విజయలక్ష్మీ "బర్త్ డే " నాడే ఆమెను చంపి , బీర్ తో "డెత్ డే " సెలబ్రేట్ చేసుకున్నభర్త "నారాయణ రెడ్డి " !!!

                                                                     

                         

                              భార్యా భర్తల సంబందాలను అనుమానాలు , అపోహలు ప్రబావపరచినంతగా , వాస్తవాలు ప్రబావపరచవేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని ఉదంతాలు గురించి వింటుంటె. భార్యకైనా , భర్తకైనా తన జీవిత బాగస్వామి ప్రవర్తన మీద  అనుమానం కలిగితే తక్షణమే దానిని తీర్చుకోవడం మంచిది. అలాగే తన ప్రవర్తన మీద , తన జీవిత బాగాస్వామికి అపోహ ఏదో కలిగిందని బావించిన వారు కూడా , వారిది ఒట్టి అపోహ లేక అనుమానమే అని తేల్చి పారేయడం మంచిది. లేకుంటే అదే అనుమానం పెనుభూతమై చివరకు "ప్రాణ హాని " జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్తను కూల్చుతున్న ప్రదాన కారణాల్లో జీవితబాగస్వాముల ప్రవర్తన పట్ల అనుమానాలు కూడా ఒకటి . అలాంటి అ నుమానం తోనే  తన భార్య ను కర్కశం గా గొంతు కోసి చంపడమే కాక, ఆమె చావును ఆత్మ హత్యగా నమ్మింప చూసి , చివరకు పోలీసులకు పట్టుబడిన "నారాయణ రెడ్డి " ఉదంతం తెలుసుకుందాం .

    నారాయణ రెడ్డి , విజయలక్ష్మీ దంపతులు  బెంగళూరు లోని కోడిగేహళ్లి ఏరియా  లో నివాసం ఉంటున్నారు. వారికీ దిగంత్ అనే మూడేళ్ళ బాబు కూడా ఉన్నాడు. వారిద్దరు అన్యోన్యగానే కాపురం చేసుకుంటున్నారు అని ఇరుగు పొరుగు బావించే వారు. విజయలక్ష్మి ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా పని చేసేది . అయితే ఆమె ప్రవర్తన మీద భర్తకు అనుమానం కలిగింది. ఆమెకు మహేశ్ అనే వ్యక్తీ తో అక్రమ సంబందం ఉందనే అనుమానం అతని లో రోజు రోజుకి పెరిగిపోసాగింది. దానితో ఆటను ఎలాగైనా తన భార్యను , తన చేతికి మట్టి అంటకుండా కడతేర్చే ప్లాన్ వేసాడు.

      ఆ రోజు విజయలక్ష్మి పుట్టిన రోజు. తన ప్లాన్ అమలు కోసం ఆదే రోజును ఎంచుకున్నాడు నారాయణ రెడ్డి. భార్యకి ఏ మాత్రం అనుమానం రాకుండా ఆ రోజు సాయంత్రం భార్యా భర్తలు పిల్లాడిని తీసుకుని, బెంగలూరు లోనే వేరొక ప్రాంతం లో ఉన్న  విజయలక్ష్మీ పుట్టింటికి వెళ్ళారు . ఆ రాత్రి 11గంటల వరకు అక్కడే బర్త్  డే వేడుకలు చేసుకుని , ఇద్దరు తిరిగి రాత్రే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక కూడా ఇంకా ముచ్చట ముగించకుండా , బీర్, బ్రీజర్ తో పార్టి ఎంజాయి చేదాం అంటే విజయలక్ష్మీ కాదన లేక పోయింది. కొంతసేపు గడిచాక , మహేశ్ విశయం గురించి నారాయణ రెడ్డి ప్రస్తావించడం తో వారిద్దరి మద్స్య గొడవ జరిగి , చివరకు తను వేసుకున్న ప్లాన్ ప్రకారం నారాయణ రెడ్డి , విజయలక్ష్మీ గొంతును కత్తి  తో కోయడం తో , రక్తపు మడుగులో కొంత సేపు విల విల లాడి , పుట్టిన రోజునే ప్రాణాలు విడచింది విజయలక్ష్మి .

                 తర్వాత కేసు తన మీదకు రాకుండా ఉండటానికి , శవాన్ని ఆ గదిలోనే ఉంచి , గదికి గడియ వేసి , గదిలోని పై కప్పు ను కొద్దిగా తొలగించి , పక్కనే ఉన్న కిచెన్ రూం ద్వారా ముందు గదిలోకి వచ్చాడు. ఆ తర్వాత బీర్ ను సేవిస్తూ తెల్లవారుజాము 5. 30 గంటల వరకు గడపి , ఆ తర్వాత పక్కింటికి వెళ్లి, తన భార్య గడియ పెట్టుకుని నిద్రపోతుందని , ఎంతగా తలుపుకొట్టినా తీయటం లేదని, వారిని వచ్చి సహాయం చేయాలని కోరగా , వారు వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా లోపల రక్తపు మడుగులో పడి ఉన్న విజయలక్ష్మీ శవం కనపడింది. దానితో పోలీసులకు కబురు చేయడం , వారు వచ్చి శవాన్ని పరీక్షకు పంపి , విషయం ఏమిటని నారయణ రెడ్డిని అదిగారు.

                              అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం , "తన భార్యా పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నామని, అర్దరాత్రి ఇద్దరికీ ఒక విషయం లో గొడవ వచ్చి ఆమె కోపంతో లోపలికి వెళ్లి ఘడియ వేసుకుందని, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి శతవిదాల  ప్రయత్నించి , విపలమగుట వలన తెల్లారితే అన్ని సర్దుకుంటాయిలే అనే ఉద్దేశ్యం తో ముందు గదిలో పడుకుంటే , ఆమె ఆత్మహత్య చేసుకుని తన అన్యాయం చేసి పోయిందని "వగల మరి ఏడ్పులు ఏడ్చాడు అట. కానీ పోలీసులకు కొన్ని మిస్సింగ్ పాక్ట్ లు ఉన్నాయని  అనుమానం వచ్చి, రెడ్డి గారిని నాలుగు  పీకితే  ఉన్న విషయం మొత్తం బళ్ళున కక్కేసాడు. పాపం , నారాయణ రెడ్డికి పోలిసుల "దర్ద్ డిగ్రి " పద్దతులు గురించి ఎక్కువుగా తెలియదనుకుంటా ! లేక పోతే వేరె ప్లాన్ వేసి ఉండె వాడేమో !

   అలా తను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు, తను చేసిన ఘోర కార్యక్రమం గురించి తనే చెప్పి .  కటాకటాలు పాలు అయ్యాడు నారాయణ రెడ్డి. పాపం "దిగంత్ " తల్లిని కోల్పోయాడు. పచ్చని కుటుంబం మంత్రం వేసినట్లు కూలిపోయింది. ఒక చిన్న అనుమానం , ఇంతింతై వటుదింతై అన్నట్లు పెరిగి బార్యను హత్య చేసె వరకు వెల్లింది. భార్య భర్తల సంబందాలు సున్నితమైనవి. అనుమానం వచ్చినప్పుడు  దానిని మొగ్గలోనే త్రుంచి వేయడానికి బార్య భర్తలు ఇద్దరు చిత్తశుద్ది తో , నిజాయితితో వ్యవహరిస్తే మంచిది అని లేకుంటే , కుటుంబం నాశనం అవుతుందని తెలిపే ఉదంతాలలొ మరొక ఉదంతం గా పై కేసు రికార్డుల్లో చోటు చేసుకుంది .
         
             SOURCE:   http://timesofindia.indiatimes.com/city/bengaluru/Husband-kills-wife-convince-cops-its-suicide/articleshow/49096014.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI

                                                 (29/5/2015 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!