ఆఖరుకు "గ్యాస్ ట్రబుల్ " ప్రచారానికి కూడా "ఆమె " యేనా ?!!!.

                                                                       


                               పై ఫొటో చూడండి . ఇది మనిషిలో ఉన్న గ్యాస్  ట్రబుల్ సమస్యకు నివారణ కొరకు ఉద్దేశించబడిన  ప్రకటన . గ్యాస్ ట్రబుల్ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. స్త్రీ పురుషులు ఇరువురిని బాగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి . అయితే దాని నివారణ కోసం మా మందులు వాడండి అని చెప్పే కంపెనీలకు మాత్రం పురుషులును తమ ప్రచారాల్లో వాడుకోవటం సుతారాము ఇంష్టం ఉండదు అనుకుంటా . అందుకే పై న చూపిన చిత్రం తాలూకు అడ్వేర్టైజ్  కంపెనీ వారు తమ గ్యాస్ ట్రబులు మందులు ప్రచారానికి స్త్రీ నే ఎంచుకున్నారు . ఆ ప్రచార చిత్రం లో కూడా స్త్రీ గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నట్లు కనిపించడం లేదు . ఎందుకంటే బాధను ప్రతిఫలించే ముఖం ను వారు మూసేసారు కాబట్టి . ఇప్ప్పుడు ఎవరికైనా ఆమె ఛాతీని  (?) పట్టుకున్న చేతులు , క్రింద ఇచ్చిన వ్యాక్యాలు చదివి "ఓహో ఇది గ్యాస్ ట్రబుల్ ప్రచార ప్రకటన " అని అనుకోవాలి . అయితే వినియోగదారుడైన సగటు ప్రేక్షకుడిని ఆకర్షించే అంశం మాత్రం ఇందులో కనపడుతుంది . అలా కనపడటం కోసమే  "ఆమె " అంటే స్త్రీని ప్రచార కంపెనీలు వారు ఉపయోగించుకుంటున్నారు.

                                న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అని మనువు మనుస్మ్రితిలో రాశాడని, ఈనాటివరకు స్త్రీవాదులు, అబ్యుదయవాదులు,నానారకాలుగ విమర్సిస్తున్నారు. స్త్రీ వికాసానికి దోహదపడే స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఇవ్వాల్సిందే . అందులో ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు . అమ్మ జ్ఞాన వంతురాలైతే కుటుంబం సరస్వతి నిలయం అవుతుంది అనేదే హిందూ సాంప్రదాయ భావన . పూర్వం కొన్ని అనివార్య కారణాలు వలన స్త్రీలకు కొన్ని కట్టడులు చేయాల్సి వచ్చింది . అది  సమకాలీన సామాజిక పరిస్తుతులుకు అనుగుణంగా సడలించుకుంటూ వస్తూనే ఉన్నారు . కాబట్టే "ఉద్యోగం పురుష లక్షణం " అనే భావన నుండి, ప్రస్తుత ఆర్థిక అవసరాలను అధిగమించడానికి   "చన్నీళ్ళకు వేడి నీళ్లు తోడు " అనే భావన పెంపొందించుకోవటం వలన  స్త్రీలకు  ఉద్యోగ స్వేచ్ఛ లభించింది . కానీ అంతిమంగా ఆలోచిస్తే స్త్రీ బ్రతుకు "అరక కట్టిన ఆవు " మాదిరి తయారు అయిందని చెప్పక తప్పదు. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను . ఇప్పుడు మాత్రం స్త్రీ వృత్తి స్వేచ్ఛను  ఆధునిక వ్యాపార వాదం ఎలా ఉపయోగించుకుంటుందో చూదాం .

                                ఆధునిక వ్యాపార వాదం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలంటే , వారి ఉత్పతులకి పబ్లిసిటీ ఏంతో అవసరం . పబ్లిసిటీకి  పదిమందిని ఆకర్షించగల వారు అవసరం . దానికి బాగా ఉపయోగపడేది స్త్రీల శరీరమే . అందుకే ప్రచారం చేసే వస్తువు స్త్రీ సంబంధం అయినా కాకపోయినా స్త్రీలనే ప్రచార సాధనాలుగా వాడుతూ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు . ఇదే విషయం మీద ఈ  బ్లాగులో ప్రచురించబడిన పాపులర్ పోస్ట్ డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"? ని చూస్తే ఆధునిక స్త్రీలు  వ్యాపారసంస్కృతికి ఎలా వాడబడుతున్నారో అర్ధం అవుతుంది. ఒక వేళా భారతీయ సాంప్రదాయ భావం-- "ఎక్కడ స్త్రీలు పూజించబడతారో , అక్కడ దేవతలు నివసిస్తారు " -- బలంగా సమాజం లో ఉంటె ఈ కంపెనీల వ్యాపార ప్రచారాలు  ఇంతగా సాగేవి కావు. అందుకే వారికి భారతీయ స్త్రీలను ఎదో వంకతో బయటకు తీసుకు రావాలంటే భారతీయ సాంప్రదాయిక భావనలు మీద దాడిచేయడమే ఏకైక మార్గం అని తలిచారు.
                                                                         
ఇదీ వ్యాపార సంస్క్రుతి అసలు స్వరూపం.పురుషుడికి అవసరమైన బోగ వస్తువులు మందు, మగువ. ప్రపంచ వ్యాప్తంగ ఈద్రుక్పదంలో మార్పు లేదు.



                                     అందులో భాగంగానే విదేశీ కంపెనీలు "మా బట్టలు మా ఇష్టం "అనే తరహా  కుహనా స్త్రీవాదం కి పైసలు ఇచ్చి మరి ప్రోత్సాహిస్తున్నారు . దీనివలన ఆధునికులం అని చెప్పుకునే కొంతమందికి నైతికజీవనం అంటేనే   పరమ చాందస భావంగా మారిపోయింది . ఎదో పాటలో చెప్పినట్లు సిగ్గూ , ఎగ్గులను గాలికొదిలేసి కెమెరాల ముందు  అంగప్రదర్శనాలు చేయడం కి రెడీ అయిపోతే , ఆ అంగాలు ను తమ కంపెనీ ఉత్పతులతో పోలుస్తూ ప్రచారాలు సాగిస్తున్నాయి కంపెనీలు .తమకు లభించిన స్వేచ్చతో జ్ఞానవంతురాలిగా, సమాజం లో పురుషునితో పాటు సమానంగా ఉండాల్సిన మహిళా ఇలా కంపెనీ సరుకుగా మారి పోవడానికి కారకులు ఎవరు? సాంప్రదాయ వాదమా? అర్ధం పర్థం లేని ఆధునిక స్త్రీ స్వేచ్చా వాదమా?

       ఈ దేశం లో జ్ఞానం  కంటే ముందు స్వేచ్ఛ ను ఇవ్వడం వలన దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియని కొంతమంది  చివరకు కంపెనీల చేతిలో "అనైతిక స్వేచ్చా బానిసలు " అయ్యారు . బానిసత్వానికి , స్వేచ్చ రెండూ పరస్పర విరుద్దాలు కదా , మరి "స్వేచ్చా బానిసత్వం " ఏమిటి అంటారా?   బానిసలలో 2 రకాలు . కట్టు లేక నిర్బంధ బానిసలు  మొదటి రకం .వీరికి ఇష్టం  లేకపోయినా  బానిసత్వం స్వీకరించాల్సిందే . రెండవ రకం వారు స్వేచ్చా బానిసలు . తమకేదో ఒరుగుతుంది అనే భ్రమ  తో ఇష్టపూర్వకంగానే అనైతిక జీవన విధానానికి అలవాటుపడి ఇక ఎంత కోరుకున్నా అందులొనుండి బయటకు రాలేని నిర్భాగ్యులు .

                          కుటుంబ సంకెళ్లు తెంచుకు రా , తెంచుకు రా , అని గోలచేస్తున్న కుహనా స్ర్తివాదం చివరకు స్త్రీలను ఇలా వ్యాపార వస్తువులుగా మార్చి , ఆధునిక వ్యాపార వాదం  అభివుద్ది చెందటానికి  సహాయం చేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్పా , నిజమైన స్త్రీ వికాసానికి కాదు అనేది సత్యం .సత్యం .సత్యం. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!