భగవత్ ప్రసాదాన్ని "అంగడి సరుకు"గా మార్చిన అధికార్లుకి ఏ పాపం చుట్టుకోదా?
అసలు వీరికి భగవంతుడు అంటే నమ్మక్కం ఉందా?. ఉంటే ఇలా చేస్తారా? చివరకు భక్తులకు పంచే ప్రసాదం కూడా అమ్ముతార?. కొనుకు తిన్నది అసలు భగవంతుని ప్రసాదం ఎలా అవుతుంది? ఖచ్చితంగా అది అంగడి సరుకే అవుతుంది! ఈ చిన్న విషయం తెలియక ఇన్నాళ్ళు మనం ఎంత తప్పు చేస్తున్నాం!ఒక్కసారి ఆలోచించండి ఓ భక్తులార, భగవత్సేవకులార,మనం భగవంతుని సన్నిదిలో, ఆయన దర్శనం అనంతరం తీర్థ, ప్రసదాలు స్వీకరించడం సాంప్రదాయం.అటువంటి తీర్థప్రసదలు, నాకు తెలిసి అన్ని దేవాలయాలలో ఉచితంగానే పెడతరు. భక్తులు వాటిని ఎంతో భక్తిప్రపత్తులతో స్వీకరించి, జన్మ ధన్యమైనట్లు బావిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని, అదే దేవాలయాలలో, ఆ దేవుని ప్రసాదమని చెప్పి, లడ్డూ, పులిహోర, ఇతర పదార్థాలు విక్రయం చేస్తుంటారు. వీటిని ఒక్కొక్కసారి,లాభ నష్టాల బేరిజులు వేసుకుని, పదార్థ పరిమాణాలు తగ్గిస్తూ ఉంటారు. అసలు దేవుని పేరు మీద ప్రసాదం అమ్మడం హిందూ మత సాంప్రదాయమా? అలా అయితే ఏ ధర్మసాశ్త్రం ప్రకారం వీటిని అమ్ముతున్నారో ఘనత వహించిన దేవాదయ శాఖా అధికార్లు, చెప్పాలి. భక్తులుకిచ్చే ప్రసాదం కూడా అమ్ముకుని