మనకు కావల్సింది పార్టీలు మారే వారు కాదు, రాజకీయాలనే మార్చగలిగిన మగాళ్లు!

రాజకీయాలనే మార్చగల దమ్మున్న మగాడు . 

                                                             
(ఈ  పోస్ట్ నేను పార్లమెంట్ ఎన్నికలకు ముందు అంటే 1/6/2013 న ప్రచురించడం జరిగింది . ఇది నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు . అవినీతి మీద అంతిమ యుద్ధం చేయగల దమ్మున్న వారు అధికారానికి రావాలి అని ఇందులో అభిలషించడం జరిగింది . ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ఆ కోరిక నిజమౌవుతుంది అని అనిపిస్తుంది . కష్టపడకుండా మంచి సంతానాన్ని  , బాధలు పడకుండా నీతివంతమైన సమాజాన్ని తీర్చి దిద్దలేము అనేది గ్రహిoచబట్టే మెజార్టీ ప్రజలు బాధలు పడుతున్నా ,మోడీ గారి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అని నా అభిప్రాయం  . పెద్ద నోట్ల రద్దు అనేది అవినీతి నిర్ములనా చర్యల లో  భాగంగా కేంద్ర సర్కార్ తీసుకున్న అతి సాహసోపేతమైన మరియు అతి ముఖ్యమైన చర్య. ).
ఇక పాత పోస్ట్ చదవండి  
                                                     
  ప్రజలు అంటే ఎంత పిచ్చి పువ్వులుగా చూస్తున్నారో ఇటీవలి రాజకీయ నాయకుల దోరణి చూస్తుంటే అర్థమవుతుంది. నిన్న మొన్నటి దాక వినడానికే అసహ్యమ్ వేసేలా తిట్టుకున్న వారు, హఠాతుగా అర్థరాత్రి బుద్ది వచ్చిన వారిలాగ, తిట్టిన పార్టిలో చేరి,మారిన పార్టీ  కండువాలు కప్పుకుని,మాత్రు పార్టిలను తిడుతుంటే, పాపం లౌక్యం తెలిసిన వారు "జై" లు కొడుతుంటే, అది లేని ప్రజలు తెల్ల ముఖాలేసుకుని చూస్తున్నారు. పైగా తమ రాజకీయ రంకుతనాన్ని, నిర్లజ్జగా సమర్థించుకోవటం కోసం, జనోద్దరణ , ప్రాంత ఉద్దరణ, మంత్రాలు జపిస్తుంటే, ఇన్నాళ్ళు రాని ఆలొచనలు ఎన్నికల ముందే ఎలా వస్తున్నాయి అబ్బా, అని సామాన్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటునారు.

  ఈ దేశానికి పట్టిన ప్రధాన చీడ అవినీతి. దాని గురించి మాట్లాడే దమ్మున్న మగాళ్ళు ఎంత మంది ఉన్నారో వేళ్ల మీద లెక్క పెట్టి చెప్ప వచ్చు. తక్కిన వారంత "తక్కెట్లో కప్పల" బాపతే. వారి వల్ల అటు పార్టిలకు ఎమైనా జరుగుబాటు ఉంటుందేమో కాని, సమాజానికి ఒరిగేది ఏమి లేదు అనేది నిర్వి వాదాంశం. మరి కనీసం పార్టీ అధినేతలైన తమ తమ పార్టిలలొ ఉన్న అవినీతి పరుల మీద చర్యలు తీసుకుని, పార్టిలను ప్రక్షాళన చేస్తారా అని ఎవరైనా అడిగితే, దానిని మించిన మతి తక్కువ పని ఇంకొకటి లేదని నిష్కర్షగా చెప్పేస్తారు. మరి ఈ అవినీతి పరుల్ని పార్టిలలోనే పెట్టుకుని వీరే రకం సేవలు ప్రజలకు అందిస్తారో అర్హం కావటం లేదు. "అవినీతి పరులుతో అధికార పీఠమెక్కేకన్నా, నీతిపరులతో కూడి ప్రతిపక్షంలో కూర్చోవడమే మేలు". కాని అధికార మత్తు తలకెక్కిన వారికి ఈ సూత్రం రుచించదు. ఈ తకెట్లో కప్పలు ఆ తక్కెట్లోకి జంప్ చేస్తుంటే ఆ తక్కెట్లో కప్పల్ని ఇటు జంప్ చేయమని ప్రోత్సాహిస్తూ, అదేదొ రాజకీయ చతురత అని మురిసిపోతున్నారు. వీరికి బాకాలూదే మీడీయా చానళ్ళు  తోడు అయ్యాయి.

 ప్రస్తుతం   ప్రజలకు కావాల్సింది నీతివంతమయిన పాలన.దానికోసం అవసరమయితే పార్టీలను ప్రక్షాళన చెయ్యాలి. అవినీతి పరుల ఆటలు కట్టించాడానికి బావ స్వారూప్యమున్న పార్టీలతో మమేకం కావాలి.కనీసం ఒక్క సారి,ఒక్కసారైనా "అవినీతి" మీద అంతిమ యుద్దానికి సన్నద్దం కావాలి. లెకుంటే రాజకీయ పార్టిల స్తానం లో "దోపిడి ముటాలు" వెలిసి జాతిని దోపిడి చేస్తాయి. అటువంటి పరిస్తితులకు కారణమయిన వారిని భవిష్యత్ తరాల వారు క్షమించరు కాక క్షమించరు.     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!