"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !
నిజంగా ఇది చాలా విషాద కరమైన వార్తా!భార్యా భర్తల మద్య సంబందాలు నమ్మక్కం అనే పునాది మీద కట్టబడినవి . మరి ఆ పునాది బల హీనమైతే ఆ కట్టడం ఏదో ఒక నాడు కూలి పోవలసిందే! అదే జరిగింది ఈ కేసు విషయం లో . మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలంలో గల పాలెం గ్రామానికి చెందిన ఒక కుటుంభ విషాద గాద ఇది. అనుమానం అనే జబ్బు మనిషిని ఎంత నీచ స్తాయికి దిగజారుస్తుందో తెలియచెప్పే అంశం ఇది. నైతికత విషయం లో మన సమాజం పురుషుల కన్నా స్త్రీల కే ఎందుకు ఎక్కువుగా అంక్షలు విదించిందో ఈ కేసు గురించి వింటే అర్దమవుతుంది .
వారు భార్యా భర్తలు. చాన్నాళ్ళు హాయిగా కాపురం చేసి ఇద్దరు మగపిల్లల్ని కన్నారు కాబట్టి అందులో భర్తకి బార్య మీద మొదట్లో అనుమానం ఉండేది కాదు అనిపిస్తుంది . కాని ఎందుకో అందులోని భర్తకు భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగింది. ఇది మద్యన పుట్టిన తెగులు కావచ్చు . ఆ అనుమానం ఇంతింతై , వటుడింతై చివరకు భర్తని ఉన్మాదిగా మార్చి వేసింది కాబోలు , కట్టుకున్న ఇల్లాలిని , కన్న కొడుకుల్ని అతి కిరాతకంగా చంపి చివరకు పాపబీతి తో కాశి కి వెల్లాడంట . కాని అక్కడా అతన్ని మనస్సు పీడించిందేమొ తానే తన కుటుంభాన్ని హతమార్చాను అని పోన్ చేసి బందువులకు చెప్పడం చేత పోలిసులు అతని మీద కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది .
పై కేసులో మనం ఆలోచించాల్సింది ఏమిటంటె ఇక్కడ కొండయ్యకు భార్య ప్రవర్తన మీద అనుమానం .అనుమానం ని ఒక రోగంగా అంటారు తప్పా దానిని మానసిక వ్యాది గా గుర్తించి "ఆరోగ్యశ్రీ " లో చేర్చారో లేదో తెలియదు . ప్రముఖ సైకియాట్రిస్ట్ ఇండ్ల రామ సుబ్బా రెడ్డి గారు , రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయనను , మానసిక రోగాలను ఆరోగ్యశ్రీ పరిదిలోకి తెమ్మని అడిగితె అయన O.K అన్నారట . కాని అది అమలు అవుతుందో లేదో తెలియటం లేదు. కావాలంటే క్రింది లింక్ ని చోడగలరు.
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rajiv-arogyasri-cover-for-psychiatric-diseases/article1387113.ece
వెనుకటి కాలంలో మాదిరి అనుమానపు మొగుళ్ళన్ని తన్ని కాపురం చేయించాల్సిన అవసరం నేడు లేదు. అసలు అనుమానం మొగుడితో కాపురం ఎంత నరకంగా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి . కాబట్టి రోగం ముదరక ముందే దానికి వైద్యం, చేయడం ఉత్తమ పద్దతి. ఒక వేళ రోగం ముదిరితే విడాకులు తీసుకుని కుటుంభాన్ని కాపాడుకోవడం మద్యమ పద్దతి. అసలు అనర్దం జరిగేదాకా " వాడి బుద్దే అంత లే , ఒట్టి అనుమ్మానపు పీనుగు" అంటూ అనర్దాలు జరిగేదాకా ఉండి , ఆ తర్వాత విచారించడం ఆదమ పద్దతి . పై కేసు ఆదమ పద్దతికి చెందింది. అందుకే భార్యా పిల్లలు హతమయ్యారు, భర్తకి ఉరిశిక్ష లేక యావజ్జీవం తప్పక పోవచ్చు.
నేను శీలవంతుడిని అని పురుషులు కాని స్త్రీలు కాని రుజువు చేసుకునే సైంటిపిక్ పద్దతులు ఏమి లేకపోవచ్చు. చట్టూ ఉన్న సమాజమే దానికి గీటు రాయి . అందుకే నైతిక వర్తన కలిగిఉoడటమే కాదు ఉన్నట్లు అనిపించాలి సమాజానికి .ఇలా చెప్పకూడదు కాని ఒక రకంగా నిజంగా నైతికంగా జీవించేవారికన్నా , జీవిస్తున్నట్లు ఉండే వారే సమాజంలో చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నారు. కారణం లైప్ పార్టనర్ లకి నమ్మక్కం ఉన్నంత కాలం వారి సంసారాలు సజావుగా సాగుతుండడమే కారణమ్. కాబట్టి ఆ నమ్మక్కాలను వమ్ము చేసే ఎటువంటి ప్రవర్తను అయినా నియంత్రించుకోవడమ్ మంచిది . కాదూ కూడదూ అంటే సంసార విచ్సినానికి తయారై పోవడమే.
మన పెద్దలు మగవాళ్ళ కంటె స్త్రీల మీదే ఎక్కువ ఆంక్షలు విదించారు అంటే దానికి సరి అయిన కారణం ఉంది పై కేసు ఉదంతం తెలియ చేస్తుంది . మొదటిది ఒక సమాజంలో ఉన్న స్త్రీలు అంతా కరెక్టుగా ఉంటే ఆటోమేటిక్ గా పురుషులూ ఉన్నట్లే . ఆప్కోర్స్ ఇప్పుడు గే, లెస్బియన్ కల్చర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అది పనికి రాక పోవచ్చు. రెండవది ఏమిటంటె పిల్లలు పుట్టక ముందు భార్యా భర్తలు అనైతిక వర్తనులు అయితే మాత్రం ఆ కుటుంభం లో భర్త చేసిన పని భార్యకు మాత్రమే నష్టం, కాని భార్య చేసే పని మొత్తం కుటుంబానికే నష్టం. వారసత్వాలని నిరంతరాయంగా పరిరక్షించుకోవడానికి ఏర్పడిన కుటుంబ వ్యవస్థ ఒక స్త్రీ కారణంగా నా శనమవ్వడం మంచి పరిణామం కాదు అని పెద్దల ఉద్దేస్యం. అయితే పిల్లలు పుట్టాక తప్పులు చేయొచ్చా అంటే , ఒక క్రమమైన జీవన సరళికి అలావాటు పడ్డాకా , దాని నుంచి వేర్పడడంకష్టం కాబట్టి సాద్యమైనంత వరకు వారు కరెక్టుగానే ఉండటానికి అవకాశం ఉంది .
పై కేసులో ఒక వేల కొండయ్య గారు తిరుగుబోతు అయినా వారి పిల్లలు కొండయ్య దంపతుల పిల్లలే ఔతారు తప్పా వేరే పిల్లలు అవకాశం లేదు . కాని అదే భార్య విషయం కాబట్టే ఆ ఆలోచనా భూతాన్ని భర్త ఇంకా మోస్తూ తన కుటుంభాన్ని ఆ భూతానికి బలి ఇచ్చాడు. నిజంగా అటువంటి తిక్కల పని చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు . ఇటువంటి కేసుల్లో D.N.A టెస్ట్ లు అనివార్యం అని సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి , ఒక వేళ అనుమానపు భర్తలు ఉంటె వారిని తెస్ట్ లు ద్వారా నోరు మోయించవచ్చు . తన మీద నమ్మక్కం లేని వారితో కాపురం చేయాలా వద్దా అన్నది ఆ భార్యా ఇష్టం మీద ఆదారపడి ఉంటుంది . కాబట్టి సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి పెండ్లికి ముందు ఎయిడ్స్ టెస్ట్ లు, పిల్లలు పుట్టాకా D.N.A టెస్ట్ లు కంపల్సరి చేస్తే సమాజంలో అనైతిక వర్తనం చాలా వరకు తగ్గే అవకాశమే కాక , పిల్లలు పొజిషన్ సేఫ్ లో ఉంటుంది . లేకపోతే కొండయ్య లాంటి ఉన్మాదుల చేష్టలు సమాజం లో మరింత పెరిగే ప్రమాదముంది . దానితో పాటు అనుమానం ఒక జబ్బు అని గుర్తించి దానిని తక్షణమే ఆరోగ్యశ్రీ లో చేర్చితే మంచిది . ఆ జబ్బును తగ్గించడానికి మెడికల్ కౌన్సిలింగ్ వతో కూడిన ప్యామిలీ కౌన్సెలింగ్ కంపల్సరి . లేకుంటే కొంపలు సరి .కుటుంభ వ్యవస్థ పరిరక్షణకు స్త్రీల మీద కొన్ని బాద్యతలు , పురుషులు కంటె ఎక్కువుగా ఉన్నాయి కాబట్టి అసలు కుటుంబ వ్యవస్తనే నాశనం చేయాలని చూస్తున్నారు కొంతమంది ఆదునిక వాదులు . గే లెస్బియన్ కల్చర్ లను ప్రోత్సహించడం కూడా అందులోని బాగమే .
మొత్తానికి మనకు శీలం విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !
see this aso http://ssmanavu.blogspot.in/2014/11/blog-post_25.html
(17/11/2014 Post Republished).
Comments
Post a Comment