Posts

Showing posts from March, 2016

'తిక్కల పోరి తైతక్కలాటకు' క్లైమాక్స్ సీన్ "అమ్మ నీ కమ్మని దెబ్బ" ని చూడండి !!

Image
                                                                                       ఈ  మద్య , చదువుకునే పోరగాల్లకి అదేదో మాయదారి " ప్రచార పిచ్చి " అనే జబ్బు పట్టుకుందట. కొంత మంది పోరగాల్లు పోరులతో కలిసి ఒక పబ్లిక్ ప్లేస్ ల జమ గావడం, ఒక్క సారిగా పిచ్చి పట్టినట్లు గంతులేస్తూ వెర్రి కేకలు వేయడం. వారి కోతి గంతులకు వెనుక సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. డ్యాన్స్ అంతా అయ్యాక ఇదేందబ్బా గిట్ల ఎగిరిన్రు అని ఎవరైనా అడిగితె "జనం లో చైతన్యం తెచ్చుట కొరకు" అనే భుకాయింపులు . ఈ  లత్కోరి డాన్స్ లు చూసే వారికి ఎట్లున్నా , ట్రాపిక్ జామ్ అయి పబ్లిక్ బాదపడుతుంటె , పరువు తీసేసినట్టయి డాన్స్ లు వేసే పోరగాల్ల ఇంట్లో పెద్దలు బాదపడుతున్నారు. అలా బాధపడే ఒక తల్లి , తన కూతురు బస్టాండ్ లో పబ్లిక్ గా లత్కోరి డాన్స్ వేయడం చూసి తట్టుకోలేక ఏమి చేసిందో ఈ క్రింది విడియోలో చూడండి. సీన్  కేరళలో ఒక బస్ స్టాండ్ లో స్టూడెంట్స్ అయిన యువతీ యువకులు కల్సి "మోబ్ ఫ్లాష్ " అనబడే మోడ్రన్ లత్కోరి డాన్స్ చేస్తుంటే , అందులో ఒక అమ్మాయి తల్లి వచ్చి ఆ అమ్మాయి చెంప పగులగొట్టడమే కాక అందులో పాల్గొ

పెండ్లి కాని "బాబా" లు గొప్పా ? పెండ్లి అయిన "భాబా" లు గొప్పా?

Image
                                                                                                              మన దేశం లో బాబాలు అనబడేవారు రెండు రకాలు. ఒకరు పెండ్లి కాని బాబాలు అయితే రెండవ రకం పెండ్లి అయిన భాబాలు . వీరిలో ఏ రకం బాబాలు గొప్ప వారు అనేది తెలుసుకునే ముందు అసలు ఈ  రెండు రకాల బాబాల మద్య ఉన్న తేడాలు ఏమిటొ తెలుసుకుంటే గాని చెప్పడం కుదరదు. అందుకే వీరి గురించి వివరిస్తాను.  ముందుగా పెండ్లి కాని బాబాలు గురించి తెలుసుకుందాం. మన దేశం లో పూర్వం రుషులు , మునులు అనబడె మానవోత్తములు ఉండె వారు . వీరు వనాలలో ఆశ్రమాలు నిర్మించుకుని , తమ పరివార సహితంగా జీవిస్తూ  తమ అనుభవాలను , జ్ఞానాన్ని తమ తర్వాతి తరాలకు అందిస్తూ  సమాజానికి మార్గదర్శకులై ఉండె వారు . సాదారణంగా  వీరు వివాహాలు చేసుకుని , తమ ధర్మ పత్నులతో ధర్మ బద్దమైన గృహస్త మరియు వానప్రస్త జీవితం గడుపుతూ ఉండె వారు.     మోడరన్ యుగం లో మునులు రుషులు లేరు. వారి స్తానాన్నిబాబాలు , స్వామీజీ లు ఆక్రమించారు . వీరికి పెండ్లిళ్ళు పెటాకు ఉండవు. సంసార జంజాటాలు ఉండవు. హిందూ జీవన విదానం లో ప్రధానమైన గృహస్త , వానప్రస్తం దశలను అనుభవించకుండా డైరెక్ట

అసెంబ్లీ రూల్స్ దెబ్బకు రేకలు రాలిన "రోజా "!!

Image
                                                                                                                               పాపం రోజా ! ఆంద్ర ప్రదేశ్  ప్రతిపక్ష నాయకులు జగన్ గారు అభిమానం గా "రోజమ్మా " అని పిలుచుకునే అయన గారి చెల్లెమ్మా ! ప్రస్తుతం ఆమె గారి పరిస్తితి చూస్తుంటె "రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే ? తోట మాలి నీ తోడు లేడులే " అన్న మాతృదేవో భవ లోని పాట గుర్తుకు వస్తుంది.    ఎంత అవమానం! ఎంత అవమానం! ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో ఏ సభ్యునికి అదీ కూడా ఒక మహిళా సభ్యురాలికి ఎదురవ్వని అత్యంత హీనకరమైన పరిస్తితి? సుమారు 60 మంది ప్రతిపక్ష సబ్యులు ఉన్న ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎవరికీ విదించని  1 సంవత్సర కాలం పాటు సస్పెన్షన్ అనే శిక్షను ఒక మహిళా సబ్యురాలికి మాత్రమే విదించారు అంటె ఆమె "అసెంబ్లీ తాటకి " అయి ఉంటుందని బవిష్యత్ తరాలు అనుకునే దుస్తితి! ఇదంతా ఎందుకు జరిగింది?ఆమే తో పాటు  అభియో గాలు ఎదుర్కొన్న చెవి రెడ్డి బాస్కర్ రెడ్డి లాంటి అదికార పక్ష తీవ్ర వ్యతిరేకులు సైతం కేవలం క్షమాపణ చెప్పడం ద్వారా హుందాగా శిక్ష నుండి తప్పించుకుంటె , రోజా గారు

T.V స్టూడియో లలో కుటుంబ వ(వి )లువలు ఊడదీస్తున్న మహిళా దుశ్యాసన త్రయం జీవిత , సుమలత , జయసుధ !!

Image
                                                                                          ప్రపంచం లో ఉన్న సమాజాలు అన్నింటిలో భారతీయ సమాజం కి ఉన్న విశిష్టత ఏమిటంటే , మన సమాజం లో ఉన్న పటిష్టమైన కుటుంబ వ్యవస్థ . రాజ్యం కంటే బలమైనది కుటుంబ వ్యవస్త. మన దేశం అనేక సార్లు విదేశి దండ యాత్రలకు గురి అయి , కొన్ని వందల సంవత్సారాలు పాటు విదేశి పాలనలో మగ్గినప్పటికి , మన బాషలు, సంస్క్రుతి , కుటుంబ  విలువలు నిరంతరాయంగా పరిరక్షింప బడ్డాయి అంటె కుటుంబ వ్యవస్తలో  వీదేసియులు ఎక్కువుగా జ్యోక్యం చేసుకోక పోవడం , అలాగే సామాన్య ప్రజానీకం విదేశి సంస్క్రుతి పట్ల ఎక్కువ ఆకర్షితులు కాకపోవడం. కాని ప్రజలకు జ్ఞానం కంటే ముందు స్వాతంత్ర్యం రావడం , విదేశియులు ఒక ప్లాన్ ప్రకారం, తమలో ఉన్న  వ్యాపార కాంక్ష  అనే డ్రాక్యులా ని   ఈ దేశం లోని కొంతమందికి   ఇంజెక్టు చేసి వెళ్ళటం వలన వారు విదేశి బావజాల డ్రాక్యులా లా మారి ఇక్కడి సంస్క్రుతిని అందులో బాగమైన కుటుంబ వ్యస్తని నాశనం చేయటం మొదలు పెట్టారు . అందులో బాగమే ఫామిలీ కౌన్స్ లింగ్ ప్రోగ్రామ్ ల పేరిట ఈ మద్య ట్. లలో వస్తున్న , బ్రతుకు జట్కా బండి, సంసారం ఒక చదరంగం, అందమైన జీవ

ఆంద్రా అసెంబ్లీని అల్లల్లాడిస్తున్న జజ్.. జజా ... రోజా ! జజ్ .. జజా రోజా !!

Image
                                                                                                                        YSR పార్టిలో జగన్ గారి తర్వాత స్తానం వారి అమ్మ గారైన  విజయలక్ష్మి గారో లేక  సోదరి  షర్మిల గారో ఆక్రమిస్తారు అని అందరూ అనుకున్నారు. జగన్ గారు కూడా ఇదివరలో తను జైలులో ఉన్న సమయాల్లో కూడా , తన పార్టిలో అనుభవజ్ఞులు అయిన నాయకులు ఉన్నప్పటికి , పార్టి బాద్యతలు తన తల్లి , చెల్లికే అప్ప చెప్ప్పారు. కాని వారివురు పార్టిని జగన్ గారంతా సమర్దంగా నడపలెరేమో అనిపిస్తుంది. ఆయనకు అంతో ఇంతో  అధికార పక్షాన్ని ఎదుర్కొనడం లో సహకరిస్తుంది  ఎవరంటే హావబావ జబర్దస్త్ నటిమణి శ్రీమతి రోజాగారే అని చెప్పవచ్చు .      అసెంబ్లీలో అయితే అధికార పక్షాన్ని ఇరుకున ఇరుకున పెట్టడానికి జగన్ గారు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నప్పట్కి , కాకలు తీరిన అధికార పక్ష యోదుల వ్యూహాలు ముందు నిలువలేక పోతున్నారు.  మొన్నటికి మొన్న తన పార్టిలో నుండి అధికార పార్తీలోకి జంప్ చేసిన వారి పని పడదామని ప్రయోగించిన ప్రభుత్వం మీద అవిశ్వాసం డివిజన్ కోరక ముందే వీగి పోయింది. కాబట్టి ఎవరు అనుకూలమో , ఎవరు వ్యతిర