సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గృహ హింస చట్టం వర్తించేది తాళి కట్టించుకోని బార్యలకు తప్పా, తగులుకున్న తరుణుల(concubine) కు కాదు!

                                                                     


                            మొన్న  26-11-2013 న సుప్రీం కోర్టువారు ఇంద్ర శర్మ వర్సెస్ V .K.V శర్మ అనే కేసులో ఒక లాండ్ మార్క్ తీర్పును వెలువరించారు. ఆ తీర్పు వివాహ సంబందాలు, సహజీవన సంబందాలు విషయాన్ని చాలా కో కూలంకషంగా చర్చించి ఆ కేసులో బాదితురాలైన సహజీవన మహిళ కి వ్యతిరేకంగా కేసును కొట్టివేయడం జరిగింది. కానీ మన రాష్ట్రం లోని కొన్ని వార్తా పత్రికలూ, అబ్యుదయ స్త్రీ సంఘాల వారమని చెప్పుకుంటున్న వారు , సహజీవనం ని సుప్రీం కోర్టు నేరమూ కాదు , పాపమూ కాదంది. పైపెచ్చు సహజీవనం చేసే స్త్రీలకు కోడా బార్యహోదా లాంటి హక్కును కల్పించమని పార్లమెంట్ కు సూచనలు చేసిందని అజ్ఞానంగా ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. నేను ఇందాక ఒక టి.వి. చానల్ లో ఒక ఫెమినిస్ట్ చేసిన వాదన విని చాల ఆశ్చర్య పోయాను. ఆమె వాదం ప్రకారం , బార్య ఉందని తెలిసి ఆమె భర్త తో సహజీవనం చేసిన స్త్రీకి అన్ని హక్కులు ఇవ్వాల్సిందే నట! . ఇక్కడ ఆ సహజీవని హక్కు కోరేది పురుషునికి వ్యతిరేకంగా తప్పా , అతని బార్యకు వ్యతిరేకం కాదట. ఎంత అజ్ఞానం! ఎంత అనా లోచితం! తోటి స్త్రీ ని భర్త ప్రేమకు దూరం చెయ్యడమే కాక , ఆమె పిల్లలను కూడా  తండ్రి ప్రేమకు దూరం చేసిన ఆ అక్రమ సంబదీకురాలు పైన సమాజం జాలి చూపించాలా?ఆమెకు హక్కులు కల్పించాలా ? అటువంటి సంబందాలను ఇదే కేసులో సుప్రీం కోర్టు వారు "నేరపూరితమైనవి  " అని చెప్పడమే కాక , బాదితులైన అసలు బార్య, ఆమె పిల్లలు ఈ అక్రమ సంబదీకురాలిపై సివిల్ కేసులు పెట్టే హక్కు ఉందని కూడా  స్పష్టంగా చెప్పటం జరిగింది. సుప్రీం కోర్టు వారి తీర్పులో


STATUS OF THE APPELLANT   

56. Appellant, admittedly, entered into a live-in-relationship with the respondent knowing that he was married person, with wife and two children, hence, the generic proposition laid down by the Privy Council in Andrahennedige Dinohamy v. Wiketunge Liyanapatabendage Balshamy, AIR 1927PC 185, that where a man and a woman are proved to have lived together as husband and wife, the law presumes that they are living together inconsequence of a valid marriage will not apply and, hence, the relationship between the appellant and the respondent was not a relationship in the nature of a marriage, and the status of the appellant was that of a concubine. A concubine cannot maintain a relationship in the nature of marriage because such a relationship will not have exclusivity and will not be monogamous in character.

Reference may also be made to the judgments of this Court in Badri Prasad v. Director of Consolidation 1978 (3) SCC 527and Tulsa v. Durghatiya 2008 (4) SCC 520. In Gokal Chand v. Parvin Kumari AIR 1952 SC 231 this Court held that the continuous cohabitation of man and woman as husband and wife may raise the presumption of marriage, but the presumption which may be drawn from long cohabition is a rebuttable one and if there are circumstances which weaken and destroy that presumption, the Court cannot ignore them. Polygamy, that is a relationship or practice of having more than one wife or husband at the same time, or a relationship byway of a bigamous marriage that is marrying someone while already married to another and/or maintaining an adulterous relationship that is having voluntary sexual intercourse between a married person who is not one's husband or wife, cannot be said to be a relationship in the nature of marriage.

57. We may note, in the instant case, there is no necessity to rebut the presumption, since the appellant was aware that the respondent was a married person even before the commencement of their relationship, hence the status of the appellant is that of a concubine or a mistress, who cannot enter into relationship in the nature of a marriage. Long standing relationship as a concubine, though not a relationship in the nature of a marriage, of course, may at times, deserves protection because that woman might not be financially independent, but we are afraid that DV Act does not take care of such relationships which may perhaps call for an amendment of the definition of Section 2(f) of the DV Act, which is restrictive and exhaustive.

ALIENATION OF AFFECTION
64. Appellant had entered into this relationship knowing well that the respondent was a married person and encouraged bigamous relationship. By entering into such a relationship, the appellant has committed an intentional tort, i.e. interference in the marital relationship with intentionally alienating respondent from his family, i.e. his wife and children. If the case set up by the appellant is accepted, we have to conclude that there has been an attempt on the part of the appellant to alienate respondent from his family, resulting in loss of marital relationship, companionship, assistance, loss of consortium etc., so far as the legally wedded wife and children of the respondent are concerned, who resisted the relationship from the very inception. Marriage and family are social institutions of vital importance. Alienation of affection, in that context, is an intentional tort, as held by this Court in Pinakin Mahipatray Rawal case (supra), which gives a cause of action to the wife and children of the respondent to sue the appellant for alienating the husband/father from the company of his wife/children, knowing fully well they are legally wedded wife/children of the respondent..

65. We are, therefore, of the view that the appellant, having been fully aware of the fact that the respondent was a married person, could not have entered into a live-in relationship in the nature of marriage. All live-in-relationships are not relationships in the nature of marriage. Appellant's and the respondent's relationship is, therefore, not a "relationship in the nature of marriage" because it has no inherent or essential characteristic of a marriage, but a relationship other than "in the nature of marriage" and the appellant's status is lower than the status of a wife and that relationship would not fall within the definition of "domestic relationship" under Section 2(f) of the DV Act. If we hold that the relationship between the appellant and the respondent is a relationship in the nature of a marriage, we will be doing an injustice to the legally wedded wife and children who opposed that relationship. Consequently, any act, omission or commission or conduct of the respondent in connection with that type of relationship, would not amount to "domestic violence" under Section 3 of the DV Act.

66. We have, on facts, found that the appellant's status was that of a mistress, who is in distress, a survivor of a live-in relationship which is of serious concern, especially when such persons are poor and illiterate, in the event of which vulnerability is more pronounced, which is a societal reality. Children born out of such relationship also suffer most which calls for bringing in remedial measures by the Parliament, through proper legislation.

67. We are conscious of the fact that if any direction is given to the respondent to pay maintenance or monetary consideration to the appellant, that would be at the cost of the legally wedded wife and children of the respondent, especially when they had opposed that relationship and have a cause of action against the appellant for alienating the companionship and affection of the husband/parent which is an intentional tort.

68. We, therefore, find no reason to interfere with the judgment of the High Court and the appeal is accordingly dismissed.

........................J. (K.S. Radhakrishnan)

........................J. (Pinaki Chandra Ghose)

New Delhi

November 26, 2013





  టూకీగా కేసు ఏమిటంటే ఒక శర్మ గారికి పెండ్లి  అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అది తెలిసి కూడా  ఇంద్ర అనే ఆవిడ అయన గారితో పద్దెనిమిదేండ్లు సహజీవనం చేసింది. ఆ తర్వాత వారిద్దరి మద్య ఏవో గొడవలు వచ్చి, అయన తన బార్యా బిడ్డలతోనే ఉండటం మొదలు పెట్టాడు. దానితో గృహ హింస చట్టం క్రింద కేసు పెట్టి, ఇంట్లో వాట తో పాటు , 18 లక్షలు జీవన బ్రుతి గా ఇవ్వాలని కోర్టులో కేసు పెడితే క్రింది కోర్టులు ఆమె మరియు అతని మద్య ఉన్నది వివాహం చేసుకోపోయినా , వివాహ సంబందం లాటిందే అని తీర్పులు చెప్పాయి. దాని మీద అయన హైకోర్టులో అప్పీల్ వేస్తే వారి మద్య ఉన్నది  అక్రమ సంబందమే తప్పా , వివాహ సంబందం లాటిది కాదని క్రింది కోర్టుల తీర్పును కొట్టి వేసింది. దాని మీద ఆవిడ గారు సుప్రీం కోర్టులో అప్పీల్ వేస్తే , సుప్రీం కోర్టువారు కూడా  హాయ్ కోర్టు తీర్పునే సమర్దిస్తూ , ఆమె అప్పీల్ ను కొట్టి వేసారు.

    అయితే ఇటువంటి కేసులలో పురుషుడికి పెండ్లి అయిందని  రెండవ స్త్రీకి తెలియక పోతే అటువంటి వారికి గృహ హింస చట్టం క్రింద పరిహారాలు కోరవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది. అంతే కాక పెండ్లి చేసుకో పోయినా ఒక పెండ్లి కానీ స్త్రీ పురుషులు ఇరువురూ ఒకే ఇంటిలో బార్యా భర్తల మద్య ఉండే సంబందం లాంటి సంబందం కలిగి ఉన్నా , గృహ హింస చట్టం వర్తిస్తుంది అని చెప్పటం జరిగింది. పై కేసుల లాంటి  కేసులలో ఒక వేళ స్త్రీలు ఏ ఆదారం లేని వారు అయితే , అలాగే పిల్లలు ఉంటే వారి పరిస్తితి అగమ్యగోచరం కాబట్టి , వారి కోసం  చట్ట సవరణలు చేయాలని చెప్పింది. పెండ్లి కానీ వారికి కూడా   ఎన్నో విషయాలు అంటే సహా జీవనం ఎన్నాళ్ళు సాగింది, వారిద్దరి మద్య ఉన్నది నిజమైన సంబందమా లేక ఏదో ఆశించి ఏర్పరచుకున్నదా ? ఇలాంటి విష యాలు కూలంకషంగా   పరిశిలించాకే ఆ యా కేసులను బట్టి కోర్టులు  ఒక నిర్దారణ కు రావాలని చెప్పింది . అంతే గానీ పెండ్లి పెటాకులు లేకుండా , ఇష్టం అయిన వారితో ఇష్టం వచ్చినంత కాలం కలసి ఉండి , ఇష్టం తగ్గగానే వారి మీద కేసులు పెట్టి లబ్ది పొందమని చెప్పలేదు. పెండ్లి అయిన వారిని తో సహజీవనం చేసే స్త్రీల మీద సివిల్ మరియు క్రిమినల్ కేసులు పెట్టె హక్కు బార్యా పిల్లలకు ఉందని మరొక మారు ఈ   తీర్పు  నొక్కి చెప్పింది.

  నిర్బాగ్యులైన సహజీవనం  చేసే ఇంద్ర లాంటి స్త్రీలు కు ఒక వేళ ఏమన్నా పరిహారం ఇప్పించాలన్నా ,చట్ట సవరణలు అవసరం కాబట్టి ఆ పని పార్లమెంట్ చేయవచ్చు అంది. అయితే ఈ  విషయం లో కొంచం ఆలోచించి చట్ట సవరణలు చేయాలి. ఇటువంటి వారికి   ప్రభుత్వమే  పరిహారం ఇచ్చేటట్లు   చట్టం చేస్తే బాగుంటుంది. పే దరికం పేరుతో నేరాలను ప్రోత్సాహించడం, ఒక స్త్రీ ని ద్రుష్టిలో పెట్టుకుని మరొక స్త్రీకి అన్యాయం జరిగేలా చట్ట రచన చెయ్యడం సమాజానికి మంచిది కాదు. దీని మీద విపులంగా ఇంకొక టపాలో నా అభిప్రాయాలు వివరిస్తాను.
                                                         (29/11/2013 Post Republished).                                                      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.