గోత్రం తెలియక తాతతోనే డేటింగ్ చేసిన మనవరాలు !

                                                                       


     మీకొక కధ చెపుతాను . అనగనగా ఒక అమెరికన్ తాత . ఆ తాత వయస్సు 68 ఏండ్లు . ఆ తాత  గారికి యవ్వనం లో ఉన్నప్పుడు ఒక పెండ్లి , మధ్య వయసు లో మరొక పెండ్లి జరిగింది. మొదటి పెండ్లాం తన పిల్లలు తో సహా అతడిని విడిచి వెళ్లి పొతే , రెండవ పెండ్లి చేసుకోవలసి వచ్చిoది  . ఆ తర్వాత ఆ రెండవ ఆవిడ కూడా ఈయన దగ్గర డబ్బు లేదని విడాకులు తీసుకుని వెళ్లిపోయింది  . ఎలాగో బ్రతుకు ఈడుస్తూన్న ఆయనకు 68 ఏండ్లు వచ్చాయి . గత ఏడాది అదృష్టం వరించి  ఒక లాటరీ తగిలి కోటీశ్వరుడు అయ్యాడు. దానితో వయసులో పొందలేని ఆనందాన్ని తిరిగి పొందాలని నిర్ణయించుకుని తగిన వధువు కోసం డేటింగ్ సైట్లు చూడటం మొదలెట్టాడు  .

                       అలా డేటింగ్ సైట్లు చూస్తున్నప్పుడు ఈ తాత ప్రొపైల్ చూసి 28 ఏండ్ల అమ్మాయి మనసు పారేసుకుంది . అలా ఆవిడా మనసు పారేసుకోవడానికి తాత  గారి వయసు  అభ్యంతరం కాలేదు. అంటే తాత  గారి వయసు కంటే అయన వెనుక ఉన్న కోట్లే ఆమెను అమితంగా ఆకర్షించిoది  . అందుకే తాత వయసు ఉన్న వ్యక్తి తో డేటింగ్ కి సై అనటం , డేటింగ్ చేయటం , ఆ డేటింగ్ లో ఇద్దరు ఒకరి నొకరు ఇష్టపడడం , పెండ్లి చేసుకోవడం జరిగి పోయాయి . అలా వారు దంపతులుగా మారి తమ స్వంత ఇంట్లో కాపురం చేయసాగారు.

                                                                     

     
                  ఒక రోజు తన ముద్దుల ముసలి మొగుడి ఆల్బమ్ చూస్తున్న కుర్ర పెళ్ళానికి , అందులో తన తండ్రి ఫొటో ఉండడం చూసి ఆశ్చర్య పోయి "ఈయన ఎవరు ప్రియా " అని అడిగిందట . "అతను నా కొడుకు ప్రియతమా " అన్నాడు ముసలి ప్రియుడు . "ఓ మై గాడ్ ! ఈయన మా నాన్నా " అని అరచినంత పని చేసింది ఇల్లాలు . "ఓరి దేవుడా ! ఎంత పని జరిగింది . ముసలి తనం లో ఇంత ముద్ద పెట్టాల్సిన మనవరాలు , ముద్దులు పెట్టె భార్యగా దొరికిందా " అని స్టన్ అయి పోయాడు  ముసలోడు. అలా మదన పడుతున్న తాతను చూసి ఓదార్చింది  మనవరాలు . "తాత  ఇప్పుడు ఏమంత కొంప మునిగింది అని బాధ పడుతున్నావు. మనం ఆధునికులం  . మనకు వావి వరుస , వయసు తార తమ్యం ఏమి లేవు కదా ! నీ  దగ్గర డబ్బు ఉంది . నా దగ్గర యవ్వనం ఉంది . ఆ యవ్వనం కోసం నీవు వేరొక దాని దగ్గరకు వెళ్లడం ఎందుకు? డబ్బు కోసం నేను వేరెవరికో ముద్దులు పెట్టడం ఎందుకు? ఇలాగే  ఇద్దరం కలసి ఉంటె మన ఆస్తి  మనకే ఉంటుంది కదా " అని సర్ది చెప్పింది  . ఆలా ఆ తాతా  మనవరాళ్లు భార్యా భర్తలుగా మారి కాపురం చేసుకుంటున్నారు. అది కధ  .

    అమెరికాలోని మియామీలో  పైన చెప్పిన కద నిజంగా జరిగింది అని ప్రపంచ వ్యాప్తంగా ప్రింట్ మీడియా , ఎలక్రానిక్ మీడియా కోడై కూసింది .  పై చిత్రం లో ఉన్న పేపర్ క్లిప్పింగ్ లో వివరాలు చూడవచ్చు. కానీ సభ్య సమాజం అంతా  ఛీ  ఛీ  అనడం  ప్రారంభించాక ఇదంతా ఒట్టిదే అని , ఫేక్ వార్తా అని అనడం  మొదలు పెట్టారు . ఇది నిజం అయినా కాకపోయినా , ప్రస్తుత  విదేశీ వివాహ సంస్కృతీ లో కనపడుతున్న ఆధునిక పోకడలు   ఇలాంటి  విపరీతాలు జరిగే అవకాశo ఉందని  చెపుతున్నాయి . కాబట్టి మన వివాహ వ్యవస్థలో పాటిస్తున్న ,  పెండ్లి చేసుకోవడానికి అటు కొన్ని తరాలు , ఇటు కొన్ని తరాలు చరిత్ర అన్ని కోణాల్లో  చూడాలన్న భారతీయ వివాహ సంస్కృతి మంచిదా  లేక ఫిజికల్ టెస్టింగ్ లు చేసుకునే డేటింగ్ సంస్కృతి మంచిదా అనేది ఆధునికులు ఆలోచించుకోవాలి . లేకుంటే తాతలే మొగుళ్ళు అవుతారు , మనుషులు జంతువులు అవుతారు.

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!