Posts

Showing posts with the label వ్రుద్దాప్య నరకం

"వ్రుద్దాప్య నరకం" నుండి రక్షించేవారు పుత్రుడా? పుత్రికా?

Image
                                                     ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయి, చిన్న కుటుంబాలుగా మన జీవన విదానం మార్పు చెందింది. అయితే దీని వలన ఏ విషయం ఎలా ఉన్నా, ముఖ్యంగా సంకట స్తితిలో నెట్టబడింది, కుటుంబాలలోని వ్రుద్దుల పరిస్తితి. సాదార్ణంగా,ఉమ్మడి కుటుంబాలలో, పెద్దల చేతిలో పెత్తనం ఉంటుంది కాబట్టి, ముసలివాండ్ల పరిస్తితి బాగుండెది. మనవళ్లు, మనవరాళ్లు, కొడుకులు,కోడల్లు తో అంరూ ఉండటం వల్ల అదే ఒక చిన్న సమూహం లాగ కళ కళ లాడుతూ ఉండేది. ఒకరు కాకపోతే మరొకరు,వ్రుద్దుల బాగోగులు చూడటానికి అవకాశం ఉండెది.కాబట్టి వారికి భద్రత ఉండేది.   కాని ఇప్పట్టి చిన్న కుటుంబాలలో ఆ పరిస్తితి లేదు. ముసలి వాల్లను ఎవరు చూడాలి అనేది, ఒకరికి మించి కొడుకులు ఉన్న కుటుంబాల, ఆస్తుల పంపకాల సమయంలో పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. నీవు చూడు అంటే నీవు చూడు అని బాద్యతని తప్పించుకోవటానికే కొడుకులు కాని, వార్ని కట్టుకున్న కోడళ్లు  కాని చూస్తున్నారు. అప్పటిదాక ఒకటిగా కుటుంబాన్ని నడిపిన కొంతమంది దంపతులు, కొడుకుల "బాద్యత పంపకాలు"లో బాగంగా "విడాకులు" తీసుకున్న జంటలాగ  బర్త ఒక కొడుకి దగ్గర, బార్య  ఇంకొ

ఇలాంటి పనికి రాని కొడుకుని కంటే , తల్లి తండ్రులు శ్మశానం లో కూడా ప్రశాంతంగా నిద్ర పోలేరట !

Image
                                                                                                                   తల్లి బ్రతికి ఉన్నంత కాలం ఆమె బాగోగులు పట్టించుకోకుండా , చెల్లెలి మీద ఆమె సంరక్షణా బారం వదిలేసిన కొడుకు ,తల్లి చనిపోయిన రెండు నెలలకు ,ఆస్తి కోసం  చెల్లి మీద ఆరోపణలు చేయడమే కాక , తల్లి శవాన్ని శ్మశానం నుండి తవ్వి తీయించి పరిక్షలు చేయిస్తున్నాడట! పాపం ఆ తల్లి ఎంతటి పాపం చేసుకుంటే ఇలాంటి పుణ్యాత్ముడు పుట్టాడో! పున్నామ నరకం నుంచి రక్షించే వాడు పుత్రుడు అని "పుత్రుడు " కి ఉన్న అర్దాన్ని మార్చాల్సిన రోజులు ఇవి! చచ్చినా సరే , వెంటాడి వేదించే వాడేరా "కొడుకు" అని తల్లి తండ్రులు అర్దం చెప్పుకునే పరిస్తితులు దాపురిస్తున్నాయి . కుటుంబాల్లో తల్లి తండ్రుల సంరక్షణా బారo ని మోయలేని బారంగా తలస్తున్న ఆదునిక సమాజపు కొడుకుల ప్రవర్తనను తెలియచేస్తున్న ఈ  ఉదంతం గురించి తెలుసుకోండి .        ఉత్తర ప్రడేశ్ లోని లల్లా పూర్ కి చెందిన ష్యాజాది బేగం గారికి ఒక కొడుకు , కుమార్తె ఉన్నారు. తల్లి అంటె పడని కొడుకు , ఆమెను కుమార్తె దగ్గరే వదిలేశాడు . ఆమెకు 65 యేండ్లు . కాలం తీరి