స్త్రీ జనోద్దరణ అంటే "మొగుడ్నిమొదటి దెబ్బ.కొట్టు" అని ", పెళ్ళానికి పనికి మాలిన సందేశం ఇవ్వడమా!?
ఈ మద్య పనీ పాట లేని కుర్రకారు కొంతమంది , సోషల్ మీడియాల్లో పాపులారిటి తో పాటు డబ్బులు కూడా వస్తాయని కాబోలు అర్ధం పర్దం లేని స్వీయ కల్పిత సన్నివేశాలు ను చిత్రీకరించి , వాటిని తమ విశ్లేషణ లకు అనుకూలంగా ఎడిటింగ్ లు చేసి యూ ట్యూబ్ లో పెట్టేస్తున్నారు . వాటిలొ ఒకటి నిన్న చూసాను . దాని సారాంశం ఏమిటంటే పురుషులు తమ బార్యలను పబ్లిక్ గా ఎంత హింసించినా పట్టించుకోని పబ్లిక్ , అదే స్త్రీ తన ఆత్మ రక్షాణార్దమ్ తిరిగి భర్త ని ఒకటి కొడితే పబ్లిక్ అంతా పోగయి వారిని విడదీసి , అతనికి సపోర్ట్ గా నిలుస్తారట! అందుకే ఎప్పుడైనా సరే భర్త వయిలెంట్ అయితే మొదటి దెబ్బ భార్యయే కొట్టాలట! లేకపోతే ఆమెకు ఛాన్స్ రాదనీ దిక్కుమాలిన సందేశం ఇస్తుంది క్రింద ఇవ్వబడిన "First Slap From you :elimination of violence against women" .
అబ్బా! ఎంత గొప్ప సందేశం. భార్యా భర్తల గొడవల్లో ఒకరు ఉద్రేక పడినప్పుడు , మరొకరుతగ్గిఉండి గొడవ తగ్గుముఖం పట్టేలా చేయాలి. అదీ సంసార జ్ఞానం తెలిసిన భార్యా భర్తలు చేయాల్సిన పని . అసలే కోపంగా ఉన్న సహజ శారిరక బలం ఉన్న భర్తని , పెడేల్మని ముందుగా ఒక దెబ్బ అబల అయిన బార్య కొడితే ఆమే మీద అతని వయలెన్స్ పెరుగుతుందా ? తగ్గుతుందా? స్త్రీల మీద వయలెన్స్ తగ్గాలని నిజంగా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఇలాంటి బుద్ది తక్కువ సందేశం ఇస్తారా?
అసలు అ వీడియో లో ఉన్నదేమిటి? భార్యా భర్త లు లేక అటువంటి రిలేషన్ ఉన్న యువతీ యువకులు ఇద్దరూ పబ్లిక్ పార్కుల్లో గొడవపడుతుంటారు. అందులో యువకుడు ఆ అమ్మాయిని ఆవేశంలో రెండు చెంప దెబ్బ లు కొడతాడు. పబ్లిక్ కి విషయం అర్ధం అయి వారి దగ్గరకు వచ్చేలోపే ఆ అమ్మాయి అతన్ని కొడుతుంది . పై పెచ్చు జనాల్ని, అతను కొడుతుంటే పట్టించుకోని వాళ్ళు తానూ కొడితే ఎందుకు తమ విషయంలో జ్యోక్యమ్ చేసుకోవాలి అని తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటుంది . వాస్తవానికి వారిద్దరిని శాంతింప చేసి "ఇంటికి వెళ్లి మాట్లాడుకోండి . ఇలా గొడవపడడం మంచిది కాదు " అని అక్కడ ఉన్న పెద్దలు చెప్పడం, సమాజం పురుషులకు రక్షణ ఇస్తూ స్త్రీల మీడ దాడులను పట్టించుకోదు అని చెప్పడమే , వీడియో విశ్లేషణ .ఇది ఎంత సత్య దూరం! పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చనే అని , తప్పుడు బావాలని సమాజంలో వ్యాప్తి చేయాలనుకునే వారికి వచ్చే పనికి మాలిన ఆలోచనలు ఇవి. నాకు తెలిసినంత వరకు పబ్లిక్ లో సాధరణ ప్రజలు ఎవరూ ఆడపిల్లను హింసిస్తుంటెఊరుకోరు . అవసరమైతే మగవాదినే రెండు కొట్టి ఇంటికి పోయి సమస్య పరిష్కరించుకోమంటారు . అసలు వీదుల్లో కుక్కల్లా కొట్లాడుకొవడమే తప్పైతే , ఇంకా స్త్రీలను మరింత హింసకు గురి చేసే సందేశం ఇస్తారా? వీల్లకి నిజం,గా భార్యా భర్తల మద్య గొడవల గురించి అవగాహన ఉందా అనే అనుమానం కలుగుతుంది. స్త్రీ రక్షణ అంటె కుటుంబాలను కూల్చడం కాదు . భార్యా భర్తల సమస్యలు గురించి వారు తెలుసుకునేలా చెసే ఏ చిన్న పని చేసినా శబాష్ అంటారు కాని, ఇలా పనికి మాలిన వీడియోలు తీసి పబ్లిక్ లోకి వదిలితే ఎలా/
సంసార గొడవలుకి , కుస్తీ పోటిలకి తేడా తెలియని మూర్కులు ఇచ్చే సందేశాలు ఇలాగే ఉంటాయి . తోలి దెబ్బ కొట్టు, మలి దెబ్బ కొట్టు అని!
మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .
( 13/11/2014 Post Republished).
Comments
Post a Comment