T.V స్టూడియో లలో కుటుంబ వ(వి )లువలు ఊడదీస్తున్న మహిళా దుశ్యాసన త్రయం జీవిత , సుమలత , జయసుధ !!

                                                                                

 
       ప్రపంచం లో ఉన్న సమాజాలు అన్నింటిలో భారతీయ సమాజం కి ఉన్న విశిష్టత ఏమిటంటే , మన సమాజం లో ఉన్న పటిష్టమైన కుటుంబ వ్యవస్థ . రాజ్యం కంటే బలమైనది కుటుంబ వ్యవస్త. మన దేశం అనేక సార్లు విదేశి దండ యాత్రలకు గురి అయి , కొన్ని వందల సంవత్సారాలు పాటు విదేశి పాలనలో మగ్గినప్పటికి , మన బాషలు, సంస్క్రుతి , కుటుంబ  విలువలు నిరంతరాయంగా పరిరక్షింప బడ్డాయి అంటె కుటుంబ వ్యవస్తలో  వీదేసియులు ఎక్కువుగా జ్యోక్యం చేసుకోక పోవడం , అలాగే సామాన్య ప్రజానీకం విదేశి సంస్క్రుతి పట్ల ఎక్కువ ఆకర్షితులు కాకపోవడం. కాని ప్రజలకు జ్ఞానం కంటే ముందు స్వాతంత్ర్యం రావడం , విదేశియులు ఒక ప్లాన్ ప్రకారం, తమలో ఉన్న  వ్యాపార కాంక్ష  అనే డ్రాక్యులా ని   ఈ దేశం లోని కొంతమందికి   ఇంజెక్టు చేసి వెళ్ళటం వలన వారు విదేశి బావజాల డ్రాక్యులా లా మారి ఇక్కడి సంస్క్రుతిని అందులో బాగమైన కుటుంబ వ్యస్తని నాశనం చేయటం మొదలు పెట్టారు . అందులో బాగమే ఫామిలీ కౌన్స్ లింగ్ ప్రోగ్రామ్ ల పేరిట ఈ మద్య ట్. లలో వస్తున్న , బ్రతుకు జట్కా బండి, సంసారం ఒక చదరంగం, అందమైన జీవితం అనే కార్యక్రమాలు. 
                                                                                   
 

                     వివాహాలను వ్యక్తి స్వెచ్చకు అడ్డంకి గాను,   గ్రుహాన్ని హింసా వ్యవస్థా గాను బావిస్తున్న వారు ఎక్కువవుతున్న  మన సమాజం లో వివాహాల స్తానం లో "లేచిపోవడాలు "    సాంప్రదాయ సంసార గ్రుహాల స్తానం లో   " సహజీవన కొంప "లు  ఎక్కువ అవడం మొదలు పెట్టాయి. వండుకుంటే ఒకటే కూర అన్నట్లు , "కట్టుకుంటె ఒకరితోనే ఆనందం , అదే పెట్టుకుంటే కోరినంత మందితో అనందం " అనే మాదిరి ఈ  సహజీవన కొంపలు తయారు అయ్యాయి. పరువూ మర్యాద కల సాంప్రాదాయ కుటుంబాలలో  లో కలతలు వస్తే తమ పరువు ప్రతిష్టలకు బంగం కలుగకుండా ఒక పద్దతి ప్రకారం వాటిని పరిష్కరించుకోవాలని చూస్తారు. అందుకే కోర్టుల్లో ఉన్న వైవాహిక కేసులను సైతం "ఇన్ కెమేరా ప్రోసీడింగ్స్ " అంటే కేవలం పార్టీలు,  వారి న్యాయ వాదులు, మరియు సంబందిత న్యాయమూర్తి సమక్షం లో అదీ కూదా న్యాయమూర్తి గారి చాంబర్ లో విచారణ జరుపమని కోరే హక్కు పార్టీలకు ఉంటుంది. ఇలా ఏర్పాటు చెయ్యటానికి కారణం కుటుంబ వ్యవస్తకు ఉన్న ప్రతిష్టా  పరంపర ను భారతీయ చట్టాలు గుర్తించడమే. కాబట్టి పరువూ మర్యాదలు ఉన్న ఏ కుటుంభమూ తమ మద్య ఉన్న పోరాపోచ్చాలను ఇల్లెక్కి చాటుకోవడానికి    ఇష్టపడరు. కానీ T.V స్టూడియో లకి వచ్చి తమ మద్య జరుగుతున్న గొడవలు అన్నీ ప్రపంచం తో పంచుకుంటున్నారు అంటె వారు తమ పరువు ప్రతిష్టలను పబ్లిసిటి కోసమో , ఛానల్ వారు ఇచ్చే పైసల్ కోసమో  తాకట్టు పెట్టె రకాలు అయి ఉందాలి. 

     పైన చెప్పిన బ్రతుకు జట్కా బండి, సంసారం ఒక చదరంగం, అందమైన జీవితం అనే కార్యక్రమాలు ఫ్యామిలీ కౌన్ సిలింగ్ పేరుతో కుటుంబ విలువలను దిగజార్చేవిదంగా ఉంటున్నాయి . అందులో కనపడే కుటుంబ బాదితులు ఎవరికీ కుటుంబ విలువలు అంటె పట్టింపు లేనట్టి వారే. ఒకరిని చేసుకోవడం , వేరొకరిని తగుల్కోవడం , దానితో గొడవలు వచ్చి వేరే వారితో పోయి సహా జీవనం చెయ్యడం. అటువంటి వారే ఈ  ఫ్యామిలి డ్రామా కౌన్సిలింగ్ లకు వచ్చి , తాము చేసిన సిగ్గు లేని పనులను నిస్సిగ్గుగా చెప్పుకోవడం . దానితో అక్కడ ఉన్న  మహిళా యాంకర్  వారి మీద డాం , డూం అని కేకలు వేస్తూ సన్నివేశాన్ని రక్తి కట్టిస్తుంటె , బాది త పాత్రదారులు   మౌనంగా ఉండటం. దీనికి తోడు ప్రతి నిమిషానికి ఒక సినిమా పాట బ్యాక్గ్ గ్రౌండ్ లో పెట్టి ఎపిసోడ్ చూస్తున వారిలో సినిమా చూస్తున్నంత ఆనందం కలిగించడం. చివరకు టెక్నికల్ గా ఇది  కుటుంబోద్దరణ  కోసం ఉదేసించబడ్డ కౌన్సలింగ్ ప్రోగ్రామ్మే అని  చెప్పుకోవటం కోసం ఒక లాయర్ ని , డాక్టర్ ని ప్రవేశ పెట్టి వారి చేత సలహాలు ఇప్పించడం , చివరకు నూటికి 5 మాత్రమే కలిసి ఉంటాం అంటుంటె , మిగతా 95 మంది " నా అందమైన జీవితం , నాకు నచ్చిన వారికి అంకితం " అనుకుంటూ వెళ్లి పోతున్నారు. ఇది చూస్తున్న ప్రేక్షకులకి మాత్రం భారతీయ కుటుంబం బాంధవ్యాలు ఇంత నీచంగా ఉంటాయా అనే అనుమానం కలుగుతుంది. 
                                                                                

      
                                    ఇక పైన చెప్పిన కార్యక్రమాల్లో "అందమైన జీవితం " అనేదాంట్లో మాటి మాటికి మగ యాంకర్ ఒకరు బాదితుల బావోద్రేకాలు మీద ప్రేక్షకుల అభి ప్రాయాలు  కోరుతూ కౌన్ స్లింగ్ ప్రోగ్రామ్ ని కాస్తా "కౌన్ బనేగా కరోడ్ పతి " ప్రోగ్రాం గా మార్చి వేస్తాడు. కోర్టుల్లో ఇంకెమేరా ప్రొశిడింగ్ మాదిరి "అంతర్ముఖం " అనే దానిని పెట్టి , అక్కడున్న 50 నుంచి వంద మంది ప్రేక్షకులకు కనపడకుండా చేస్తున్నామని చెప్పి , లోపలి గదిలో కి తీసుకు వెళ్లి , బాదితులు చెప్పే వారి మనసులో బాధని , కెమెరాల ద్వారా ప్రపంచం మొత్తానికి కనపడేలా విన పడేలా చేస్తున్నారు. అంటె దీనివలన బాదితులకు మాత్రమే కాదు , యావత్ సమాజానికే చెవిలో పెద్ద పెద్ద పువ్వులు పెట్టి తమ చానళ్ళ రేటింగ్ లు పెంచుకుంటున్నారు. 

   పరువు గల వ్యక్తులకు వలువలు (దుస్తులు ) ఎలాదేహ  మాన సంరక్షణ చేస్తాయో , అలాగే కుటుంబానికి ఉన్న విలువలు కుటుంబ పరువు ప్రతిష్టలు బజారు పాలు కాకుండా చేస్తాయి. సమస్య లేని సంసార గృహం ఈ  భూమి  మీద లేదు అన్నద నిర్వివాదాంశం . మరి అటువంటి కుటుంబ విలువలు ను , తమ టీవీ వ్యాపారాల కోసం , స్టూడియో లలో విప్పదీసి ప్రపంచ ప్రదర్శన చేస్తుంటే మేదావులు  మిన్నకుండడం ఎంత వరకు బావ్యం. ఇటువంటి నీతి మాలిన కార్యక్రమాలను నిరసించాల్సిన అవసరం కాని, కోర్టుల్లో ప్రస్నించాల్సిన బాద్యత కాని సంస్క్రుతి పరిరక్షకులు అయిన పెద్దలకు లేదా? ఇందులో ఇంకొక దౌర్బాగ్యం ఏమ్టంటె  ఈ కార్యక్రమాలకు యాంకర్ లుగా స్త్రీలే ఉండడం . వీరు నటనలో మంచి అనుభవం ఉన్న జీవిత , సుమలత , జయసుధ  సహాజ  నటి మణులు.వీరు పోషించే పాత్ర  "భారతం లో దుశ్యాసనుడు " పాత్ర వంటిది . అక్కడ అతడు "ద్రౌపదీ వలువలు విప్పదీయడానికి ప్రయత్నిస్తే   , ఇక్కడ వీరు ఏకంగా భారతీయ  కుటుంబ వలువలు ఊడదిసి చూపిస్తున్నారు.  సదరు నటిమణుల కాపురాల్లో ఏ పొరపొచ్చాలు లేవా? ఉంటె ఇలాగే స్టుడియోల్లొ కెమెరాల ముందు విప్పదీసి ప్రజల ముందు ప్రద్సర్సీమ్చడానికి ఇష్టపడతారా? ఆలోచించు కోవాలి. 

                                                                              

    
                             నిజంగా ప్రోగ్రాం నిర్వాహ కులకు ఫ్యామిలి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లు ద్వారా డబ్బులు తో పాటు  అంతో ఇంతో సమాజ సేవ చేయాలి  అనుకుంటే ఒక్కొక్కరి జీవిత సమస్యను మారు పేర్లు  ద్వారా తెలియ చేస్తూ , నటి నటుల ద్వారా ఆ యా పాత్ర పోషణ చేయించి ప్రజలకు అర్ధమయ్యే లా చ్ఃఎయొచ్చు. చివరలో ఇది నిజ జీవిత గాధ ఆధారంగా నిర్మించిన కార్య క్రమం అని చెప్పి , డాక్టర్ గారు, లాయర్ గారి సలహాలను చెప్పిస్తే చాలా అర్ధవంతంగా ఉంటుంది అంతో ఇంతో అర్దం (డబ్బు ) కూదా వస్తుంది. అంతే కాని నిజమైన కుటుంబ సభ్యలను ఏదో రకంగా స్టుడియోలకి తీసుకు వచ్చి , వారు చేసే వేదవ పనులు అన్ని చెప్పించి , చానల్ రేటింగ్ లు పెంచుకోవడం ద్వారా కోట్లు సంపాదిద్దాం అనుకుంటే అంత కంటె నీచమైన పని ఇంకొకటి లేదు . మీరూ ఒక కుటుంబం లో బిడ్డలే అని గుర్తు ఉంచుకుంటె ఇలాంటి ప్రోగ్రామ్ లు చేయరు. 

       ". మన దేశ విశిష్టతే పటిష్టమైన కుటుంబ  వ్యవస్థ . అటువంటి  కుటుంబ  విలువలు కాపాడడం మన అందరి విదీ ." . అందులో బాగంగా పై కార్యక్రమాలను ఆపుచేయాలని సంబందిత T.V చానళ్ళను ఈ   టపా ద్వారా కోరడమైనది. 
  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!