"పని నేర్చుకోండి ముందర,పెళ్లికెందుకు తొందర".పథకం అమలులో సక్సెస్ అవుతున్న ఇండియన్ యువత!!?
కొన్నేళ్ల క్రిందట మన గవర్నమెంట్ వారు విశేషం గా ప్రచారం చేసిన స్లోగన్ ఇది. ఆ రోజుల్లో తక్కువ వయస్సులో వివాహాలు చెయ్యడం,ప్రజలకు కుటుంబ నియంత్రణ పద్దతుల మీద అవగాహాన లేకపోవడం వలన కనీస వయస్సు రానిదే పెండ్లిళ్లు జరిపితే పుట్టబోయే పిల్లల ఆరోగ్యాలు,మాతా శిశు సంరక్షణ ఇవ్వన్నింటిని ద్రుష్టిలో పెట్టుకుని ’ముందు ఉద్యోగం తర్వాతె పెళ్లి’ అనే నినాదం ముందుకు తెచ్చారు. అంతవరకు బాగానే ఉంది...