"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !
నిజంగా ఇది చాలా విషాద కరమైన వార్తా!భార్యా భర్తల మద్య సంబందాలు నమ్మక్కం అనే పునాది మీద కట్టబడినవి . మరి ఆ పునాది బల హీనమైతే ఆ కట్టడం ఏదో ఒక నాడు కూలి పోవలసిందే! అదే జరిగింది ఈ కేసు విషయం లో . మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలంలో గల పాలెం గ్రామానికి చెందిన ఒక కుటుంభ విషాద గాద ఇది. అనుమానం అనే జబ్బు మనిషిని ఎంత నీచ స్తాయికి దిగజారుస్తుందో తెలియచెప్పే అంశం ఇది. నైతికత విషయం లో మన సమాజం పురుషుల కన్నా స్త్రీల కే ఎందుకు ఎక్కువుగా అంక్షలు విదించిందో ఈ కేసు గురించి వింటే అర్దమవుతుంది . వారు భార్యా భర్తలు. చాన్నాళ్ళు హాయిగా కాపురం చేసి ఇద్దరు మగపిల్లల్ని కన్నారు కాబట్టి అందులో భర్తకి బార్య మీద మొదట్లో అనుమానం ఉండేది కాదు అనిపిస్తుంది . కాని ఎందుకో అందులోని భర్తకు భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగింది. ఇది మద్యన పుట్టిన తెగులు కావచ్చు . ఆ అనుమానం ఇంతింతై , వటుడింతై చివరకు భర్తని ఉన్మాదిగా మార్చి వేసింది కాబోలు , కట్టుకున్న ఇల్లాలిని , కన్న కొడుకుల్ని అతి కిరాతకంగా