ నరకం నుంచి రక్షించే వాడు పుత్రుడు అని "పుత్రుడు " కి ఉన్న అర్దాన్ని మార్చాల్సిన రోజులు ఇవి! చచ్చినా సరే , వెంటాడి వేదించే వాడేరా "కొడుకు" అని తల్లి తండ్రులు అర్దం చెప్పుకునే పరిస్తితులు దాపురిస్తున్నాయి . కుటుంబాల్లో తల్లి తండ్రుల సంరక్షణా బారo ని మోయలేని బారంగా తలస్తున్న ఆదునిక సమాజపు కొడుకుల ప్రవర్తనను తెలియచేస్తున్న ఈ ఉదంతం గురించి తెలుసుకోండి .
ఉత్తర ప్రడేశ్ లోని లల్లా పూర్ కి చెందిన ష్యాజాది బేగం గారికి ఒక కొడుకు , కుమార్తె ఉన్నారు. తల్లి అంటె పడని కొడుకు , ఆమెను కుమార్తె దగ్గరే వదిలేశాడు . ఆమెకు 65 యేండ్లు . కాలం తీరి ఆమె ఈ సంవత్సరం సెప్టెంబర్ 14 న చనిపోయింది . అయితే ఆమె శేష ఆస్తులు కోసం కొడుకు కూతురితో గొడవ పెట్టుకున్నాడు . చివరకు చెల్లిని ఎలాగైనా ఇబ్బ్బందుల పాలు చేయాలని , తన తల్లిని ఆస్తి కోసం చెల్లె చంపిందన్న నమ్మఖ్ఖమైన సమాచారం తన వద్ద ఉందని , పోలిస్ కేసు పెడితే వారు కేసు చెయ్యడానికి నిరాకరించారు అంట! దానితో కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయగా, కోర్టు వారి ఆదేశాలతో పోలిసులు మొన్న నవంబర్ 20 న ఆ నిర్బాగ్యురాలైన తల్లి శవాన్ని , బయటకు తీసి పోస్టు మార్టం కి పంపించారు అంట! రిపోర్ట్ రావాల్సి ఉంది . ఆస్తి కోసమే తన అన్న ఇదంతా చేసాడని చేస్తున్నాడు అని చెల్లి గగ్గోలు పెడుతున్నా చట్టం తన పని తానూ చేసుకు పోవాల్సిందే కదా !
ఒక వేళ ష్యాజాదీ బేగం కూతురి చేతిలో మరణించినా , దానికి కారణం ఆ కొడుకే అవుతాడు . ఎందుకంటె పిల్లలందరూ తల్లి తండ్రుల సంరక్షణా బాద్యతను తీసుకోవడానికి సంసిద్దులై ఉంటె ఇలాంటి అనర్దాలు జరుగవు!. సౌకర్యా రీత్యా తల్లి తండ్రులు ఒకరి వద్దే ఉండాల్సి వచ్చినఫ్ఫటికి , మిగతా పిల్లలు ఆర్దికంగా , ఇతరత్రా ఆ సంరక్షణా బారాన్ని మోసే వారకు సహాయంగా ఉంటె ఎంత బాగుంటుంది . వయసు మళ్ళిన వారికి "మేమున్నాం" అని పిల్లలు ఇచ్చే బరోసే, వారి సంక్షేమానికే కాదు ప్రాణాలకు కొండంత అండ! అది ఉన్న తల్లి తండ్రులు నిజంగా అదృష్టవంతులు! కట్టుకున్న పెళ్ళాలకు నచ్చచెప్పలేక , కట్టుబట్టలతో తల్లితండ్రులను ఆడపిల్లల ఇంటి పైన వదిలే కొడుకులకు , తల్లితండ్రుల బాగోగులు , ఆస్తులు గురించి అడిగే నైతిక అర్హత లేదు.
బ్రతికినంత కాలం తండ్రిని చెల్లి ఇంటిమీద వదిలి వేసిన కొడుకు ఒకతను , తండ్రి చనిపోగానే ఆస్తి రాదేమోననే అనుమానంతో తండ్రి శవాన్ని బుజం మీద తీసుకు వెళ్లి తన ఇంటి దగ్గర ఉత్తర క్రియలు నిర్వహించిన కొడుకుని నేను స్వయంగా చోశాను. వీళ్లంతా టెక్నికల్ కొడుకులు! తల్లి తండ్రులని చస్తే తగలేసి ఆస్తులు గుంజుకోవాదానికి తప్పా , ఆత్మీయంగా చేరదీసి సంరక్షించే వెన్నెముక లేని వారు . ఇలాంటి వారి మీద ఇదే బ్లాగులో నేను ఇంతకు ముందు పెట్టిన టపాను చూడండి .
"వ్రుద్దాప్య నరకం" నుండి రక్షించేవారు పుత్రుడా? పుత్రికా?
source :- http://rajasthanpatrika.patrika.com/news/varanasi-man-alleged-his-sister-for-killing-of-mother/1205244.html
(3/12/2014 Post Republished).
Comments
Post a Comment